Advertisement
Google Ads BL

కేవ‌లం 30 రోజుల్లో 38 కొట్ల గ్రాస్ వ‌సూలు..!


`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` గ్రాండ్ 30 రోజుల వేడుక‌

Advertisement
CJ Advs

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ న‌టించిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రం అత్యంత క్లిష్ట‌ప‌రిస్థితిలో ప్రేక్ష‌కులు చిల్ల‌ర స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్న స‌మ‌యంలో విడుద‌ల‌య్యి గ్రాండ్ స‌క్స‌స్ ని సొంతంచేసుకుంది. అంతేకాకుండా హీరో నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్ గా కేవ‌లం 30 రోజుల్లో 38 కొట్ల గ్రాస్ వ‌సూలు చేసి కంటెంట్ వున్న చిత్రాల‌కు ఏవిధ‌మైన ఆటంకాలు క‌ల‌గ‌వ‌ని నిరూపించింది. ఈ చిత్రం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది సోషియా థ్రిల్ల‌ర్ మూవీ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టికి వీకెండ్స్ లో హౌస్‌ఫుల్స్ కావ‌టం విశేషం.  ఈ చిత్రంలో హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరోయిన్స్‌గా న‌టించి మెప్పించారు.  ఈ చిత్రాన్ని మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించారు. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` విడుద‌లైన ఆట నుండి సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అమెరికా నుండి అన‌కాప‌ల్లి వ‌ర‌కు నిఖిల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ను సాధించి ఈ టైంలో  సినిమా విడుద‌లైన తొలి వారంలోనే 20 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి తెలుగు సినిమా విడుద‌ల‌కి పూల‌బాట‌ని చూపించింది. యు.ఎస్‌లో సినిమా దాదాపు  మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్‌ను సాధించిన ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజుల వైపుగా ప‌రుగులు తీస్తున్న సంధ‌ర్బంలో గ్రాండ్ 30 రోలుల వేడుక‌ని యూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా వ‌చ్చిన నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈచిత్రం చాలా క్లిష్ట‌మైన టైంలో వ‌చ్చి మంచి విజ‌యం సాధించినందుకు ముందుగా ప్రేక్ష‌కుల‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి టైంలో తెలుగు సినిమా  స‌పోర్ట్ ఇచ్చారు. నిఖిల్ సూప‌ర్బ్ యాక్టింగ్‌, హీరోయిన్స్ చాలా బాగా చేశారు. డైర‌క్ట‌ర్ ఆనంద్ కి చాలా మంచి ఫ్యూచ‌ర్ వుంటుంది. కాంగ్సాట్స్ టు ఆల్‌..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. చిల్ల‌ర స‌మ‌స్య తెలుగు సినిమా మీద ప‌రోక్షంగా చాలా పెద్ద ప్ర‌భావం చూపించింది. ఇలాంటి టైంలో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రం ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాందించినందుకు చాలా హ్య‌పిగా వుంది. చిన్న చిత్రంగా విడుద‌ల‌కి ఎన్ని క‌ష్టాలు ప‌డాలో అన్ని క‌ష్టాలు ప‌డింది. ఇప్ప‌డు పెద్ద విజ‌యం సాధించి అంద‌రికి లాభాలు తెచ్చిపెట్టింది. ఇలాంటి కంటెంట్ వున్న చిత్రాలు ఇంకా రావాలి. అన్నారు

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నిఖిల్ అన్ని చిత్రాలు చూశాను చాలా బాగుంటాయి. కొత్త చిత్రాలు చేసుకుంటూ స‌క్స‌స్ తో ముందుకు వెలుతున్నాడు. 500, 1000 నోట్ల ర‌ద్దు టైంలో ఇలాంటి స‌క్స‌స్ ఎవ‌రూ ఊహించ‌లేదు. కంగ్రాట్స్ టు ఆల్ ఈపిసి టీం..

హీరో నిఖ‌ల్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ద బెస్ట్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. క‌లెక్ష‌న్ ప‌రంగా చాలా పెద్ద స‌క్స‌స్ అయ్యింది. ఇక‌పోతే ఈ చిత్రం విడుద‌ల టైంలో అంద‌రూ వ‌ద్దు అన్నారు. దిల్ రాజుగారు, సురేష్ బాబు గారు మా చిత్రం విడుదల‌కి ఎంతో స‌పోర్ట్ చేసి మా విజ‌యంలో భాగం అయ్యారు. అలాగే మా టీం అంతా చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాము. 

డైర‌క్ట‌ర్ వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ.. మా విజ‌యానికి ఎంత‌గానో స‌పోర్ట్ అందించిన మీడియా సోద‌రుల‌కి మా ధ‌న్య‌వాదాలు. ప్ర‌తి ఓక్క‌రూ ఈ టైంలో ఈ చిత్ర విజ‌యాన్ని స‌పోర్ట్ చేశారు. 

హ‌రోయిన్ హెబ్బాప‌టేల్ మాట్లాడుతూ.. నా వ‌రుస చిత్రాలు స‌క్స‌స్ అయ్యాయి. సో ఆ డైర‌క్ట‌ర్స్ కి ప్రోడ్యూస‌ర్స్ కి నా కొ ఆర్టిస్ట్ ల‌కి నా ధ‌న్య‌వాదాలు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs