Advertisement
Google Ads BL

నీహారిక కొణిదెల లైన్ లో పడినట్లే..!


మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల కథానాయికగా ఎం.ఆర్ ఎంటర్ టైన్మెంట్స్-కవిత కంబైన్స్ చిత్రం ప్రారంభం!

Advertisement
CJ Advs

మెగా హీరోయిన్ నీహారిక కొణిదెల ప్రధాన పాత్రలో ఎం.ఆర్ ఎంటర్ టైన్మెంట్స్-కవిత కంబైన్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మరిసెట్టి రాఘవయ్య-బండారు బాబీలు నిర్మించనున్న ఈ చిత్రానికి రవిదుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించనున్నాడు. 

ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (జూన్ 16) హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో యువ దర్శకులు మారుతి, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, దర్శకులు మెహర్ రమేష్, మెగా బ్రదర్ నాగబాబు మరియు చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మారుతి చిత్ర బృందానికి స్క్రిప్ట్ ను అందించారు. 

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా.. శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. మెహర్ రమేష్-నాగబాబులు గౌరవదర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మరిసెట్టి రాఘవయ్య-బండారు బాబీలు మాట్లాడుతూ.. మెగా హీరోయిన్ నీహారిక కొణిదెల కథానాయికగా సినిమా నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈశ్వర్ రెడ్డి, మెహర్ రమేష్, ప్రభుదేవ, రాహుల్ బోస్ వంటి ప్రతిభావంతుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన దుర్గారవి ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్ నెలాఖరుకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సరికొత్త జోనర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. 30 ఇయర్స్ పృధ్వీ ఓ కీలకపాత్ర పోషించనున్న ఈ చిత్రంలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు..అని అన్నారు. 

ఈ చిత్రానికి లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మధు పొన్నాస్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నండూరి రాము, నిర్మాతలు: మరిసెట్టి రాఘవయ్య-బండారు బాబీ, రచన-దర్శకత్వం: రవిదుర్గా ప్రసాద్!

Niharika Konidela Second Film Started:

Niharika's second film is launched today in debutant W Ravi Durga Prasad, protege of Meher Ramesh direction.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs