Advertisement
Google Ads BL

ప్రభాస్ కి బాలీవుడ్ భామనే కన్ఫర్మ్ చేశారు!


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 

Advertisement
CJ Advs

యంగ్ రెబల్ స్టార్... ప్రభాస్ హీరోగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హిందీలో ఆషికీ 2 చిత్రంతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని... పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.  

రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ అందించిన సుజీత్ సాహో చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ హైటెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. 

బ్యానర్  - యువి క్రియేషన్స్

దర్శకుడు - సుజీత్

నిర్మాతలు - వంశీ-ప్రమోద్

సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్ - మధి

ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్

Official: Shraddha Kapoor to Romance Prabhas:

Saaho Movie makers have officially confirmed the name of the heroine through twitter. Bollywood's dazzling beauty Shraddha Kapoor will romance Prabhas.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs