Advertisement
Google Ads BL

కేథరిన్.. ఫ్రెష్ అమ్మాయిలా అనిపించలేదంట!


'గౌతమ్ నంద' కోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకొన్న కేతరీన్ !!

Advertisement
CJ Advs

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 

ఈ చిత్రంలో కేతరీన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటుండడం విశేషం. 

ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. కేతరన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి క్యారెక్టరైజేషన్ ను ప్రాణం పోసింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆమెను చూస్తే ఫ్రెషర్ అనిపించలేదు...అన్నారు.   

చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. గౌతమ్ నంద పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాకీ పార్ట్ పూర్తయ్యింది. కేతరీన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసార్హం. రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా 'గౌతమ్ నంద' నిలుస్తుంది. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం.. అన్నారు. 

హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది.

Catherine Tresa self dubbing for Gautham Nanda:

Action hero Gopichand and hat trick director Sampath Nandi combination new stylish action commercial flick Gautham Nanda will have heroine Catherine Tresa dubbing on own for her character. The high budgeted lavish looking film is produced by J Bhagavan and J Pulla Rao on Sri Balaji Cine Media banner.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs