Advertisement
Google Ads BL

'ఇంద్రసేన' కి ఇంద్రుడిచ్చిన వరం..!


వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం 'ఇంద్రసేన'. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని ఇంద్రసేన ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్ మాట్లాడుతూ.. నా స్నేహితురాలు రాధికా నిర్మాణంలొ వస్తొన్న చిత్రం 'ఇంద్రసేన'. టైటిల్ చూడగానే నా సినిమా ఇంద్ర , అందులొని డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇక ఇంద్రసేన ఓ యాక్షన్, సెంటిమెంట్ సినిమా. బిచ్చగాడు సినిమాను తెలుగులో బ్లాక్ బస్టర్ గా మన ప్రేక్షకులు నిలిపారు. కొత్తదనం ఎప్పుడు విజయాన్ని అందిస్తుంది. విజయ్ ఆంథోని మల్టీ టాలెంటెడ్. ఎన్నొ విభాగాల్లొ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. అన్నీ కమర్షియల్ హంగులు ఉన్న ఇంద్రసేన ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. పెద్ద విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను.

విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. మెగాస్టార్ గారితో మా మూవీ ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. రాధికా గారితో అసొసియెట్ అయి ఈ సినిమా చెయటం ఈ సినిమాకు కలిసి వచ్చె అంశం. ఇంద్రసేన అందరికి నచ్చుతుందని నమ్మకముందన్నారు.

రాధికా మాట్లాడుతూ.. ఇంద్రసేన ఫస్ట్ లుక్ ను చిరంజీవి గారితోనే ఆవిష్కరించాలని విజయ్ ఆంథోని పట్టుబట్టారు. ఎందుకంటే ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ ను చిరంజీవి గారు ఇండస్ట్రీ కి ఇచ్చారు. ఇంద్రసేన ఓ ఎమోషనల్ యాక్షన్ మూవీ. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేస్తామన్నారు.

దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కొత్త తరహా కమర్షియల్ ఎంటర్ టైనర్ 'ఇంద్రసేన'. చిరంజీవి గారు ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేయటం ఆనందంగా ఉందన్నారు. 

రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ..మా ఇంద్రసేన కు మెగాస్టార్ ఆశీర్వాదం ఉండటం మా అందరి అదృష్టం.  విజయ్ ఆంథోని గారి నుంచి వస్తొన్న మరో మంచి చిత్రమిది. ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చుతుందన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలొ లైన్ ప్రొడ్యూసర్ సాండ్రా,  హీరొయిన్ లు డైనా చంపిక, మహిమా తదితరులు పాల్గొన్నారు .

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

Chiranjeevi Launches Indrasena First Look:

Mega Star Chiranjeevi Launches Vijay Antony's Indrasena Movie First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs