Advertisement
Google Ads BL

భాగమతి గ్రాండ్ రిలీజ్ ఎప్పుడో తెలిసింది!


గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న అనుష్క, అశోక్, యువి క్రియేషన్స్ భాగమతి గ్రాండ్ రిలీజ్ 

Advertisement
CJ Advs

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో... భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అనుష్క గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్నంతగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న భాగమతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి.... రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... బాహుబలి చిత్రంతో తన ఫేంను, క్రేజ్ ను మరింత పెంచుకొని సూపర్ ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని మేం నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఫస్ట్ లుక్ కు వస్తున్న రెస్పాన్స్ మా టీంకు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఈ చిత్ర కథ అద్భుతంగా కుదిరింది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అశోక్ అద్బుతంగా తెరకెక్కించాడు. అనుష్క పెర్ పార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. భాగమతి కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న అత్యధిక థియేటర్లలో భాగమతి చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అని అన్నారు. 

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

సంగీతం - ఎస్.ఎస్.తమన్సి ,నిమాటోగ్రాఫర్ - మథి, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, నిర్మాతలు - వంశీ - ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

Bhaagamathie Movie Release Date Locked!:

Anushka Bhaagamathie Movie Grand Release to Republic Day.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs