Advertisement
Google Ads BL

'బాల‌కృష్ణుడు' మొదటి దర్శనం వదిలారు!


స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'బాల‌కృష్ణుడు'. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్ శ్రీ వినోద్ నంద‌మూరి, మాయా బ‌జార్ మూవీస్ సినిమా నిర్మాత‌లు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఈరోజు(శనివారం) విడుద‌ల చేశారు. నారారోహిత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి 'బాల‌కృష్ణుడు' అనే టైటిల్ లోగోతో పాటు, రోహిత్ ప్రీలుక్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఆ లుక్‌ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ - నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా 'బాల‌కృష్ణుడు' యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. దేవీ న‌వ‌రాత్రులు సంద‌ర్భంగా నారా రోహిత్ హ్యండ్‌స‌మ్ లుక్‌తో ఉన్న బాల‌కృష్ణుడు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే బాలకృష్ణుడు టీజ‌ర్‌ను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేస్తున్నాం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. 'న‌ర‌సింహ' చిత్రంలో నీలాంబ‌రిగా, 'బాహుబ‌ల' చిత్రంలో శివ‌గామి పాత్ర‌లో మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. రెజీనా కసండ్రా హీరోయిన్‌గా న‌టించింది.  

నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు ఇతర తారాగణం. 

Nara Rohit Balakrishnudu First Look Released:

Nara Rohit caught hold off a catchy title Balakrishnudu for his next flick under debutant Pavan Mallela direction which finished entire production and eager to fly in theaters.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs