Advertisement
Google Ads BL

మిల్కీబ్యూటీ కాదు..తమన్నా అంటే మురిసిపోతుంది!


విశాల్‌తో కలిసి నటించిన 'ఒక్కడొచ్చాడు' నా బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను    

Advertisement
CJ Advs

- మిల్కీ బ్యూటీ తమన్నా 

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రంలో విశాల్‌ సరసన హీరోయిన్‌గా నటించిన మిల్కీబ్యూటీ తమన్నా పుట్టినరోజు డిసెంబర్‌ 21. డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా 'ఒక్కడొచ్చాడు' రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్‌ తమన్నా చిత్రం గురించి తెలియజేసిన విశేషాలు. 

'ఒక్కడొచ్చాడు' చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది? 

- ఇందులో జగపతిబాబుగారి సిస్టర్‌గా చేశాను. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌. ఇది ఒక కమర్షియల్‌ ప్యాకేజ్‌డ్‌ మూవీ. అన్ని హంగులు ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా సినిమాలో ఉంటుంది. నా బర్త్‌ డే టైమ్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవడం ఆనందంగా వుంది. 'ఒక్కడొచ్చాడు' చిత్రం నా బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను. 

నిర్మాత హరి గురించి చెప్పండి? 

- హరిగారు సినిమా ప్రారంభం నుండి మాతోనే ట్రావెల్‌ అవుతున్నారు. తెలుగులో సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాత హరిగారే కారణం. సాంగ్‌ ప్రోమోస్‌, ట్రైలర్‌ అన్ని విషయాల్లో కేర్‌ తీసుకున్నారు. ప్రమోషన్స్‌ విషయంలో ఆయన తీసుకున్న కేర్‌ చూసి ఎంతో ఆనందపడ్డాను. 

విశాల్‌తో కలిసి వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది? 

- విశాల్‌తో తొలిసారి కలిసి యాక్ట్‌ చేస్తున్నాను. విశాల్‌ ఎప్పుడూ తన చేసే సినిమా ప్రొడక్ట్‌ బావుండాలని కోరుకుంటారు. అందుకే సెట్స్‌లో బాగా కష్టపడతారు. నటుడుగానే కాదు, నడిగర్‌ సంఘంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

టైలర్‌లోని డైలాగ్స్‌, సాంగ్స్‌కు మంచి అప్రిసియేషన్‌ వస్తుంటే ఏమనిపిస్తోంది? 

- ఒక కమర్షియల్‌ సినిమా ఆడియెన్స్‌కు బాగా రీచ్‌ కావాలంటే పాటలు, డైలాగ్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. రాజేష్‌ ప్రతి డైలాగ్‌ను ఆడియెన్స్‌ మైండ్‌లోకి రీచ్‌ అయ్యేలా చక్కగా రాశారు. ఈ సినిమాకు సాహిత్యాన్ని లేడీ రైటర్‌ అందించడం విశేషం. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేడీస్‌ పాడుతుంటారు. యాక్ట్‌ చేస్తారు. ఎందుకో రాసేవాళ్లు తక్కువగా కనిపిస్తారు. కానీ 'ఒక్కడొచ్చాడు' సినిమాకు మా ప్రొడ్యూసర్‌ హరిగారు ఓ లేడీ రైటర్‌ చేత పాటలు రాయించారని తెలిసి హ్యపీగా ఫీలయ్యాను. ఈ పాటలు రాసిన డా|| భాగ్యలక్ష్మి నాకు ఎప్పటి నుంచో తెలుసు. 'నే కొంచెం నలుపులే, నువ్వేమో తెలుపులే' అనే పాటను నాకూ, విశాల్‌కి యాప్ట్‌గా రాశారు. 'దిల్‌ చాహ్‌తాహే నిను చూసి తమన్నా' అని నా పేరు వచ్చేలా మరో పాటను రాశారు. ఇప్పటిదాకా నన్ను గురించి రాస్తూ మిల్కీ బ్యూటీ అని చాలా మంది రాశారు కానీ, పాటలో నేరుగా నా పేరును వాడలేదు. దిల్‌ చాహతాహై పాటలో నా పేరు వింటే ఆనందంగా అనిపించింది. ట్రెండీగా సాగే 'హృదయం హృదయం' సాంగ్‌ నా ఫేవరేట్‌ సాంగ్‌. యూత్‌ అంతా పాడుకుంటోన్న పాట అది. ఈ సినిమాతో లిరిసిస్ట్‌ భాగ్యలక్ష్మి గారికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. 

డైరెక్టర్‌ సురాజ్‌ గురించి చెప్పండి? 

- సురాజ్‌గారు కామెడి పాయింట్‌తో, కమర్షియల్‌ యాంగిల్‌ను మిక్స్‌ చేసి సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లే విధంగా సినిమాలు తీస్తారు. 

సినిమాలో హైలైట్స్‌ ఏంటి? 

- నైస్‌ లవ్‌ ట్రాక్‌, గ్రాండియర్‌, మంచి సాంగ్స్‌, విజువల్స్‌, మంచి మెసేజ్‌, కామెడి, గుడ్‌ స్క్రీన్‌ప్లే అన్నీ ఈ సినిమాలో పెద్ద హైలైట్‌ అవుతాయి. 

తదుపరి చిత్రాలు..? 

- ప్రస్తుతం 'బాహుబలి2'లో నటిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలవుతుంది. రాజమౌళిగారి దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌లో కూడా నటించడం గొప్ప ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. అలాగే ఒక తమిళ్‌ సినిమాలో కూడా నటిస్తున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs