Advertisement
Google Ads BL

ప‌దేళ్ళ ల‌వ్‌స్టోరీ జ‌ర్నీతో వరుణ్ తేజ్ చిత్రం!


వ‌రుణ్‌తేజ్‌, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ కొత్త చిత్రం

Advertisement
CJ Advs

ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని దైవ స‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత. జ్యోతిర్మ‌యి గ్రూప్స్ చిత్ర స‌మ‌ర్ప‌కులు. హీరో హీరోయిన్‌ల‌పై తొలి స‌న్నివేశానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి క్లాప్ కొట్టారు. 

ఈ సంద‌ర్భంగా...మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాట్లాడుతూ - ఎస్‌విసిసి బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న సినిమా ఇది. నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్, బాపినీడుకి అభినంద‌న‌లు. వెంకీ అట్లూరి మంచి రైట‌ర్‌. ఇప్పుడు వ‌రుణ్‌తో మంచి యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ వెంకీకి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. వ‌రుణ్‌, రాశిఖ‌న్నా స‌హా ప్ర‌తి ఆర్టిస్ట్‌, టెక్నిషియ‌న్‌కు ఆల్ ది బెస్ట్‌...అన్నారు.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ....బాపినీడు, బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారు నిర్మాత‌లుగా కొత్త సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. వెంకీ అట్లూరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వెంకీ అట్లూరి నాకు మంచి స్నేహితుడు. మంచి క‌థ‌ను రాసుకున్న త‌ను నాకు వినిపించాడు. రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్. ఒక ల‌వ్‌స్టోరీలోని ప‌దేళ్ళ జ‌ర్నీని ఓ సినిమాగా చేయ‌బోతున్నాం. జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మంచి టీం క‌లిసి చేస్తున్న ప్ర‌య‌త్నం.. అన్నారు. 

వెంకీ అట్లూరి మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా ఇది నా తొలి చిత్రం. ఇంత‌కు ముందు కొన్ని చిత్రాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాను. వ‌రుణ్ లాంటి హీరోతో ఇంత పెద్ద బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం  అదృష్టంగా భావిస్తున్నాను...అన్నారు.

Varun Tej Starts His New Film in SVCC Banner:

After versatile films such as Mukunda and Kanche, Mega Prince Varun Tej has started a new film in the banner Sri Venkateshwara Cine Creations.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs