Advertisement
Google Ads BL

డిసెంబర్ 10న హారర్ థ్రిల్లర్ "త్రివిక్రమన్"..!


అమీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "త్రివిక్రమన్". రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో), ప్రవీణ్ రెడ్డి, అమూల్య రెడ్డి, సన, ధన్ రాజ్, డిస్కో సుచిత్ర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తోటకూర రామకృష్ణారావు సహ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత, మధుర ఆడియో అధినేత మధుర శ్రీధర్ రెడ్డి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన క్రాంతికుమార్, సహ నిర్మాత తోటకూర రామకృష్ణారావు, డిస్కో సుచిత్ర, ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన బోలె, లైన్ ప్రొడ్యూసర్ శ్యామ్ సుందర్, డైలాగ్ రైటర్ టి.హర్ష వర్ధన్ పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

"త్రివిక్రమన్" చిత్రం పాటలు తమ మధుర ఆడియో ద్వారానే విడుదలయ్యాయని.. డిసెంబర్ 10న విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని  మధుర శ్రీధర్ అన్నారు. ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించిన తాను ఈ చిత్రాన్ని చూశానని, దర్శకుడిగా క్రాంతికుమార్ కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, భీమవరం టాకీస్ ద్వారా వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని రామసత్యనారాయణ అన్నారు. 

దర్శకనిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ.. "ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజుగారు "త్రివిక్రమన్" సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చి.. అందరికీ ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ ప్రెస్ మీట్ కి ఆయన కూడా రావాల్సి ఉన్నా.. అర్జెంట్ గా చెన్నై వెళ్లాల్సి రావడంతో రాలేకపోయారు. ఆయనతోపాటు.. మధుర శ్రీధర్ గారు, రామసత్యనారాయణగారు "త్రివిక్రమన్" చిత్రాన్ని ఎంతగానో ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ పరంగానురెస్పాన్స్ చాలా బావుంది. డిసెంబర్ 10న వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు. 

"త్రివిక్రమన్" చిత్రానికి సందర్భోచితమైన సంభాషణలు సమకూర్చే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు డైలాగ్ రైటర్ హర్ష వర్ధన్ కృతజ్నతలు తెలిపారు. 

ఈ చిత్రంలో తాను చేసిన ఐటెమ్ సాంగ్ తనకు మరిన్ని అవకాశాలు తెస్తుందనే నమ్మకం ఉందని డిస్కో సుచిత్ర (డిస్కో శాంతి సోదరి) తెలిపారు. ఒకింత భయపెడుతూనే.. ఆద్యంతం వినోదం పంచుతూ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన "త్రివిక్రమన్".. ఆ తరహా చిత్రాలను ఇష్టపడేవారిని అమితంగా అలరిస్తుందని, కొ-ప్రొడ్యూసర్ రామకృష్ణారావు, లైన్ ప్రొడ్యూసర్ శ్యామ్ సుందర్ అన్నారు. 

కథ-కథనాలు కొత్తగా ఉండడంతోపాటు.. వాటిని తెరకెక్కించిన విధానం వినూత్నంగా ఉండడంతో "త్రివిక్రమన్" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరిందని బోలె అన్నారు. 

నేహాదేశ్ పాండే, చంటి, నవీన్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: చెరుకు-బత్తుల, సినిమాటోగ్రఫీ: నాగార్జున-సునీల్ బాబు, ఎడిటింగ్: సునీల్ మహారాణ, సంగీతం: రూంకీ గోస్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిరాజ్ రావుల, సహ నిర్మాత: తోటకూర రామకృష్ణారావు, నిర్మాణం-దర్శకత్వం: క్రాంతికుమార్ !!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs