Advertisement
Google Ads BL

అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది: చిరు


దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది:  మెగాస్టార్ చిరంజీవి!

Advertisement
CJ Advs

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు  ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉద‌యం స్వ‌యంగా కె. విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి ఆయ‌న్ను అభినందించారు. 

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ..నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటుంబ ప‌రంగాను మంచి  రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు  ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు  రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా?  లేదా అన్న దానిపై ఇప్పుడు  మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌నకు రావ‌డం  సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకే  నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాభివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే... అని అన్నారు.

Chiranjeevi Wishes to K. Viswanath:

Megastar Chiranjeevi wishes to K Viswanath on Winning Dada Saheb Phalke Award. Chiranjeevi met K Viswanath monday at his house. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs