Advertisement
Google Ads BL

రామ్ చరణ్, సుకుమార్ ల 'రంగస్థలం'..!


సంక్రాంతి కానుక‌గా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌ల చిత్రం 'రంగస్థలం'

Advertisement
CJ Advs

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోన్న చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్‌పై సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అలాగే టైటిల్ విష‌యంలో సోష‌ల్ మీడియాలో రామ్‌చ‌ర‌ణ్ పెట్టిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఫైన‌ల్‌గా ఈ చిత్రానికి 'రంగస్థలం' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. '1985' అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక. 

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో మూవీ అన‌గానే ఎన్నో అంచ‌నాలు మొద‌లైయ్యాయి. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుంది. ఈ సినిమాకు 'రంగస్థలం' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశాం. భారీ బ‌డ్జెట్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాం.  ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా  అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. 

రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌; ఆది స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అందిస్తున్న స‌హ‌కారంతో సినిమా చాలా బాగా వ‌స్తుంది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తాం. ప్రేక్ష‌కులు, మెగాభిమానులు అంచ‌నాల‌ను మించేలా, మా బ్యాన‌ర్ వేల్యూను పెంచేలా సినిమా ఉంటుంద‌ని నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సివిఎం)లు తెలిపారు.

Ram Charan's New Film Title Rangasthalam 1985:

Charan and Sukumar Film makers have confirmed the film's title as 'RANGASTHALAM 1985'. And the movie's release date has been locked to Sankranthi, 2018.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs