Advertisement
Google Ads BL

నితిన్ హీరో గా శ్రీనివాస కల్యాణం


యువ కథానాయకుడు నితిన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త సినిమా నిర్మించబోతోంది. ఈ చిత్రానికి "శ్రీనివాస కల్యాణం" అనే పేరు నిర్ణయించారు. 14 ఏళ్ల క్రితం దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన శతమానంభవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం' గా స్వర్ణకమలం అవార్డ్ అందుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

Advertisement
CJ Advs

2018 మార్చిలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్రావణ మాసంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె  మేయర్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియచేస్తామని యూనిట్ తెలియచేసింది.

Nithiin to Act in Srinivasa Kalyanam Movie:

<span>Nithiin&nbsp;</span>and Dil Raju to team up for Srinivasa Kalyanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs