Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ప్లేస్ లో బెల్లంకొండ హీరో..!!


పొల్లాచ్చిలో శ్రీవాస్ - బెల్లంకొండ శ్రీనివాస్-అభిషేక్ పిక్చర్స్ కొత్త షెడ్యూల్ ప్రారంభం !!

Advertisement
CJ Advs

'డిక్టేటర్' వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఒక షెడ్యూల్ మరియు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం త్వరలో పొల్లాచ్చి వెళ్లనుంది. అక్కడ ఒక పల్లెటూరి సెట్ లో కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.  పొల్లాచ్చి అనగానే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా. గబ్బర్ సింగ్ కోసం పొల్లాచ్చి లో చిత్రికరించిన సన్నివేశాలు, సినిమా హిట్ కి ఎంతగానో ఉపకరించాయి. గబ్బర్ సింగ్ తర్వాత పొల్లాచ్చి కి పవన్ కళ్యాణ్ ప్లేస్ గా కూడా గుర్తింపు పడింది. సో..పవన్ ప్లేస్ బెల్లంకొండ బుల్లోడి సినిమా షూట్ జరుపుకుంటుందన్నమాట. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. బలమైన కథ-కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.గా శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ అయ్యాయి. నెక్స్ట్ పొల్లాచ్చిలో 15 రోజుల భారీ షెడ్యూల్ జరగనుంది. అందుకోసం విండ్ టర్బైన్స్ తో కలిపి ఓ భారీ సెట్ ను రూపొందించాం. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ప్లాన్ చేశాం. శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. దాదాపు 40% చిత్రీకరణ పూర్తయ్యింది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది.. అన్నారు. 

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

Bellamkonda Seenivas Film Shooting at Pollachi:

Bellamkonda Sai Sreenivas, Sriwass, Abhishek Pictures Production No 4 New Schedule Begins in Pollachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs