Advertisement
Google Ads BL

దాసరి ఇక లేరు..!


ప్రముఖ దర్శకుడు, రాజకీయ నాయకుడు దాసరి నారాయణ రావు ఈ రోజు సాయంత్రం (మంగళవారం) ఏడుగంటల సమయంలో తీవ్ర అనారోగ్యం పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. వారం రోజుల క్రిందటే దాసరి తీవ్ర అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరడం.... నాలుగు రోజులనుండి ఆయనకు కిమ్స్ లో శస్త్ర చికిత్స జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఐదు నెలల కాలంలో దాసరికి రెండు సార్లు ఆపరేషన్ నిర్వహించారు.  ఒకసారి  దాసరి అన్నవాహికకు శస్త్ర చికిత్స నిర్వహించి, స్టెంట్‌ వేసినట్లుగా ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించిన కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తాజాగా మరోమారు ఇన్‌ఫెక్షన్‌ తిరగబడడంతో దాసరిని ఆసుపత్రిలో చేర్చారు. కిడ్నీ, లివర్‌, లంగ్స్‌ తదితర అవయవాలు సైతం సరిగా పనిచేయకపోవడం... అధిక రక్తపోటుతో బాధపడుతున్న దాసరి ఈ రోజు సాయంత్రం(మంగళవారం) కన్నుమూశారు. ఆస్పత్రినుండి అయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ లోని అయన స్వగృహానికి తరలిస్తారని సమాచారం. దాసరి మృతికి  సినీ, రాజకీయనాయకులు నివాళులర్పించారు.

Dasari Narayana Rao passed away this morning..!:

The famous director and politician Dasari Narayana Rao passed away this morning (Tuesday) in seven days of serious illness. The film industry drowned in the grief of his death.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs