Advertisement
Google Ads BL

ఇడియ‌ట్‌, ఆర్య..ఇప్పుడు 'నేను లోక‌ల్'..!


ఇడియ‌ట్‌, ఆర్య సూప‌ర్‌హిట్ అయినట్లే 'నేను లోక‌ల్' సూప‌ర్‌హిట్ అవుతుంది - దిల్ రాజు

Advertisement
CJ Advs

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'. 'ఆటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్‌...' క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్యక్రమం శనివారం కాకినాడలో జరిగింది. 

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత దిల్‌రాజు, నాని, కీర్తి సురేష్‌, శిరీష్‌, దేవిశ్రీప్ర‌సాద్‌, న‌వీన్‌చంద్ర‌, తూర్పుగోదావరి జిల్లా క‌లెక్ట‌ర్ అరుణ్‌కుమార్‌, శ్రీదేవి, బెక్కం వేణుగోపాల్‌, డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన‌, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ అలీం బాషా, దొర‌బాబు, రైట‌ర్ సాయికృష్ణ‌, డైలాగ్ రైట‌ర్ ప్ర‌స‌న్న‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.దిల్ రాజు సహా చిత్రయూనిట్ సభ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. 

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ - 'కాకినాడ‌లో జ‌రుగుతున్న ఫ‌స్ట్ ఆడియో వేడుక నేను లోక‌ల్‌. నేను కాకినాడ‌లో ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నాను. అప్ప‌డు నేను చూసిన మొద‌టి సినిమా ఆర్య‌. అదే స‌మ‌యంలో దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయాల‌నుకున్నాను. ఆ క‌ల నేర‌వేర‌డానికి ఎనిమిదేళ్ళు ప‌ట్టింది. నాని అన్న క‌థ విని చేద్దామ‌న్న‌ప్పుడు ఎంత టెన్ష‌న్ ప‌డ్డానో నాకు తెలుసు. నాకు త్రినాథ్‌గారికి మ‌ధ్య మంచి వేవ్ లెంగ్త్ ఉంది. నేను డైరెక్ట‌ర్ అయితే ఆయ‌న‌లాగే సినిమా చేయాల‌నుకుంటాను. శిరీష్‌గారికి, హ‌ర్షిత్‌గారికి థాంక్స్‌..'..అన్నారు. 

న‌వీన్‌చంద్ర మాట్లాడుతూ - అందాల‌రాక్షసి సినిమాను దిల్‌రాజుగారు రిలీజ్ చేసి సూర్య‌గా న‌న్ను ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న బ్యాన‌ర్‌లో నేను లోక‌ల్ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ రోల్‌కు నేను యాప్ట్ అవుతాన‌ని అనుకున్న ప్ర‌సన్న‌గారికి, త్రినాథ్‌గారికి, బెక్కం వేణుగోపాల్‌కు థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్‌గారితో నేను చేస్తున్న రెండో సినిమా. నా సినిమాటోగ్రాఫ‌ర్ నిసార్ న‌న్ను చ‌క్క‌గా చూపించారు. అంద‌రూ సినిమా కోసం బాగా హార్డ్ వ‌ర్క్ చేశారు. సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.. అన్నారు. 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -క్యారెక్ట‌ర్ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ ఒక ల‌వ్‌స్టోరీకి ఒక క్యారెక్ట‌ర్ ఉంటే  ఎలా ఉంటుందో అదే నేను లోక‌ల్‌ సిినిమా. ఇడియ‌ట్‌, ఆర్య సూప‌ర్‌హిట్ అయినలాగానే 'నేను లోక‌ల్' సూప‌ర్‌హిట్ అవుతుంది. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. నాని బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. ఇండిపెండెంట్‌గా హీరోగా ఎదిగిన వాళ్ళ‌లో హీరో నాని ఒక‌డు. ఈ సినిమా ఐదు స‌క్సెస్‌లు త‌ర్వాత వ‌స్తున్న సినిమా. నాని సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సినిమా చూపిస్త మావా యూనిట్ స‌భ్యులే ఈ సినిమాకు వ‌ర్క్ చేశారు. దేవి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌వుతుంది. ఈ నెల‌లో శ‌త‌మానం భ‌వ‌తి హిట్ కొట్టాం. నెక్ట్స్ నేను లోక‌ల్‌తో స‌క్సెస్ సాధిస్తాం.. అన్నారు. 

కీర్తి సురేష్ మాట్లాడుతూ - దిల్‌రాజు, బెక్కం వేణుగోపాల్‌, హ‌ర్షిత్‌, శిరీష్‌గారికి థాంక్స్‌. త్రినాథ‌రావుగారి డైరెక్ష‌న్‌లో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నిసార్ త‌న సినిమాటోగ్ర‌ఫీతో ప్ర‌తి సీన్‌ను అందంగా చూపించాడు. దేవిశ్రీప్ర‌సాద్‌గారితో నేను శైల‌జ త‌ర్వాత వ‌ర్క్ చేశాను. మ‌రోసారి దేవిగారు వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నాని కంఫ‌ర్ట‌బుల్ కో స్టార్‌. చాలా మంచి వ్య‌క్తి. ఒక మంచి టీంతో వ‌ర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది... అన్నారు. 

హీరో నాని మాట్లాడుతూ - నేను లోక‌ల్ గురించి ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. థియేట‌ర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిందే. త్వ‌ర‌లో అంటే ఫిబ్ర‌వ‌రిలో నేను లోక‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌చ్చితంగా అంద‌రినీ డిస్ట్ర‌బ్ చేస్తాం. దిల్‌రాజుగారు, నేను క‌లిసి ఎప్ప‌టి నుండో సినిమా చేయాల‌నుకున్నాం. కానీ ఇప్ప‌టికీ కుదిరింది. దిల్‌రాజుగారు, ఆయ‌న టీం వ‌ల్లే మంచి సినిమాను చేయ‌గ‌లిగాం. హీరోగా చేస్తున్నా, నా సినిమాలో కీల‌క‌పాత్ర చేసిన న‌వీన్‌చంద్ర‌కు థాంక్స్‌. న‌వీన్ రోల్ సినిమాకు హైలైట్ అవుతుంది. కీర్తిసురేష్ మంచి పెర్‌ఫార్మ‌ర్‌. త్రినాథ్‌గారు... ప్ర‌స‌న్న‌, సాయికృష్ణ రాసిన క‌థ‌ను ఎంతో అందంగా తెర‌కెక్కించారు. బిగినింగ్ నుండి ఎండింగ్ వ‌రకు కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌..అన్నారు. 

దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - దిల్‌రాజుగారి బ్యాన‌ర్ అంటే హండ్రెడ్ ప‌ర్సెంట్ గ్యారంటీ హిట్ మూవీస్ వ‌స్తాయి. అలాంటి మ‌రో చిత్ర‌మే నేను లోక‌ల్‌. దిల్‌రాజుగారితో నేను చేసిన ఆరో సినిమా ఇది. నాని టైమింగ్ నాకు ఇష్టం. బ్రిలియంట్‌గా న‌టించాడు. కీర్తిసురేష్ కూడా చ‌క్క‌గా యాక్ట్ చేసింది. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది. ప్ర‌స‌న్న‌, సాయికృష్ణ‌, ఉద‌య్ స‌హా అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా చేశాం..అన్నారు. 

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs