Advertisement
Google Ads BL

'వైశాఖం' పెద్ద హిట్టవ్వాలి: కింగ్ నాగార్జున


'వైశాఖం' బి.ఎ.రాజుగారికి, జ‌య‌గారికి మంచి పేరు తెస్తుంది - కింగ్ నాగార్జున 

Advertisement
CJ Advs

ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ఈ సినిమా జూలై 21న విడుద‌ల‌వుతుంది. సినిమాలో డిజె వ‌సంత్ అందించిన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా 'వైశాఖం' సినిమా ట్రిపుల్ ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా...

కింగ్ నాగార్జున మాట్లాడుతూ - తెలుగు సినిమా రంగంలోకి నేను ఎంట్రీ ఇచ్చి 31 సంవత్సరాలు అవుతున్నాయి. ఇన్నేళ్ల జర్నీలో రాజుగారు, జయగారు నాకు ముందు నుండి తెలుసు. మంచి ఫ్రెండ్స్‌ కూడా అయ్యారు. నా సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ విషయంలో కూడా వారెంతో హెల్ప్‌ చేశారు. మనకున్న కొద్ది మంది లేడీ డైరెక్టర్స్‌లో జయగారు ఒకరు. ఆమె డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకాదరణను పొందినవే. ఆమె గత చిత్రాలన్నింటికంటే 'వైశాఖం' పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. రాజుగారి ప్రెస్‌మీట్‌ పెడితే దానికి ఎంత మంది మీడియా వాళ్లు సపోర్ట్‌ చేస్తారనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తి. ఆయన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రాజుగారికి, జ‌య‌గారికి మంచి పేరు తెస్తుంది.  హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతికలకు నా అభినందనలు. టీం అంతటికి ఆల్‌ ది బెస్ట్‌. మీడియం బడ్జెట్‌ సినిమాలు, చిన్న సినిమాలు, కొత్త కాన్సెప్ట్‌ మూవీస్‌ అన్ని సక్సెస్‌ అవుతున్న ఈరోజుల్లో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న జూలై 21న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు. 

డైరెక్టర్‌ జయ.బి మాట్లాడుతూ - నాగార్జునగారు ఎప్పుడూ మాకు తమ సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆయన మాకు అందిస్తున్న సపోర్ట్‌ను మాటల్లో చెబితే సరిపోదు. నాగార్జునగారు మా కుటుంబంలోని ఓ వ్యక్తి. ఆయనకు మా టీం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు.. అన్నారు. 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సినిమా జూలై 21న విడుదలవుతుంది. మా సినిమాకు నాగార్జునగారు వచ్చి యూనిట్‌ను అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన అడగ్గానే ఒప్పుకుని ఇంత దూరం వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు, చైతన్యగారు ఇలా అక్కినేని ఫ్యామిలీ అంతా మాకు ఎంతో అండగా నిలబడ్డారు. వారికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.. అన్నారు. 

సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - జయగారు, రాజుగారు జూలై 21న సినిమాను విడుదల చేయడానికి అన్నింటినీ సిద్ధం చేశారు. రాజుగారి ఆనందం చూస్తే సినిమా ఎంత బావుందనేది అర్థం అవుతుంది. వెళ్లిపోయిన వైశాఖం నెలను మళ్లీ వెనక్కితెప్పిస్తున్నారు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది.. అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ డిజె వ‌సంత్ మాట్లాడుతూ - ఆడియో పెద్ద సక్సెస్‌ అవుతుందని ముందు నుండి బాగా నమ్మకంగా ఉన్నాం. మంచి సినిమాలో నన్ను కూడా భాగం చేసిన జయగారికి, రాజుగారికి థాంక్స్‌. 21 జూలై విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది.. అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రయూనిట్‌కు నాగార్జున ట్రిపుల్‌ప్లాటినమ్‌ డిస్క్‌లను అందజేశారు. 

Nagarjuna Blessings to Vaisakham Team:

Vaisakham Movie Triple Platinum Disc Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs