Advertisement
Google Ads BL

కొత్త వాళ్ళతో వర్క్ చేస్తే పూరికి కిక్కొస్తాదట!


`రోగ్‌` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ - పూరి జ‌గ‌న్నాథ్‌

Advertisement
CJ Advs

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై జయాదిత్య సమర్పణలో ఇషాన్‌ని హీరోగా పరిచయంచేస్తూ డా|| సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి నిర్మించిన చిత్రం 'రోగ్‌' మరో చంటిగాడి ప్రేమకథ. ఈ చిత్రం మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయి భారీ ఓపెనింగ్స్‌ని సాధించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇషాన్‌ పర్ఫామెన్స్‌, హీరోయిన్స్‌ మన్నారా, ఏంజెలినా గ్లామర్‌, సునీల్‌కశ్యప్‌ మ్యూజిక్‌, ముఖేష్‌ ఫొటోగ్రఫి, విజువల్స్‌, పూరి టేకింగ్‌ ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. రిలీజ్‌ అయిన అన్ని ధియేటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఈ చిత్రం రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మార్చి 5న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌, హీరో ఇషాన్‌, హీరోయిన్‌ మన్నారాచోప్రా, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌, కెమెరామెన్‌ ముఖేష్‌, ఎడిటర్‌ జునైద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ జానీ షేక్‌, కొరియోగ్రాఫర్‌ యాని పాల్గొన్నారు. 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ - 'రోగ్‌' రిలీజ్‌ అయి మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. తెలుగు, కన్నడంలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రివ్యూన్‌ అన్నీ చాలా పాజిటివ్‌గా రాసి మా సినిమాని ఎంకరేజ్‌ చేస్తున్నందుకు అందరికీ నా ధాంక్స్‌. మా టీమ్‌ అంతా కొన్ని ధియేటర్లకి వెళ్లి ఆడియన్స్‌ మధ్యలో సినిమా చూశాం. ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేశాం. ఇషాన్‌కి చాలా మంచి పేరు వచ్చింది. 2, 3 సినిమాలు చేసిన హీరోకి ఎంత పేరు వస్తుందో ఇషాన్‌ ఫస్ట్‌ సినిమాకే అంత పేరు కొట్టేశాడు. ఇషాన్‌ చాలా బాగున్నాడు. మంచి హీరోని ఇంట్రడ్యూస్‌ చేశారు అని నాకు కొన్ని వందల మెసేజ్‌లు వస్తున్నాయి. మన్నారా, ఏంజెలినా బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్‌ చేశారు. మన్నారాకి ఫ్యాన్స్‌ ఎక్కువైపోయారు. ఈ సినిమాకి చాలా మంది కొత్త వాళ్లు వర్క్‌ చేశారు. విలన్‌గా నటించిన అనూప్‌సింగ్‌ క్యారెక్టర్‌కి టెరిఫిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అజీజ్‌ఖాన్‌, రాహుల్‌, జానీ, జునైద్‌ చాలా మంచి హార్డ్‌వర్క్‌ చేశారు. టాలెంట్‌ ఉన్న కొత్త వాళ్లతో వర్క్‌ చేస్తుంటే నాకు చాలా కిక్‌గా ఉంది. సినిమా అందరికీ నచ్చింది. ఈరోజుకి కూడా ఆల్‌మోస్ట్‌ అన్ని ధియేటర్లు 90 శాతం ఫుల్స్‌ అయ్యాయి. ఇంకా పూరి కనెక్ట్స్‌లో టాలెంట్‌ ఉన్న కొత్త వాళ్లని ఎంకరేజ్‌ చేస్తూ పనిచెయ్యాలి. ఈ సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ నా థాంక్స్‌.. అన్నారు. 

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో ఇషాన్‌ మాట్లాడుతూ - నా మీద నమ్మకంతో నన్ను నమ్మి మనోహర్‌, గోపి అన్నయ్యలు యాక్టింగ్‌ కోర్సు నేర్పించారు. అలాగే నా స్టిల్స్‌ చూసి ఇమీడియట్‌గా హీరో క్వాలిటీస్‌ అన్నీ వున్నాయి అని నమ్మి ఎంతో డేర్‌గా పూరి గారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ మంచి సినిమా తీశారు. నాలాంటి కొత్త వారందరికీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఎంకరేజ్‌ చేసిన నా గాడ్‌ఫాదర్‌ పూరిగారికి నా థాంక్స్‌. యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఇంత సక్సెస్‌ అవడానికి పూరిగారే ముఖ్య కారణం. ఈ క్రెడిట్‌ అంతా పూరి సార్‌కే చెందుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ప్రేమతో వర్క్‌ చేశారు. వారందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. సెట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా నన్ను ఆదరించి చూసుకున్నారు. సునీల్‌కశ్యప్‌ ఫెంటాస్టిక్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. ఆడియో సినిమాకి పెద్ద ప్లస్‌ అయింది. వెంకట్‌ మాస్టర్‌ రియలిస్టిక్‌గా యాక్షన్‌ సీక్వెన్స్‌ని కంపోజ్‌ చేశారు. హీరోయిన్స్‌ మన్నారా, ఏంజెలినా ఎక్స్‌లెంట్‌గా ఫర్ఫామ్‌ చేశారు. నా మీద కాన్ఫిడెన్స్‌తో అవకాశం ఇచ్చి పెద్ద సక్సెస్‌ ఇచ్చిన పూరి సార్‌కి జీవితాంతం రుణపడి వుంటాను. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా రిసీవ్‌ చేసుకుని ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్‌ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే అందరి సపోర్ట్‌ వుండాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

హీరోయిన్‌ మన్నారాచోప్రా మాట్లాడుతూ - అంజలి క్యారెక్టర్‌కి మంచి అప్రీషియేషన్‌ వస్తోంది. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన నా గాడ్‌ఫాదర్‌ పూరి గారికి నా థాంక్స్‌. సునీల్‌ కశ్యప్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. పర్టిక్యులర్‌గా నా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ఎక్స్‌లెంట్‌గా ఉంది. ముఖేష్‌ ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. జునైద్‌ ఎడిటింగ్‌ చాలా బాగుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ జాని ప్రతి సెట్‌ని చాలా అందంగా వేశారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా అందరూ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. కోల్‌కతాలో ముప్పై రోజులు వర్క్‌ చేశాం. యాక్షన్‌ సీన్స్‌ని పరిగెడుతూ ముఖేష్‌ చిత్రీకరించారు. వెంకట్‌ చాలా నాచురల్‌గా ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. హ్యాట్సాఫ్‌ టు హిమ్‌. యాని మాస్టర్‌ బ్యూటిఫుల్‌ కొరియోగ్రఫి చేశారు. ఫైనల్‌గా ఇషాన్‌ లవ్‌లీ కోస్టార్‌. 'రోగ్‌'తో స్టార్‌ హీరో అయ్యారు. ఇషాన్‌ ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ - పూరి జగన్నాధ్‌గారు ఎన్నో సలహాలు ఇచ్చి మంచి ట్యూన్స్‌ చేయించుకున్నారు. విజువల్‌గా సాంగ్స్‌ అన్నీ బాగా వచ్చాయి. స్పెషల్‌గా రీ రికార్డింగ్‌ చాలా బాగా కుదిరింది. నన్ను ఎంకరేజ్‌ చేస్తూ అవకాశం ఇచ్చిన పూరి సార్‌కి నా థాంక్స్‌..అన్నారు. 

కళా దర్శకుడు జానీ మాట్లాడుతూ - మా టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకోవడానికి పూరి జగన్నాధ్‌ గారు ఈ సినిమాతో అవకాశం కల్పించారు. ఆయనకి నా కృతజ్ఞతలు. టీమ్‌ అంతా ఒక ఫ్యామిలీలా కలసి ఇష్టపడి ఈ సినిమాకి వర్క్‌ చేశాం. ఫైనల్‌గా రిజల్ట్‌ బాగా వచ్చింది. ఆడియన్స్‌ ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు.. అన్నారు. 

కెమెరామెన్‌ ముఖేష్‌ మాట్లాడుతూ - ఈ సినిమా రిలీజ్‌ అప్పుడు నేను అబ్రాడ్‌లో ఉన్నాను. సినిమా మంచి హిట్‌ అయింది. రివ్యూస్‌ అన్నీ చాలా బాగా రాశారు. ముఖ్యంగా ఫొటోగ్రఫి చాలా బాగుందని రాయడం చాలా ధ్రిల్‌గా ఫీలయ్యాను. ఈ క్రెడిట్‌ అంతా పూరిగారికే చెందుతుంది. నా మీద నమ్మకంతో మంచి అవకాశం కల్పించారు. నా టాలెంట్‌ని ఈ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నాను. బైలాంగ్వేజ్‌ ఫిలిం అయినా పూరిగారు ఎన్నో సజెషన్స్‌ ఇస్తూ చాలా ఫాస్ట్‌గా ఈ సినిమా తీశారు. ఆయనతో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు ఏది కావాలో క్లియర్‌గా చెప్తారు. అది అర్ధం చేసుకుని వర్క్‌ చేస్తే చాలామంది కొత్త వాళ్లను ఎంకరేజ్‌ చేస్తూ ఈ సినిమాని అత్యద్భుతంగా తీసిన పూరి జగన్నాధ్‌ గారికి నా ధన్యవాదాలు.. అన్నారు. 

ఎడిటర్‌ జునైద్‌ మాట్లాడుతూ - ప్రతిచోట ధియేటర్స్‌ అన్నీ ఫుల్స్‌ అవుతున్నాయి. ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ ఆదరిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాధ్‌ గారికి థాంక్స్‌.. అన్నారు. 

కొరియోగ్రాఫర్‌ యాని మాట్లాడుతూ - పూరి జగన్నాధ్‌గారు జ్యోతిలక్ష్మి, లోఫర్‌, రోగ్‌ చిత్రాలకు అవకాశం కల్పించారు. ఆయన ప్రోత్సాహం వల్లే వరుసగా సినిమాలకు కొరియోగ్రఫి చేయగలుగుతున్నాను. 'కాటమరాయుడు'లో పవన్‌కళ్యాణ్‌ గారికి ఒక సాంగ్‌ కంపోజ్‌ చేశాను. అలాగే రీసెంట్‌గా కృష్ణవంశీ గారి 'నక్షత్రం' మూవీ చేశాను. మీరు పూరి టెక్నీషియన్‌ అని తెలిసింది అందుకే ఈ సినిమాలో అవకాశం ఇచ్చాను అని కృష్ణవంశీగారు చెప్పారు. ఒక లేడీ కొరియోగ్రాఫర్‌ అయిన నన్ను పూరి జగన్నాధ్‌గారు ఎంకరేజ్‌ చేస్తున్నందుకు చాలా థాంక్స్‌. ఇప్పటికే 40 పాటలకు కొరియోగ్రఫి చేశాను. ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్‌గారు నాకు గాడ్‌ఫాదర్‌లాంటి వారు.. అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs