Advertisement
Google Ads BL

'ఏజెంట్‌ భైరవ' పై ఇంత కాన్ఫిడెన్సా..?


'ఏజెంట్‌ భైరవ' తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ - నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి 

Advertisement
CJ Advs

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌పై విజయ్‌, కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్‌ భైరవ'. భరతన్‌ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు. 

నిర్మాత నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ - 'విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్‌ భైరవ' సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఆన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఇందులో హీరో విజయ్‌ ఓ బ్యాంక్‌లో కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓ పెళ్ళిలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ని చూసి ప్రేమలో పడతాడు.

కానీ కీర్తి సురేష్‌ ఓ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో ఆమెకు అండగా నిలబడ్డాడనేదే కథ. ఈ సినిమాలో జగపతిబాబుగారు పిడకల కోటయ్య అనే క్యారెక్టర్‌లో కనపడతాడు. మాంసం అమ్ముకునే పిడకల కోటయ్య ఉన్నట్లుండి పెద్ద బిజినెస్‌మేన్‌గా ఎలా మారాడు. కాలేజీలను ఎలా స్థాపించాడు. దాని వల్ల హీరోయిన్‌కు వచ్చే సమస్య ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సమాజంలో ప్రతి విషయానికి ఓ క్వాలిఫికేషన్‌ ఉంది. కానీ ప్రైవేటు కాలేజీలు నడిపే పెద్ద మనుషులకు క్వాలిఫికేషన్‌ ఎందుకు లేదనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది.

సంతోష్‌ నారాయణ్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు చాలా పెద్ద ప్లస్‌ అవుతుంది. ఈ సినిమాను తమిళంలో విజయ బ్యానర్‌వారు నిర్మించారు. వారు తెలుగు ప్రేక్షకులు, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే డైలాగ్స్‌, సీన్స్‌ డిజైన్‌ చేయడం వల్ల సినిమా మన తెలుగువారికి కూడా బాగా నచ్చుతుంది. నేను దర్శకుడిగా చింతపల్లి రమణగారి రచనలో ఓ సినిమా చేయబోతున్నాను.

ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ. కథకు తగ్గట్లు మంచి లీడింగ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే నా బ్యానర్‌లో బెలూన్‌, స్వామి2 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాను. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'యదాతథం' కోసం నేను దర్శకుడిగా మారాను. అందులో భాగంగానే 'దృశ్యకావ్యం' సినిమా చేశాను. కానీ ఆ సినిమా సమయంలోనే హీరోయిన్‌కు పెళ్ళి కావడం, ఆ హీరోయిన్‌ భర్త సినిమాలు చేయడానికి అంగీకరించకపోవడంతో దృశ్యకావ్యం2 సినిమా చేయలేకపోయాం. ఇక బెలూన్‌ సినిమాలో రాజ్‌తరుణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక మా ఏజెంట్‌ భైరవ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఇప్పటికి 235 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఇంకా థియేటర్స్‌ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి' అన్నారు. 

Bellam Ramakrishna Reddy Agent Bhairava Interview:

Agent Bhairava Movie Producer Bellam Ramakrishna reddy Confidence on movie success. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs