Advertisement
Google Ads BL

'శివ‌లింగ‌' తర్వాత భారీ చిత్రాలంట..!


భారీ చిత్రాల‌తో `శివ‌లింగ‌` నిర్మాత ర‌మేష్ పిళ్లై

Advertisement
CJ Advs

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై.. రాఘ‌వ‌ లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివ‌లింగ‌`. ఏప్రిల్ 14న  ఈ సినిమా రిలీజ‌వుతోంది. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్ని అంశాల‌తో  తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుంది. క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌గారు న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. డైరెక్ట‌ర్ వాసు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. లారెన్స్‌కి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది. 

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. శనివారం అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై పుట్టిన‌రోజు. దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించి తెర‌కెక్కించిన `శివ‌లింగ‌` తెలుగులో ఘ‌న‌విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారాయ‌న‌. ఈ సినిమాతోనే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. త‌దుప‌రి మ‌రిన్ని చ‌క్క‌ని చిత్రాల్ని నిర్మించ‌డ‌మే ధ్యేయంగా ప‌రిశ్ర‌మ‌కి వ‌స్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs