తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్వర్గీయ ఎన్టీఆర్, నాగేశ్వరావులను రెండు కళ్లుగా భావిస్తారు. ఈ ఇద్దరితోనే కాదు సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి.. ఇలా అందరితో చిత్రాలు తీశారు. ఇక అక్కినేనితో ఆయన 'మేఘసందేశం' ప్రేమాభిషేకం, బహదూరపు బాటసారి, ఏడంతస్థుల మేడ' వంటి ఎన్నో అజరామమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవితో 'లంకేశ్వరుడు'ను తన 100వ చిత్రంగా తీశాడు. బాలకృష్ణతో 'పరమ వీరచక్ర', నాగార్జునతో 'మజ్ను', వెంకటేష్‌తో 'టూటౌన్‌రౌడీ' బ్రహ్మప్రుతుడు' వంటి ఎన్నో చిత్రాలు తీశారు.
ఇక కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో పాటు మంచు విష్ణు వరకు దాదాపు ఏ అందరితో చిత్రాలు తీశారు. ఏయన్నార్ చరిత్రలో బ్లాక్‌బస్టర్స్‌నిచ్చిన ఆయన ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ఉపయోగపడేలా, పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా 'బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు' చిత్రాలు తీసి, ఎన్టీఆర్‌కు రాజకీయాలపై ఆసక్తిని కలిగించారు. ఇక 'సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి'ల ప్రేరణతోనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపకల్పన జరిగింది.
ఇక ఆయన పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో 'ఓసేయ్ రాములమ్మ, ఓరేయ్ రిక్షా'లతో తన సత్తా చాటాడు. నటునిగా కూడా 'స్వయంవరం'తోపాటు 'ఓసేయ్ రాములమ్మ, మామగారు, సూరిగాడు, మేస్త్రీ' వంటి చిత్రాలలో నట విశ్వరూపం చూపించాడు. ఇలా దాసరి తెలుగు సినీ స్వర్ణజీవితాన్ని తనకాలంలో తానే రాసి తన సత్తాను చాటాడు. ఆయన చిత్రాలలో సామాన్యుల జీవిత కథలు, కష్టాలు, సామాన్యుడే హీరోగా ఉండేవాడు. ఇలా ఆయన స్పృశించని కథాంశం, ఇతి వృత్తం, జోనర్‌లేదని చెప్పవచ్చు.