Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (06-11-16)..!


>సింగం-3 టీజర్‌ రెడీ

Advertisement
CJ Advs

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న  వెర్సటైల్  కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక  చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇక సింగం-3 తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల  టీజర్‌ను సోమవారం (రేపు)ను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత  మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ  అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ చక్కటి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది.  నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి,  డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్. 

> 'బేతాళుడు' ఆడియో విడుదల 

విజియ్ ఆంటోని హీరోగా మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం భేతాళుడు. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీని బోయ‌పాటి శ్రీను విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేసి విజ‌య్ ఆంటోనికి అందించారు. ఈ సంద‌ర్భంగా...

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ - సెటిల్డ్ పెర్‌ఫార్మ్ చేసే హీరోలు తెలుగులో చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌గారు అన్నారు. కానీ తెలుగు హీరోలు కూడా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేస్తారు. అయితే ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల‌మైన మేము మారాలి. అవుటాఫ్ ది బాక్స్ క‌థ‌ల‌తో మ‌నం వెళ్లిన‌ప్పుడు మ‌న హీరోలు కూడా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. సినిమా అనేది స్టేజ్‌పై మాట్లాడ‌కూడ‌దు. స్క్రీన్‌పై మాట్లాడాల‌ని న‌మ్మే వ్య‌క్తిని నేను. అలాంటి తెర‌పై మాట్లాడిన సినిమా బిచ్చ‌గాడు. ఇప్పుడు అదే త‌ర‌హాలో విజ‌య్ ఆంటోని చేసిన భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య్ ఆంటోని మంచి కాన్సెప్ట్ మూవీల‌నే చేయాల‌నుకుంటాడు. మంచి స‌బ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకుంటాడు. మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎక్క‌డి నుండి వ‌చ్చినా మ‌న తెలుగు ప్రేక్ష‌కులు గుండెల్లో పెట్టుకుంటారు. భేతాళుడు కూడా అలాంటి కాన్సెప్ట్ ఫిలిం అవుతుంద‌ని ఆశిస్తున్నాను. టీం అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ మాట్లాడుతూ - 1968లో నేను రాసిన మొద‌టి క‌థ భేతాళుడు. ఇప్పుడు అదే టైటిల్‌తో విజ‌య్ ఆంటోని సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. విజ‌య్ ఆంటోని డా.స‌లీమ్ సినిమా చూసి త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. త‌ను హాలీవుడ్ హీరో రాక్ హ‌ట్‌స‌న్‌లా ఉంటాడు. సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టుడు. తెలుగులో ఇలా సెటిల్డ్ పెర్‌పార్మెన్స్ చేసే న‌టులు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. ఇక విష‌యాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నామ‌నేదాన్నే లైఫ్ అంటారు. ఇప్పుడు విజ‌య్ ఆంటోని అలాంటి ప్రాసెస్‌నే చేస్తున్నాడు. ఇక నిర్మాత వేణుగోపాల్‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. నా తుల‌సీద‌ళంను సీరియ‌ల్‌గా కూడా చేశాడు. ఇప్పుడు ఈ సినిమాతో వేణు ఉన్న‌త‌స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ - భేతాళుడు అవ‌టాప్ ది బాక్స్ సినిమా. రెగ్యుల‌ర్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కింది కాద‌ని టీజ‌ర్‌, ప‌దినిమిషాల సినిమా చూస్తే అర్థమ‌వుతుంది. సాదార‌ణంగా తెలుగులో ఏడాది దాదాపు రెండు వంద‌ల సినిమాలు విడులైతే అందులో ఎక్కువ భాగం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే ఉంటాయి. మ‌నం వాటినే ఆద‌రిస్తాం. అయితే భేతాళుడు వంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను కూడా ఆద‌రించాలి. ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌తో కొత్త సినిమాలు వ‌స్తాయి. బిచ్చ‌గాడుతో ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన విజ‌య్ ఆంటోని భేతాళుడుతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంటారు అన్నారు.

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - నేను చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో భేతాళుడు సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల నుండి ఇంత పెద్ద ఆద‌ర‌ణ‌ను ఎదురుచూడ‌లేదు. సాధార‌ణంగా నాకు ఇంత మంచి గుర్తింపు, ఆద‌ర‌ణ ఏ ఇర‌వై ఐద‌వ సినిమాకు వ‌స్తుంద‌ని అనుకున్నాను. అయితే నా మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. భేతాళుడు క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

ఫాతిమా విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - న‌కిలీ, డా.స‌లీం చిత్రాలు తెలుగులో మంచి స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బిచ్చ‌గాడు సినిమా ముందు త‌మిళంలో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. అయితే తెలుగులో, త‌మిళ్ కంటే పెద్ద హిట్ అయ్యింది. బిచ్చ‌గాడుతో విజ‌య్ ఆంటోని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. సాధార‌ణంగా విజ‌య్ చేసిన న‌కిలీ, డా.స‌లీం, బిచ్చ‌గాడు సినిమాల‌ను రీమేక్ చేస్తామ‌ని అడిగారు. అయితే విజ‌య్ ఆంటోని అందుక ఒప్పుకోలేదు. డ‌బ్ చేసి సినిమాను విడుద‌ల చేద్దామ‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే త‌ను తీసుక‌న్న నిర్ణ‌యం కార‌ణంగానే త‌నకిప్పుడు తెలుగులో మంచి గుర్తింపు ల‌భించింది. భేతాళుడు సినిమాను విడుద‌ల చేస్తున్ననిర్మాత‌లు వేణుగోపాల్, మ‌హేష్, రోహిత్ ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ఇంకా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే విజ‌య్ చేసిన యెమ‌న్ సినిమాను తెలుగులో ర‌వీంద‌ర్‌రెడ్డిగారు, బెల్లంకొండ సురేష్‌గారు విడుద‌ల చేస్తుండ‌టం మంచి ప‌రిణామం అన్నారు.

చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉంది. విజ‌య్ మంచి టాలెంటెడ్ వ్య‌క్తి. స్వ‌గృహ ఫుడ్స్ కుటుంబం అంతా క‌లిసి ఎలాగైతే మంచి వంట‌కాలు చేస్తారో, విజ‌య్ ఆంటోని, ఫాతిమా స‌హా వారి కుటుంబం అంతా మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేయాల‌ని ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తుంటారు. బిచ్చ‌గాడు స‌క్సెస్‌తో విజ‌య్ ఆంటోని తెలుగులో ఒక స్టెప్ ఎదిగారు. భేతాళుడు స‌క్సెస్‌తో మ‌రో మెట్టు ఎక్క‌డం గ్యారంటీ. నిర్మాత‌లు మంచి ఫ్యాష‌న్ ఉన్న‌వ్య‌క్త‌లు ఇలాంటి వ్య‌క్త‌లు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం. బిచ్చ‌గాడు కంటే భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - సినిమా టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. సినిమాను ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అందుకే నేను కృష్ణా, వైజాగ్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ప్రాంతాల హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాను. అలాగే విజ‌య్ ఆంటోని చేసిన యెమెన్ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో క‌లిసి కొన్నాను. సూర్య, విక్ర‌మ్ తెలుగులో ఎలా స‌క్సెస్ అయ్యారో విజ‌య్ ఆంటోని కూడా అలానే పెద్ద స‌క్సెస్‌ఫుల్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - కంటెంట్‌ను న‌మ్మి సినిమా చేసే వ్య‌క్తుల్లో విజ‌య్ ఆంటోని ఒక‌రు. ఆయ‌న‌కు ఆయ‌న భార్య ఫాతిమా మంచి స‌హకారం అందిస్తుంటారు. బిజినెస్ అల్రెడి పూర్త‌య్యింది. సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా ఆ క్రేజ్‌కు త‌గిన‌ట్లు పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.

నిర్మాత మ‌హేష్ మాట్లాడుతూ - విజ‌య్ ఆంటోని గారికి థాంక్స్‌ అన్నారు.,

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రామ‌కృష్ణ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం భేతాళుడు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. ఇంత మంచి సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోని, ఫాతిమా ఆంటోనిగారికి థాంక్స్‌. మంచి టీం స‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

>పోస్ట్‌ ప్రొడక్షన్‌లో జయ బి. 'వైశాఖం' 

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ - ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా 'వైశాఖం' రూపొందుతోంది. లవ్‌లీ తర్వాత మళ్ళీ సూపర్‌హిట్‌ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా 'వైశాఖం'. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిక్స్‌ అయిన 'వైశాఖం' అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్‌ రేంజ్‌కి వెళ్తుంది. కజక్‌స్థాన్‌లో తీసిన సాంగ్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వుంది. ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌కి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది అన్నారు. 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు జయకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చాయి. అంతేకాకుండా మంచి కమర్షియల్‌ హిట్స్‌ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ వైశాఖం. జయ దర్శకత్వంలో సినిమా అనగానే బయ్యర్స్‌ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ కూడా పెద్ద స్థాయిలో వుంటుంది కాబట్టి బిజినెస్‌ పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తీస్తున్న వైశాఖం మా బేనర్‌లో వచ్చిన లవ్‌లీకి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌ నుండి కూడా బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ రావడం హ్యాపీగా వుంది. అలాగే హిందీ, తమిళ్‌ రైట్స్‌ కోసం కూడా ఆఫర్స్‌ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్‌కి నిదర్శనం అన్నారు. 

>మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ - కె.కె.రాధామోహ‌న్‌

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌ల పాటు అహ్లాదాన్ని, అనందాన్నిచ్చే చిత్ర‌మవుతుంది. రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సినిమాను న‌వంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే 2017లో మూడు సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో నితిన్‌తో సినిమా చేయాల‌ని ముందుగా అనుకున్నాను. అయితే అఆ త‌ర్వాత నితిన్ రేంజ్ ఇంకా పెరిగింది. కాబ‌ట్టి త‌న‌తో సినిమా చేయ‌డానికి మంచి క‌థ‌, ద‌ర్శ‌కుడు కావాల‌ని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు నితిన్ హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను పూర్తి చేస్తాడు. అలాగే నాగశౌర్య‌తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాం. ఈ రెండు సినిమాలకు క‌థ‌లను ఫైన‌లైజ్ చేసి డైరెక్ట‌ర్స్ ఎవ‌ర‌నే విషయాన్ని త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. గోపీచంద్‌ను రీసెంట్‌గా క‌లిస్తే ఓ క‌థ విన‌మ‌న్నారు. క‌థ న‌చ్చితే చేద్దామ‌ని అన్నారు. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌ర‌నే దానిపై ఆలోచ‌న‌లు చేస్తాం. 

నేను ఇంజ‌నీరింగ్ చ‌దివాను, ఓ కంపెనీకి సి.ఇ.వో గా ప‌నిచేస్తున్నాన‌. ఈ కంపెనీ మెయిన్ ఆఫీస్‌ కెన్యాలో ఉంది. ఉగాండా, యు.ఎస్‌లో బ్రాంచీలున్నాయి. మంచి టీం స‌పోర్ట్‌తో బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్నాను. సినిమాలంటే ఆస‌క్తి ఉండ‌టంతో 2007లో టాస్ చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్‌గా వ‌ర్క్ చేశాను. 2009లో అధినేత సినిమాను నిర్మించాను. ఏమైంది ఈవేళ‌, ప్యార్‌మే ప‌డిపోయానే, బెంగాల్ టైగ‌ర్ సినిమాల‌ను చేశాను. ఇప్పుడు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 

`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` క‌థ న‌చ్చ‌గానే ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌ని ఆలోచించాం. ఎన్నో విజ‌య‌వంత‌మైన కామెడి చిత్రాల‌ను తెర‌కెక్కించిన స‌త్తిబాబుగారైతే సినిమాను అనుకున్న‌ట్టుగా ప్రెజెంట్ చేయ‌గ‌ల‌ర‌నిపించింది. దాంతో ఆయ‌న్ను క‌లవ‌డం, ఆయ‌న ఒప్పుకోవ‌డం జ‌రిగింది. ఈ చిత్రంలో పృథ్వీ, న‌వీన్‌చంద్ర పాత్ర‌లు నువ్వా నేనా అనేలా ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఒక ఐడియాకు కోటీ రూపాయ‌ల‌నే క్యాప్ష‌న్ కూడా ఎందుకు పెట్టామో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పృథ్వీ, స‌లోని జంట‌గా ఓ భారీ సెట్ వేసి సాంగ్ చేశాం. న‌వీన్‌చంద్ర‌, శృతిసోథీపై అర‌కులో ఓ సాంగ్ చేశాం. మేకింగ్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం గ్యారంటీగా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది అన్నారు. 

> ‘ఇది ప్రేమేనా..!’ ఆడియో ఆవిష్కరణ

యన్నమల్ల‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సుప్రీమ్‌, పావని జంటగా కిషన్‌ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’. ల‌యన్‌ సాయి వెంకట్‌ సమర్పకులుగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఆడియో శనివారం హైదరాబాద్‌ లో జరిగింది. అనీష్‌ దర్బారి సంగీతాన్ని సమకూర్చిన పాటల‌ తొలి సీడీని ల‌యన్‌ సాయి వెంకట్‌ విడుదల‌ చేసి దైవజ్ఞ శర్మకు అందించారు. అనంతరం ల‌యన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ..దర్శక నిర్మాత కిషన్‌ కన్నయ్య మా జిల్లావాసి. చాలా మంది దర్శకుల‌ వద్ద దర్శకత్వశాఖలో  పని చేశాడు. ఆ అనుభవంతో ‘ఇది ప్రేమేనా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs