Advertisement
Google Ads BL

అమెరికాలో 'లై' మోగుతుంది..!


అమెరికాలో యూత్‌స్టార్‌ నితిన్‌ 'లై' సాంగ్‌ రిలీజ్‌ 

Advertisement
CJ Advs

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను అమెరికాలో జూన్‌ 11 మధ్యాహ్నం 3 నుండి 6 గంటల మధ్య(లోకల్‌ టైమ్‌) చికాగోలోని హిల్టన్‌ హోటల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటల్లో 'బాంభాట్‌' అనే పాటను ఈరోజు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ సభ్యులంతా పాల్గొంటారు. ఇదే పాటను జూన్‌ 12న ఉదయం 9.30 గంటలకు ఇక్కడ విడుదల చేస్తారు. 

ఈ సందర్భంగా యూత్‌స్టార్‌ నితిన్‌ మాట్లాడుతూ - 'ఈ చిత్రం కోసం మణిశర్మగారు చాలా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ ఆల్బమ్‌లో నాకు ఎంతో ఇష్టమైన 'బాంభాట్‌' సాంగ్‌ ఈ రోజు అమెరికాలో విడుదలవుతోంది. ఈ పాట లాంచ్‌ కోసం నేను ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను' అన్నారు. 

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - 'బాంభాట్‌' సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. మణిశర్మగారు అన్నీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫైట్స్‌ని ఎంతో గ్రాండ్‌గా తీయడం జరిగింది. 100 మంది ఫైటర్స్‌ పాల్గొన్న ఓ భారీ ఫైట్‌ను ఎంతో లావిష్‌గా చిత్రీకరించడం జరిగింది. ఈ ఫైట్‌ సినిమాకి చాలా పెద్ద హైలైట్‌ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన నితిన్‌, మేఘా ఆకాష్‌ల రొమాంటిక్‌ పోస్టర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా బేనర్‌లో కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మరో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ అవుతుంది' అన్నారు. 

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి. 

'LIE' Movie First Song Launch in America:

After some interesting and romantic posters, it's time to launch the songs from 'LIE'. The first single, 'Bombhaat', will be launched in USA. released on 11th June in USA. The event will be held grandly at Hotel Hilton, Lisle, Illinois - Chicago from 3 pm-6 pm (local time). The whole unit will attend the event.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs