Advertisement
Google Ads BL

'జ‌గ‌న్నాథ‌మ్‌' వచ్చేందుకు ఫిక్సయ్యాడు..!


జూన్ 23న 'డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' విడుదల

Advertisement
CJ Advs

'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న 25వ సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం.  ఈ చిత్రంలో బ‌న్నిని స‌రికొత్త లుక్‌లో చూస్తారు. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నేను, బ‌న్ని, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్, ఇలా మా కాంబినేష‌న్‌లో మూవీ అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే సినిమాను మా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 23న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం.. అన్నారు. 

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

Allu Arjun's DJ to Release on June 23:

The anticipation surrounding Allu Arjun's next with director Harish Shankar, Duvvada Jagannathanm. As the team toils hard to bring the film to you, with an elaborate schedule, the latest update is that the film is set for a grand worldwide release on June 23.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs