Advertisement
Google Ads BL

స్విట్జర్లాండ్‌లో 'సప్తగిరి' సినిమా షూటింగ్ !


స్విట్జర్లాండ్‌లో 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' 

Advertisement
CJ Advs

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' పార్ట్‌-1ని 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'గా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ సెప్టెంబర్‌ 22 నుంచి స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ..ఈనెల 22న స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణ ప్రారంభించాం. అక్టోబర్‌ 5 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో 3 పాటలను చిత్రీకరిస్తాం. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేసి అక్టోబర్‌ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా పాటల్ని స్విట్జర్లాండ్‌లో తీస్తున్నాం. హిందీలో సూపర్‌హిట్‌ అయిన 'జాలీ ఎల్‌ఎల్‌బి' పార్ట్‌ 1 రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' హీరో సప్తగిరికి, మా బేనర్‌కి మరో సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది.. అన్నారు. 

కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల. 

Saptagiri Cinema Shooting in Switzerland:

Comedian Saptagiri cinema Saptagiri LLB Cinema Shooting in Switzerland
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs