Advertisement
Google Ads BL

నాని 'యుద్ధం'కి డేట్ ఫిక్స్..!


ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో నేచుర‌ల్ స్టార్ నాని 'కృష్ణార్జున‌ యుద్ధం'.. ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్‌

Advertisement
CJ Advs

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' నుండి రీసెంట్‌గా విడుద‌లైన 'ఎంసీఏ' వ‌ర‌కు ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న నేచర‌ల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు. 

ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇందులో కీల‌క‌మైన స‌న్నివేశాలను  చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Nani Krishnarjuna Yuddham Release Date April 12, 2018:

Post the decent revenues piled for averagely rated MCA, here is Nani looking ahead for his next release Krishnarjuna Yuddham.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs