Advertisement
Google Ads BL

'వీర భోగ వ‌సంత రాయ‌లు' రామోజీలో!


రామెజిఫిల్మ్  సిటి లో సుధీర్‌బాబు పాత్ర‌తో ప్రారంభ‌మైన 'వీర భోగ వ‌సంత రాయ‌లు' షూటింగ్‌ 

Advertisement
CJ Advs

2016 చివ‌ర‌లో విడుదలై సినీప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల‌ని సైతం మ‌న‌సుతో కంట‌త‌డి పెట్టించిన వినూత్న‌క‌థా చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్‌, శ్రీవిష్ణు క‌ల‌యిక మ‌ర్చిపోలేని విధంగా నిలిచిపోయింది. ఇలాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఎప్పుడూ ప్రేక్ష‌కుల్ని అల‌రించేదిశ‌గా త‌మ సినీ ప్ర‌యాణం సాగిస్తున్న వీరిద్దరి కాంబినేష‌న్ లో నటిస్తున్న చిత్రం వీర భోగ వసంత రాయ‌లు.. ఈ చిత్రాన్ని రామెజిఫిల్మ్ సిటి లో రెగ్యుల‌ర్ షూటింగ్ మెద‌లుపెట్టారు. . ఈ చిత్రాన్నిబాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్ల‌న నిర్మిస్తున్నారు. అలాగే న్యూ వేవ్ డైరెక్టర్ ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని ఈ వినూత్న కథా చిత్రంలో ఎప్ప‌టికి చెక్కుచెర‌గ‌ని గ్లామ‌ర్ తో అల‌రించే శ్రియా శ‌ర‌ణ్ మ‌రో ముఖ్య‌ పాత్ర‌లో న‌టిస్తుండగా... ప్రేమ‌క‌ధా చిత్రం, భ‌లేమంచిరోజు లాంటి చిత్రాల‌తో సూప‌ర్‌స‌క్స్ ని సాధించిన సుధీర్‌బాబు ప్ర‌త్యేఖ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మెద‌టిరోజు షూటింగ్ లో సుధీర్‌బాబు పాల్గోన్నారు.  

ఈ సంద‌ర్బంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఇంద్ర‌సేన నాకు చాలా మంచి మిత్రుడు.  ఎప్ప‌టిక‌ప్పుడు క‌మ‌ర్షియాలిటి మిస్ కాకుండా వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రించే రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు చేస్తున్నందుకు ఈ ప్రాజెక్ట్  మీద మాకు రెస్పాన్సిబిలిటీ  మరింత పెరిగింది. శ్రియా గారు కథ విని చాలా ఎక్సైట్ అయ్యి అంగీక‌రించారు. అలాగే సుదీర్‌బాబు ని తీసుకున్నాము. ఈ నాలుగు పాత్ర‌లు వీరి పాత్ర‌ తీరు ఖ‌చ్చితంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ చిత్రంలో ఏవ‌రూ చెయ్య‌ని విధంగా ద‌ర్శ‌కుడు ఇద్ర‌సేన తీర్చిదిద్దాడు. రామెజిఫిల్మ్‌సిటిలో ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్ లో సుదీర్‌బాబు , శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు పాల్గోన‌గా కొన్ని సీన్స్ చిత్రీక‌రిస్తున్నాము. అతి త్వ‌ర‌లో నారా రొహిత్‌, శ్రీవిష్ణు, శ్రీయా పాల్గోంటారు. అని అన్నారు 

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్ లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ స్టోరీ. నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు -  నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రీయా సరణ్, సత్యదేవ్, శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాస రెడ్డి, భద్రమ్, శషాంక్ మౌళి, రవి ప్రకాష్, ఛరిత్, రాజేశ్వరి, సునిత వర్మ, శశిధర్, ఏడిద శ్రీరామ్, తదితరులు.

సాంకేతిక నిపుణులు సంగీతం - సతీష్ రఘునాధన్,కెమెరా - హిస్టిన్-శేఖర్, యాక్షన్ - కింగ్ సోలమన్ (బాహబలి 2 ఫేం), ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవ్ నాయర్, నిర్మాత - అప్పారావు బెల్లన, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - ఇంద్రసేన. ఆర్ 

Veera Bhoga Vasantha Raayalu New Movie..!:

'Veer Bhoga Vasantha Raayalu' shooting started with the role of Sudheer Babu in Ramojifilm City. Technology - Satish Raghunandhan, Camera - Histin-Shekhar, Action - King Solomon (Babaali 2 Fame), Production Designer - Rajiv Nair, Producer - Aparavu Bellana, Story, Screenplay, Direction - Indrasena. R
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs