Advertisement
Google Ads BL

సూర్యగా అల్లు అర్జున్ ఫిక్సయ్యాడు..!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ,  నాగబాబు , శిరీషా శ్రీధర్, బన్నీ వాసు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రారంభోత్సవం

Advertisement
CJ Advs

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్ తో టాప్ ఫాంలో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ త్వరలోనే దువ్వాడ జగన్నాథం చిత్రంతో సరికొత్త రూపంలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం అందించబోతున్న సంగతి తెలిసిందే. అభిమానుల్ని మరింత ఎంటర్ టైన్ చేసేందుకు మరో సరికొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. అదే 'నా పేరు సూర్య -  నా ఇల్లు ఇండియా'. స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కథానాయకుడిగా, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల క్లాప్ నివ్వగా, తండ్రి అల్లు అరవింద్ గారు కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. కిక్, టెంపర్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాల కథా రచయిత వక్కంతం వంశీ  ఈ చిత్రంతో మెగాఫోన్ పడుతున్నారు. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... స్టైల్ సినిమా సమయంలో మా బ్యానర్లో సినిమా చేస్తా అని అల్లు అర్జున్ మాట ఇచ్చారు. ఆరోజు ఇచ్చిన మాటను గుర్తు పెట్టు కొని నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం మా బ్యానర్లో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డిజే ఆడియో కూడా అదిరిపోయింది. వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ కూడా గ్యారంటీ అని అర్థమవుతోంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ పడుతున్న వక్కంతం వంశీతో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు. 

నటీనటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)

ఫైట్స్ - రామ్ లక్ష్మణ్

సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి

సంగీతం - విశాల్ - శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు

బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

సమర్పణ - k.నాగబాబు  

సహ నిర్మాత - బన్నీ వాసు

నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి

రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Allu Arjun, Vakkantham Vamsi Naa Peru Surya:

Allu Arjun’s new film in debutant Vakkantham Vamsi direction is titled Naa Peru Surya, Naa Illu India.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs