'మహానటి' లో ఎస్వీ రంగారావుగా విలక్షణ నటుడు మోహన్ బాబు
సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ అందరూ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర బృందంలో మరో మహానటుడు వచ్చి చేరాడు. ఆయనే 'విలక్షణ నటుడు' మోహన్ బాబు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటివారం నుండి ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లులో జరుగుతోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు.