Advertisement
Google Ads BL

బ్రదర్ సెంటిమెంటే 'ఇంద్రసేన' బలం!


కేవలం కమర్షియాలిటీనే కాదు, తను చేసే ప్రతి క్యారెక్టర్ తో ఎంతో సామాజిక బాధ్యతను గుర్తుచేసే హీరో విజయ్ ఆంథోని. ఇక సినిమాల ఎంపికలో ఉత్తమాభిరుచి గల నిర్మాత నీలమ్ కృష్ణారెడ్డి. వీరిద్దరి కలయికలొ వచ్చిన లేటెస్ట్ సెన్సెషనల్ మూవీ 'ఇంద్రసేన'. వైవిధ్యమైన కథ, రియలిస్టిక్ టేకింగ్.. ఇంద్రసేన సినిమా చూసిన వారి నుంచి వినిపిస్తున్న ఫీడ్ బ్యాక్ ఇది. నవంబర్ 30న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా కంటెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. తన ప్రతి సినిమా కథకు, అందులొ తన పాత్ర వెరైటీకి ప్రాధాన్యతనిస్తూ డిఫరెంట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ ఆంథోని ఇంద్రసేన, రుద్రసేన గా రెండు పాత్రల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడిగా తొలి సినిమాని  వైవిధ్యమైన కథనంతో నడిపించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు దర్శకుడు జి. శ్రీనివాసన్. 

Advertisement
CJ Advs

సెన్సిబుల్ పాయింట్ కు ఇటు సెంటిమెంట్ ను, అటు ఎంటర్ టైన్మెంట్ ను జోడించి కమర్షియల్ గా కొత్త ఫార్మాట్ లో తెరకెక్కించటం ఆడియెన్స్  ను ఆకట్టుకుంటొంది. ఇక జిఎస్టీ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఇంద్రసేనకు మరో ఎసెట్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ వాస్తవిక సంఘటను చూసినట్టుగా చూపిన తీరు ఇంద్రసేనకు ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ తీసుకురావటంలో ప్రముఖ పాత్ర  పోషించింది. ఓవరాల్ గా విజయ్ ఆంథోని మరో సక్సెస్ ఫుల్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన అన్ని సెంటర్స్ లో ఇంద్రసేన గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించటమే కాకుండా నిర్మాతగా తనకు హ్యాట్రిక్ హిట్ ని అందించిందని నీలమ్ కృష్ణారెడ్టి ఆనందాన్ని వ్యక్తం చెస్తున్నారు. 

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలమ్  కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్

Indrasena Movie Talk:

Producer Happy with Indrasena movie Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs