Advertisement
Google Ads BL

'రాధ‌' రిలీజ్ కి అన్నీ రెడీ..!


'రాధ‌' సెన్సార్ పూర్తి.. మే 12న విడుదల

Advertisement
CJ Advs

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. మే 12న విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా...చిత్ర స‌మ‌ర్ప‌కులు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తా చాటుతున్న యువ క‌థానాయ‌కుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనర్ `రాధ‌`. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెన్సార్ నుండి  క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమాను మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా పాటలు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్స్‌కు ప్రేక్ష‌కుల సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. డెబ్యూ డైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ తొలి చిత్ర‌మే అయినా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం రాధ శ‌ర్వానంద్ కెరీర్‌లో మ‌రో హిట్ మూవీ అవుతుంది.. అన్నారు. 

శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాత: భోగ‌వ‌ల్లి బాపినీడు, ద‌ర్శ‌క‌త్వం: చంద్ర‌మోహ‌న్‌.

Radha Censor Completed:

Sharwanand's Radha Movie which is slated for grand release on May 12th has completed its censor formalities. Censor board members who watched film has been awarded clean U certificate.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs