Advertisement
Google Ads BL

ఈ కుర్ర హీరోకి ఉన్నది ఒకటే..!


రామ్-అనుపమా పరమేశ్వరన్-లావణ్యా త్రిపాఠి కాంబినేషన్ లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న సినిమాకి 'ఉన్నది ఒకటే జిందగీ' టైటిల్ ఖరారు.

Advertisement
CJ Advs

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం 'నేను శైలజ'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. 'స్రవంతి' రవికిశోర్, పి.ఆర్‌. సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ లో 50 శాతం పైగా సినిమా పూర్తయింది. ఈ నెల 7న ఊటీలో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ - స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఉన్న 'ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు...' అనే పాటకు సంబంధించిన 'లిరికల్ వీడియో'ను విడుదల చేయబోతున్నాం.  దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ అన్ని పాటలకూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెల ఇటలీలో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.. అని చెప్పారు.  

శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి.

Ram New Movie Title Vunnadi Okate Zindagi :

Hero Ram Vunnadi Okate Zindagi Movie Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs