Advertisement
Google Ads BL

చిరంజీవిగారు ఈ మూవీ చూస్తానని చెప్పారంట!


'రెమో' చిత్ర స‌క్సెస్‌తో దిల్‌రాజుగారు తెలుగులో నాకు మంచి వేదిక‌నిచ్చారు - హీరో శివ‌కార్తీకేయ‌న్‌

Advertisement
CJ Advs

శివ‌కార్తీకేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను...అది ఈ రోజు నిజమైందని అన్నారు నిర్మాత దిల్‌రాజు. 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో న‌వంబ‌ర్ 24న విడుద‌ల చేశారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. సినిమా హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మంలో దిల్ రాజు, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్‌, పి.సి.శ్రీరాం, అనిరుధ్‌, డైలాగ్ రైట‌ర్ రాజేష్‌, శ్రీమ‌ణి, స‌తీష్ త‌దిత‌రులు పాల్గొని సినిమా స‌క్సెస్‌పై త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఇంత‌కు ముందు నేను త‌మిళంలో వ‌చ్చిన వైశాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేశాను. వైశాలి మంచి స‌క్సెస్ సాధించింది. అలాగే మ‌ణిర‌త్నంగారి ఓకే బంగారం సినిమాను కూడా తెలుగులో విడుద‌ల చేస్తే అది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు అలాగే త‌మిళంలో పెద్ద హిట్ అయిన రెమో సినిమా తెలుగులో విడుద‌ల చేశాను. తెలుగు ప్రేక్ష‌కులు నా న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ సినిమాను స‌క్సెస్ చేశారు.  శివ‌కార్తీకేయ‌న్ న‌ట‌న‌కు త‌మిళంలో ఈ సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలుగులో కూడా అంతే మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. రాజేష్ సినిమాకు మంచి సంభాష‌ణ‌లు రాస్తే, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా నిర్మాత ఆర్‌. రాజాగారు సినిమాను తెలుగులోకి విడుద‌ల చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా స‌క్సెస్ అయిన సందర్భంగా రాజాగారికి కూడా కంగ్రాట్స్ అని దిల్ రాజు అన్నారు. 

మెగాస్టార్ చిరంజీవిగారు సినిమా టీజ‌ర్‌, సాంగ్స్ బావున్నాయని అప్రిసియేట్ చేశారు. సినిమా కూడా చూస్తాన‌ని అన్నారు. ఆయ‌న‌కు థాంక్స్‌. నిన్న ఓ థియేట‌ర్‌లో వెళ్లి ఆడియెన్స్ మ‌ధ్య రెమో సినిమా చూశాను. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో అనువాద‌మై, పెద్ద రేంజ్‌లో విడుద‌లైన సినిమా రెమో నాకు మంచి డెబ్యూ మూవీ అయ్యింది. రెమోను యాక్సెప్ట్‌ను చేశారు. అలాగే హీరోగా న‌న్ను కూడా తెలుగు ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేశారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. దిల్‌రాజుగారు ఈ చిత్రంతో తెలుగులో నాకు మంచి ప్లాట్‌ఫాం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజుగారికి, నిర్మాత రాజా గారికి థాంక్స్‌. రాజేష్ మంచి డైలాగ్స్ రాస్తే, శ్రీమ‌ణి చాలా మంచి పాట‌లు రాశారు. ఈ సినిమా స‌క్సెస్‌తో ఇంకా మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.  తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాలు అందించే ప్ర‌య‌త్నం చేస్తాను. ఈ సక్సెస్‌లో భాగ‌మైన చిత్ర‌యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్ అని హీరో శివ‌కార్తీకేయ‌న్ అన్నారు. రెమో వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని క‌ల్పించిన నిర్మాత రాజ‌గారికి, ఇత‌ర టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌. పి.సి.శ్రీరాం వంటి లెజెండ్రీ సినిమాటోగ్రాఫ‌ర్‌తో ఈ సినిమాలో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా గొప్ప విష‌యం. అలాగే డైరెక్ట‌ర్ భాగ్య‌రాజ్ క‌న్న‌న్ గారు డెబ్యూ డైరెక్ట‌ర్‌లా కాకుండా మంచి ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్ట‌ర్‌లా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. శివ కార్తీకేయ‌న్‌కు రెమో సినిమా తెలుగులో మంచి డెబ్యూ మూవీ కావ‌డం హ్యాపీగా ఉంద‌ని కీర్తి సురేష్ తెలిపారు. మంచి సినిమాల‌ను ఎప్పుడూ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. అలా మంచి కాన్సెప్ట్ కార‌ణంగానే రెమో సినిమాను తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. వ‌చ్చే ఏడాది మూడు తెలుగు సినిమాలు చేస్తున్నాను. అందులో దిల్‌రాజుగారి సినిమా కూడా ఒక‌టి అని సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరాం అన్నారు. 

రెమో చిత్రాన్ని తమిళ ప్రేక్ష‌కులులాగానే ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ అని డైరెక్ట‌ర్ భాగ్యరాజ్ క‌న్నన్ తెలిపారు. .త‌మిళంలో స‌క్సెస్ అయిన‌ట్లే తెలుగులో కూడా రెమో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ అంతా సినిమా స్టార్టింగ్ నుండి స‌క్సెస్‌మీట్ వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూ వచ్చాం. మా న‌మ్మ‌కం నిజ‌మైంది. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద స‌క్సెస్ చేశారు. ఈ సంద‌ర్భంగా 24 ఎ.ఎం. రాజాగారికి థాంక్స్‌. శివ కార్తీకేయ‌న్‌ను అభినంద‌న‌లు అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs