Advertisement
Google Ads BL

మేడమీద అబ్బాయి ఒకటి వదిలాడు!


మేడమీద అబ్బాయి టీజర్ విడుదల

Advertisement
CJ Advs

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్  నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.  జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో  బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం హీరో అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు.

విడుదల చేసిన 12 గంటల్లోనే టీజర్ 5 లక్షల పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. ఇక  ఈ సందర్భంగా  హీరో నరేష్ మాట్లాడుతూ  కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చేశాననే భావన కలిగింది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ మేడమీద అబ్బాయిని అందరూ మీ ఇంటి అబ్బాయిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ  నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు.  

గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్  వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది.  నరేష్ కేరీర్‌లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుంది. విడుదల చేసిన 12 గంటల్లోనే టీజర్ 5లక్షల జెన్యూన్ వ్యూస్‌ను సాధించింది. ఈ నెలలోనే పాటలను విడుదల చేసి, సెప్టెంబరు మొదటివారంలో  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

Meda Meeda Abbayi Movie Teaser Released:

Allari Naresh recently acted movie 'Meda Meeda Abbayi' this movie Teaser Released today 5th August 2017.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs