Advertisement
Google Ads BL

'వైశాఖం' అవంతిక ఇంటర్వ్యూ!


`వైశాఖం` నాకు మంచి బ్రేక్ అవుతుంది  - అవంతిక‌

Advertisement
CJ Advs

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ అవంతిక ఇంట‌ర్వ్యూ...

నేప‌థ్యం...

- మాది ఢిల్లీ. మా నాన్న ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్‌. నాన్న ఉద్యోగ రీత్యా, ఇండియాలో చాలా ప్ర‌దేశాల్లో తిరిగాను. నాన్న గృహిణి. 

`వైశాఖం`లో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?

- నిర్మాత బి.ఎ.రాజుగారు, డైరెక్ట‌ర్ జ‌య‌గారు నా ఫోటోస్ చూశారు. వాళ్ళ‌కు న‌చ్చ‌డంతో ఫోటో షూట్‌కు ర‌మ్మ‌ని పిలిచారు. నేను, హీరో హ‌రీష్ ఫోటో షూట్‌లో పాల్గొన్నాం. షూట్ పూర్తి కాగానే, నాకు క‌థ చెప్పారు. న‌చ్చ‌డంతో అగ్రిమెంట్ సైన్ చేశాను. 

మూవీలో ఎలాంటి రోల్ చేశారు?

- `వైశాఖం` సినిమాలో నేను భానుమ‌తి అనే పాత్ర చేశాను. మోడ్ర‌న్ అమ్మాయిగానే క‌న‌ప‌డ్డా, కుటుంబ విలువ‌ల‌కు ప్రాముఖ్య‌త నిచ్చే అమ్మాయి. క‌చ్చిత‌మైన అభిప్రాయాలు ఉన్న రోల్‌లో క‌న‌ప‌డ్డాను. కాస్తా బిడియం కూడా ఉంటుంది. పాత్ర విన‌గానే నాకు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఎందుకంటే రియ‌ల్ లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటాను. భానుమ‌తి క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌డం ఎంతో ఆనందంగా అనిపించింది. `వైశాఖం` తెలుగులో నాకు మంచి బ్రేక్‌నిస్తుంది.

సినిమా రంగం ప్ర‌వేశం ఎలా జ‌రిగింది;

- నేను చిన్న‌ప్పుడు టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. ఫైలట్ లేదా స్పోర్ట్స్ ప‌ర్స‌న్ కావాల‌నుకున్నాను. నేను స్టేట్ లెవ‌ల్ బ్యాడ్మింట‌న్ కూడా ఆడాను. నేష‌న‌ల్ లెవ‌ల్‌కు ట్ర‌యినింగ్ తీసుకున్నాను. కానీ నెమ్మ‌దిగా సినిమాల వైపు ఆక‌ర్షితురాలిన‌య్యాను. తొలిసారి మాయ సినిమాలో న‌టించాను. త‌ర్వాత చేసిన సినిమా `వైశాఖం`.

ఆర్‌.జె.సినిమాస్‌లో న‌టించ‌డం ఎలా అనిపించింది?

- జ‌య‌గారు, రాజుగారు ఎంతో కేర్ తీసుకున్నారు. మంచి పాత్ర‌ను ఇవ్వ‌డ‌మే కాదు, సినిమా ప‌రంగా మంచి ప్ర‌మోష‌న్స్ కూడా చేస్తున్నారు. కుటుంబ స‌భ్యుల్లా జాగ్ర‌త్త తీసుకున్నారు. 

డ్యాన్సుల విష‌యంలో క‌ష్ట‌ప‌డ్డ‌ట్టున్నారుగా?

- అవునండి.. నేను క‌థ‌క్ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో డ్యాన్స్ చేయ‌డం అనేది కొత్త అనుభవాన్ని నేర్పింది. ప్ర‌తి జోన‌ర్‌లో ఒక్కొక్క సాంగ్ ఉంది. ముఖ్యంగా కంట్రి చిలకా సాంగ్ కోసం 15 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి డ్యాన్స్ కూడా నేర్చ‌కున్నాను. ఆ సాంగ్‌ను క‌జికిస్థాన్‌లో -6 డిగ్రీల చ‌లిలో చిత్రీక‌రించారు. జ‌య‌గారు, రాజుగారు ఓ డ్యాన్స్ అసిస్టెంట్‌ను అపాయింట్ చేసి డ్యాన్స్ నేర్పించారు. దీంతో నేను డ్యాన్స్ బాగా చేయ‌గ‌లుగుతాన‌నే న‌మ్మ‌కం క‌లిగింది. 

డైరెక్ట‌ర్ జ‌య‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?

- జ‌య‌గారు మ‌హిళా ద‌ర్శ‌కురాలైనా ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. ప్ర‌తి షాట్‌ను ఎంతో చ‌క్క‌గా రావాల‌ని త‌ప‌న ప‌డ‌తారు. ఆవిడ వ‌ర్కింగ్ స్టైల్ న‌న్నెంతగానో ఇన్‌స్ఫైర్ చేసింది. 

సినిమాలో మీరు బాగా క‌ష్ట‌ప‌డ్డ స‌న్నివేశం?

- క్లైమాక్స్ సీన్‌. నాలుగైదు పేజీల డైలాగ్‌ను చెప్పాల్సి వ‌చ్చింది. తెలుగు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను కాబ‌ట్టి అంత పెద్ద సీన్ చేయ‌డం క‌ష్ట‌మైంద‌నే అనాలి. కాన జ‌య‌గారి స‌పోర్ట్‌తో ఆ సీన్‌ను చాలా బాగా చేశాను. మంచి ఎమోష‌నల్ సీన్‌. ఆడియెన్స్ అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది. 

హీరో హ‌రీష్ గురించి?

- హ‌రీష్ చాలా మంచి వ్య‌క్తి. ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడు. డౌన్ టు ఎర్త్. త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

తెలుగులో మీ అభిమాన న‌టీన‌టులెవ‌రు?

- తెలుగు సినిమాల‌ను చూస్తుంటాను. రీసెంట్‌గా అంటే బాహుబ‌లి2, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాల‌ను చూశాను. బాగా న‌చ్చాయి. ప్ర‌భాస్‌, బ‌న్ని, అనుష్క వంటి ఎంతో మంది గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు. 

డ్రీమ్ రోల్‌?

- పీరియాడిక్ మూవీలో నాకు వారియ‌ర్ ప్రిన్స్ పాత్ర చేయాల‌నే కోరిక ఉంది.

నెక్స్‌ట్ మూవీస్‌..?

- త‌మిళంలో అశోక్ సెల్వ‌న్‌తో `నెంజ‌మెల్ల కాద‌ల్` సినిమా చేస్తున్నాను. 

Avantika Mishra Interview About Vaisakham Movie:

Actress Avantika Mishra interview about Vaisakham movie, Avantika says this movie I'll break a good one.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs