Advertisement
Google Ads BL

పూరి..ఇండస్ట్రీకి మరో ఇడియట్ నిస్తున్నాడంట!


'రోగ్‌' తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న హీరో ఇషాన్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు - వి.వి.వినాయ‌క్‌

Advertisement
CJ Advs

బ‌ద్రి, ఇడియ‌ట్‌, పోకిరి వంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌తో సెన్సేష‌న‌ల్ హిట్ మూవీస్ చేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇషాన్‌ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్‌గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం 'రోగ్‌'. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్‌. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌, హీరో ఇషాన్‌, ఎంజెలా, సునీల్ క‌శ్య‌ప్‌, భాస్కర భ‌ట్ల‌, డైరెక్ట‌ర్ క్రిష్‌, సాయిరాం శంక‌ర్‌, ఆకాష్ పూరి, రోష‌న్‌, అర్బాజ్ ఖాన్‌, మ‌న్నార్ చోప్రా, క‌షిష్ వోరా, నికిత, అలీ, ప్ర‌సాద్ వి.పొట్లూరి, సుబ్బ‌రాజు, ఎ.ఎం.ర‌త్నం, ఎహ్‌జాజ్ ఖాన్‌, స‌త్యానంద్‌, సంజ‌న‌, వి.ఆనంద్ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. బిగ్ సీడీని వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత అర్బాజ్ ఖాన్‌ విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని వి.వి.వినాయ‌క్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...

పూరిగారి ద‌ర్శ‌క‌త్వం అంటే చాలా ఇష్టం

బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ - పూరిగారు డైరెక్ష‌న్ వ‌ర్క్‌ను నేను చాలా ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్ మూవీ రోగ్‌. ఇషాన్ చూడ‌టానికి కొత్త హీరోలా కాకుండా ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా క‌న‌ప‌డుతున్నాడు. సినిమా చూడాలని చాలా  ఎగ్జయిటింగ్ గా ఉంది. మనోహర్ గారికి అభినందనలు. సినిమా పెద్ద హిట్ కావాలి..అన్నారు. 

ద‌క్షిణాదిలో మ‌ణిర‌త్నం త‌ర్వాత పూరినే

సెన్నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ... కొత్త హీరో ఇషాన్‌ చాలా బాగున్నాడు. భ‌విష్య‌త్‌లో ఇషాన్ అగ్ర కథానాయకుడిగా ఎదుగుతాడు. పూరిజ‌గ‌న్నాథ్‌ ఒక కొత్త ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు అనిపిస్తుంది.  పూరి జగన్నాథ్‌ వయసు తగ్గుతూ ఉంటుంది తప్ప పెరగడం లేదు. కథ, సంభాషణలు సమకూర్చుకొని ప్రతిసారీ కొత్తగా సినిమాని తీయగల సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. దక్షిణాదిలో మణిరత్నంగారి తర్వాత పూరినే. నిజమైన క్రియేటర్లు వాళ్లు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి. మళ్లీ పూరి తనయుడు ఆకాష్‌ కథానాయకుడిగా పరిచయమయ్యే సినిమా వేడుకలో ఇలా అందరం కలవాలి.. అన్నారు.

ఇషాన్ యాబై సినిమాల హీరోగా ఎదుగుతాడు

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - చాలా రోజులు త‌ర్వాత తీసిన స‌ర‌దాగా సాగే ల‌వ్ స్టోరీ. ఈ సినిమాకు ఆడియో బెస్ట్‌గా నిలుస్తుంది. సునీల్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకు ఆడియో ప్ల‌స్ అవుతుంది. ఫెంటాస్టిక్ టీం ఈ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. బద్రి సినిమా చేస్తున్న‌ప్పుడు నా నిర్మాత‌కు ఓ టెన్ష‌న్ ఉండేది. ఫ‌స్ట్ డే షూట్ ముగిసిన త‌ర్వాత ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి యాబై సినిమాలు తీస్తావు పో అని ఆరోజు చెప్పారు. ఆరోజున నా నిర్మాత న‌న్ను న‌మ్మి ఏ న‌మ్మ‌కంతో అయితే ఆ మాట అన్నారో..అలాంటి న‌మ్మ‌కంతో చెబుతున్నాను. ఇషాన్ యాబై సినిమాలు చేస్తాడు. యాబై సినిమాలు చేయ‌డం అంత సుల‌వు కాదు. యాబై సినిమాలు చేయాలంటే ఇర‌వైయేళ్ళు ప‌డుతుంది. ఆ స‌త్తా మా వాడికి ఉంద‌ని డైరెక్ట‌ర్‌గా నేను న‌మ్ముతున్నాను. ఇషాన్‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంది. మ‌నోహ‌ర్‌గారికి త‌మ్ముడంటే చాలా ప్రేమ‌. త‌మ్ముడితో ఎన్ని సినిమాలు అయినా చేయ‌గ‌ల‌డు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది..అన్నారు. 

పూరిగారితో ఇషాన్ సినిమా..నా డ్రీమ్

నిర్మాత సి.ఆర్‌.మ‌నోహ‌ర్ మాట్లాడుతూ - రోగ్ సినిమాతో ఇషాన్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డంతో నా డ్రీమ్ నిజ‌మైంది. పూరిసార్ చేతిలో ప‌డ‌టం ఇషాన్ అదృష్టం. మా అన్న‌య్య ఏదో డ‌బ్బులు పెడుతున్నాడు. సినిమా చేయాల‌ని ఇండ‌స్ట్రీలోకి రాలేదు. స‌త్యానంద్ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ఇషాన్ ట్ర‌యినింగ్ తీసుకున్న త‌ర్వాత స‌త్య‌నంద్‌గారు న‌న్ను క‌లిసి పూరిగారితో ఇషాన్ సినిమా చేస్తే బావుంటుంద‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. ఆయ‌న స‌ల‌హాతో పూరిగారిని క‌లిశాను. ఆయ‌న ఇషాన్‌ను చూడ‌గానే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. పూరిగారు ఇషాన్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డ‌మే అదృష్టం. పూరిగారు చాలా మంచి వ్య‌క్తి. ఆకాష్ కంటే బాగా చూసుకుంటాన‌ని చెప్పి అలాగే చూసుకున్నారు. పూరిగారికి నా లైఫ్ అంతా రుణ‌ప‌డి ఉంటాను. సినిమాను బాగా చేశారు. సునీల్ క‌శ్య‌ప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే అనూప్ సింగ్‌, మ‌న్నారా చోప్రా, ఎంజెలా, ముఖేష్‌.జి, స‌హా అంద‌రికీ థాంక్స్‌.. అన్నారు. 

పూరిగారు ఎంతో కాన్ఫిడెన్స్‌నిచ్చారు

ఇషాన్ మాట్లాడుతూ - మా ప్యామిలీ మెంబ‌ర్స్‌, మా గురువుగారు స‌త్యానంద్‌గారు, మా అన్నయ్య వ‌ల్లే నేను ఈరోజు నేను ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. పూరిగారి దర్శకత్వంలో సినిమా చేయ‌డ‌మే కాదు. పూరిగారి వంటి మంచి ఫ్యామిలీ నాకు దొరికింది. పూరిగారు, లావ‌ణ్య‌గారి ప్రేమ‌, కాన్ఫిడెన్స్‌తో సినిమా చ‌క్క‌గా చేయ‌గ‌లిగాను. ముఖేష్‌గారు చాలా బ్యూటీఫుల్ విజువ‌ల్స్ ఇచ్చారు. సునీల్ క‌శ్యప్ భ‌య్యా..అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల‌గారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. మ‌న్నారా చోప్రా, ఎంజెలా మంచి కోస్టార్స్. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌.. అన్నారు. 

డైరెక్ట‌ర్ క్రిష్ మాట్లాడుతూ - పూరిగారు సినిమా టైటిల్స్ పోకిరి, ఇడియట్‌, రోగ్ అని ఉంటాయి. కానీ పూరిగారి సోల్ ఇంటిగ్రిటీతో కూడుకుని ఉంటుంది. ఇషాన్ చాలా బావున్నాడు. పూరిగారి సినిమాలో ఒక మార్కు ఉంటుంది. అలాగే రోగ్‌లో కూడా ఒక మార్కు ఉంటుంది. ర‌ఫెస్ట్ రోగ్‌ను మనం ఈ సినిమాలో చూడొచ్చు. టీంకు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు. 

ప్ర‌సాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో పూరి జ‌గ‌న్నాథ్‌ది ఒక స‌ప‌రేట్ స్ట‌యిల్‌.  ఒక నెగ‌టివ్ టైటిల్ ఇడియ‌ట్‌తో ర‌వితేజను మాస్ మ‌హారాజాను, పోకిరి ప్రిన్స్ మ‌హేష్‌ను సూప‌ర్‌స్టార్‌గా మార్చేశాడు. ఇప్పుడు రోగ్‌తో ఇషాన్ పెద్ద స్టార్ అవుతాడ‌ని భావిస్తున్నాను. నిర్మాత మ‌నోహ‌ర్ నాకు చాలా మంచి మిత్రుడు. సినిమా గ్రాండ్ స‌క్సెస్‌ను సాధించాలి..అన్నారు. 

ఎ.ఎం.ర‌త్నం మాట్లాడుతూ - ఇషాన్ చాలా అదృష్ట‌వంతుడు. తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోల‌ను ప‌రిచ‌యం చేయాలంటే, రాఘ‌వేంద్ర‌రావుగారు, పూరిగారికే చెల్లుతుంది. ఈ సినిమాను నేను చూశాను. ఇషాన్ ఇర‌గ‌దీశాడు. ర‌ఫ్ క్యారెక్ట‌ర్‌...త‌ను, విల‌న్ క‌లిసి పోటాపోటీగా న‌టించారు. త‌మిళంలో ఈ సినిమాను నా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేస్తున్నాను. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా తీయ‌డంలో పూరిగారు బెస్ట్‌. పూరిగారికి, ఇషాన్ స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు. 

వి.ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - డైరెక్ట‌ర పూరి, నిర్మాత మ‌నోహ‌ర్‌, ఇషాన్ స‌హా అందరికీ ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది.. అన్నారు. 

స‌న్నిలియోన్ మాట్లాడుతూ - రోగ్ ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. పూరిగారు డైరెక్ష‌న్ చాలా బావుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు. 

సునీల్ క‌శ్య‌ఫ్ మాట్లాడుతూ - పూరిగారితో క‌లిసి ప‌నిచేయ‌డం వండ‌ర్‌ఫుల్ జ‌ర్నీ. సినిమాలో చాలా మంచి మ్యూజిక్ కుదిరింది. భాస్క‌ర‌భ‌ట్ల‌గారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. రోగ్ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది.. అన్నారు. 

సాయిరాం శంక‌ర్ మాట్లాడుతూ - రోగ్‌తో మ‌రో ఇడియ‌ట్‌లాంటి స‌క్సెస్ గ్యారంటీ. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు. 

ఆకాష్ పూరి మాట్లాడుతూ - రోగ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేశాను. అందువ‌ల్ల యాక్ట‌ర్‌గా చాలా నేర్చుకున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన నాన్న‌గారికి థాంక్స్‌. హీరో ఇషాన్ నాకు అన్న‌య్య‌తో స‌మానం. ఇషాన్ చాలా మంచోడు. బెంగ‌ళూర్ నుండి టాలీవుడ్‌కు వ‌చ్చిన ఇషాన్ అన్న‌య్య త్వ‌రలోనే పెద్ద స్టార్‌గా పేరు తెచ్చుకుంటాడు.. అన్నారు. 

మ‌న్నారా చోప్రా మాట్లాడుతూ - రోగ్ సినిమాలో ప‌నిచేయ‌డం చాలా ఎగ్జ‌యిటింగ్ జ‌ర్నీ. నాకు అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చిన పూరిగారికి థాంక్స్‌. అలాగే నిర్మాత మ‌నోహ‌ర్‌గారికి థాంక్స్‌. ఇషాన్ మంచి కోస్టార్‌. మంచి సినిమాలో న‌టించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి... అన్నారు. 

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs