Advertisement
Google Ads BL

'రారండోయ్‌..'తో కింగ్‌ నాగార్జున హ్యాట్రిక్‌..!


'మనం' పాటల వేడుకలో నాన్న గారు నటించిన చివరి చిత్రం 'మనం' తప్పకుండా ఘనవిజయం సాధించడమే కాదు చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుంది.. అని చెప్పారు కింగ్‌ నాగార్జున. ఆ సినిమా విడుదలై 'మనం'దరి ఆదరాభిమానాల్ని అందుకుని గొప్ప సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. గత సంవత్సరం సంక్రాంతికి ముందు 'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో వేడుకలో 'సోగ్గాడు' బంగార్రాజు గెటప్‌లో స్టేజిపై డ్యాన్స్‌ చేసి అభిమానుల్ని ఆనంద పర్చడమే కాదు.. అభిమానులందరికీ 'సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్‌హిట్‌ కొడుతున్నాం' అని ఓపెన్‌గా ఎనౌన్స్‌ చేసారు. అది చూసి నాగార్జున ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని కామెంట్‌ చేసిన వాళ్లు కూడా వున్నారు. కానీ స్టేజి మీద ప్రకటించినట్లుగానే గత సంవత్సరం సంక్రాంతికి 'సోగ్గాడే'తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టి హీరోగా, నిర్మాతగా అఖండ విజయం సాధించారు. 

Advertisement
CJ Advs

మొన్నటికి మొన్న 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో స్టేజి మీద స్టెప్స్‌ వేసి అక్కినేని అభిమానుల్ని ఉత్సాహపరచడంతో పాటు 'మళ్లీ వస్తున్నాం.. సూపర్‌హిట్‌ కొడుతున్నాం' అని హర్షధ్వానాల మధ్య మరోసారి ప్రకటించారు. నాగార్జున చెప్పినట్లుగానే 9 రోజుల్లోనే 35 కోట్లు కలెక్ట్‌ చేసి యువసామ్రాట్‌ నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' 'మనం'కి విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తే.. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాలకు కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడు. నిర్మాతగా ఈ మూడు చిత్రాల ఘన విజయాలతో అన్నపూర్ణ స్టూడియోస్‌ యూనిట్‌ చాలా ఆనందంగా వుంది. ఈ ఘనవిజయం రావడానికి కింగ్‌ నాగార్జున తీసుకున్న స్పెషల్‌ కేర్‌ కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అఖిల్‌కి సూపర్‌హిట్‌!! 

'సోగ్గాడే చిన్నినాయనా' విజయోత్సవంలో నాగ చైతన్యకు, అఖిల్‌కి నిర్మాతగా సూపర్‌హిట్స్‌ ఇస్తానని ప్రకటించిన కింగ్‌ నాగార్జున 'రారండోయ్‌'తో నాగ చైతన్యకు సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చి ఓ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అఖిల్‌కి సూపర్‌ హిట్‌ ఇస్తానని చేసిన ప్రామిస్‌ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా అఖిల్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ ఎక్స్‌ ట్రార్డినరీ సబ్జెక్ట్‌ చెప్పారు. ఆ కథ మీద నమ్మకంతోనే చాలా భారీగా ఈ సినిమా చేస్తున్నాం. డెఫినెట్‌గా అఖిల్‌కి ఇది సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెపుతున్నారు కింగ్‌ నాగార్జున. హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ సారధ్యంలో 12 కోట్ల రూపాయలతో ఈ చిత్రం కోసం తీసిన యాక్షన్‌ పార్ట్‌ ప్రేక్షకుల్ని గ్యారెంటీగా థ్రిల్‌ చేస్తుంది. నిర్మాతగా ఇంతకుముందు 'శివ', 'నిన్నే పెళ్లాడతా', 'సిసింద్రి', 'సీతారా ముల కళ్యాణం చూతమురారండీ', 'సీతారామరాజు', 'మన్మథుడు', 'సత్యం', 'మాస్‌', 'ఉయ్యాలా జంపాలా' వంటి ఎన్నో బంపర్‌హిట్స్‌ని అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌పై లేటెస్ట్‌గా 'మనం', 'సోగ్గాడే', 'రారండోయ్‌'తో మళ్లీ హ్యాట్రిక్‌ కొట్టి అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన కింగ్‌ నాగార్జునను అందరూ అభినందిస్తున్నారు. 

హీరోగా 'రాజుగారి గది-2' 

'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' చిత్రాలతో గత సంవత్సరం హీరోగా అద్భుత విజయాలను సాధించిన కింగ్‌ నాగార్జున హీరోగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది-2'లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫినిషింగ్‌ స్టేజిలో వుంది. కింగ్‌ నాగార్జున నిర్మాతగా అఖిల్‌ చిత్రం మీద కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తూనే హీరోగా తాను చెయ్యబోయే రెండు కొత్త చిత్రాల కథా చర్చల్లో రెగ్యులర్‌గా పాల్గొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాల వివరాలు తెలుస్తాయి. ఏది ఏమైనా హీరోగా, నిర్మాతగా సంచలన విజయాల్ని సాధించాలన్న పట్టుదలతో ఆచితూచి అడుగేస్తున్న కింగ్‌ నాగార్జున సినిమాలన్నీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేలా వుంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందుగానే చెప్పి మరీ వరసగా మూడు సూపర్‌హిట్స్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున ఇకముందు కూడా ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే మంచి చిత్రాలు చేస్తూ మరిన్ని సూపర్‌హిట్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.

Nagarjuna gets Hat-trick as a Producer:

As a Producer Nagarjuna gets Hat-trick with Manam, Soggade Chinni Nayana and Rarandoi Veduka Chooddam. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs