ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం శతమానం భవతి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
సంక్రాంతి 2017 కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది, అని దిల్ రాజు తెలిపారు.
>నవంబర్ 7న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభం కానునున్న సునీల్,ఎన్.శంకర్ కొత్త చిత్రంసునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా `టు కంట్రీస్` చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం నవంబర్ 7 నుండి లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా...
దర్శక నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ - మలయాళంలో టు కంట్రీస్ సినిమా చూడగానే బాగా నచ్చింది. ఈ సినిమా బాగా సునీల్ యాప్ట్ అవుతుందనిపించి, మలయాళంలో 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైన్మెంట్, సినిమాలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. ఇది యూనివర్సల్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ కుదిరింది. శ్రీధర్ సీపాన మంచి సంభాషణలు కుదిర్చారు. మలయాళంలో టు కంట్రీస్ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు.చాలా గ్యాప్ తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నాకు, సునీల్‌కు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా నవంబర్ 7న లాంచనంగా ప్రారంభమై అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం అన్నారు.
>`ఒక్కడు మిగిలాడు` చిత్రంలో ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్కడు మిగిలాడు`. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ ఎల్.టి.టి.ఇ. నాయకుడు ప్రభాకరన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనపడబోతున్నాడు. అజయ్ అండ్ర్యూస్ నౌతాక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ మాట్లాడుతూ - ఒక్కడు మిగిలాడు చిత్రంలో వేలుపిళ్ళై ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. ఈ చిత్రం శ్రీలంకలోని 15 లక్షల మంది శరణార్థులు కోసం 1990లో జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. మంచు మనోజ్‌గారు చాలా బాగా కో ఆపరేట్ చేశారు. ప్రభాకరన్ గెటప్‌కోసం వెయిట్ కూడా పెరిగాడు. వైజాగ్ దగ్గరలోని పరవాడ ప్రాంతంలో యుద్ధ సన్నివేశాలను 25 రోజుల పాటు చిత్రీకరించాం. మనోజ్ ఇనెటన్స్‌తో కూడిన యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమా మనోజ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది`` అన్నారు.
>>మా 'ధర్మయోగి' చిత్రానికి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలునిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ధనుష్ ఫస్ట్ టైమ్ డబుల్ రోల్‌లో నటించిన 'ధర్మయోగి' దీపావళి కానుకగా శనివారం విడుదలైంది. చాలా మంచి రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కలెక్షన్ల పరంగా మేం చాలా హ్యాపీగా వున్నాం. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్ కూడా చాలా పాజిటివ్‌గా వుండడం, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. ధనుష్‌గారు చేసిన రెండు క్యారెక్టర్లు రెండు వేరియేషన్స్‌తో చాలా డిఫరెంట్‌గా వున్నాయి. మాస్ క్యారెక్టర్‌కి, క్లాస్ క్యారెక్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చూస్తున్నారు. రఘువరన్ బి.టెక్ తర్వాత ధనుష్‌గారికి తెలుగులో ఇది ది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో త్రిష చేసిన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంది. ఆ క్యారెక్టర్‌ని ఆమె అద్భుతంగా చేశారు. ఇంతకుముందు త్రిష చేసిన క్యారెక్టర్స్‌కి, ఈ క్యారెక్టర్‌కి చాలా వేరియేషన్ వుంది. అలాగే ఓ క్యూట్ క్యారెక్టర్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మల్లాపురం శివకుమార్ మాట్లాడుతూ - ఈ చిత్రాన్ని నైజాంలో నేను రిలీజ్ చెయ్యడం జరిగింది. తనకి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆఫర్స్ వున్నప్పటికీ మా ద్వారానే రిలీజ్ చెయ్యాలని సతీష్‌గారు అనుకున్నారు. నైజాంలో 92 థియేటర్లలో రిలీజ్ చేశాం. సినిమాకి మంచి రిపోర్ట్ రావడమే కాకుండా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా చాలా పాజిటివల్‌గా ముందుకు వెళ్తోంది. సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాకి మొదటి వారం థియేటర్స్ దొరకని పరిస్థితి వుంటుంది. కానీ, ఈ సినిమాకి మంచి థియేటర్స్ దొరికాయి. అంతే కాకుండా అన్ని థియేటర్స్‌లో రెండో వారానికి వెళ్తోంది. మరో 18 థియేటర్లు కన్‌ఫర్మ్ అయ్యాయి. ఇవి కాక మరో 15 థియేటర్లు పెరిగే అవకాశం వుంది. సినిమా బాగుందన్న రిపోర్ట్ వస్తేనే ఎగ్జిబిటర్స్ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సినిమా రిపోర్ట్‌పరంగా, కలెక్షన్స్‌పరంగా పాజిటివ్‌గా వుంది కాబట్టి రెండో వారానికి థియేటర్స్ పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది మూడు, నాలుగు వారాలు ఆడే సినిమా. సతీష్‌గారు ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమాని తీసుకున్నారో దానికి డబుల్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ధనుష్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ నేచురల్‌గా వుంటాయి కాబట్టి ఆడియన్స్ అతని సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ౖ'ధర్మయోగి' కూడా అలాంటి నేచురాలిటీ వున్న సినిమాయే. కాబట్టి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇలాగే కలెక్షన్స్ బాగా పెరిగి మా సతీష్‌గారికి లాభాలతోపాటు మంచి పేరు కూడా తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.
>లవ్, యాక్షన్ కలగలిసిన సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' - మంజిమ మోహన్నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ జంటగా మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మంజిమ మోహన్‌తో ఇంటర్వ్యూ...
'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
- నేను చైల్డ్ ఆర్టిస్ట్‌ను హీరోయిన్‌గా నేను నటించిన తొలి సినిమా 'ఒరు వడక్కన్ సెల్ఫీ' ఈ సినిమా ట్రైలర్ చూసిన గౌతమ్‌మీనన్‌గారికి నేను నచ్చడంతో ఆయన నన్ను ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. ఆడిషన్‌లో నేను సెలక్ట్ అయ్యాను. ముందు నన్ను తమిళ సినిమా కోసం ఆడిషన్ చేశారనుకున్నాను. అయితే గౌతమ్‌మీనన్‌గారు తెలుగు, తమిళంలో సినిమా చేస్తున్నామని చెప్పగానే నేను భాష పరంగా సమస్య ఉంటుంది కాబట్టి నేను చేయలేనని అన్నాను. ఏం పర్వాలేదు...నువ్వు చేయగలవ్ నన్ను నమ్ము అన్నారు. ఆయనపై నమ్మకంతో నేను సినిమా చేయడానికి అంగీకరించాను.
తెలుగులో నటించిన ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
- మంచి అనుభవం అనే చెప్పాలి. ముందు నాకు తెలుగు ఓ ఏలియన్ భాషగా తోచేది. కానీ 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేయడం వల్ల ఇప్పుడు కొంత అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను మలయాళీ, తమిళం మాట్లాడటం వచ్చు.
ఒకే సినిమాను వేర్వేరు హీరోలతో చేయడం ఎలా అనిపించింది?
- వేర్వేరు హీరోలతో ఒకే సినిమా చేయడం ఇబ్బందిగా అనిపించలేదు కానీ ఒకే సీన్‌ను వేర్వేరుగా చేయడం ఇబ్బందిగా ఫీలయ్యాను. ఇద్దరు హీరోలు బాగా సపోర్ట్ చేశారు. నాగచైతన్య నాకు షూటింగ్ ముందే రోజు తెలుగు నేర్పించేవారు. నేను తెలుగు డైలాగ్స్ నేర్చుకుని చేసేదాన్ని.
మీ ఫ్యామిలీని ఎలా ఒప్పించారు..?
- నాన్న మలయాళ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం కావడంతో నాన్నగారు నన్ను నటించమని అడిగారు. అలా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టాను. హీరోయిన్ కావాలనుకోగానే నాన్నకు చెప్పాను. అయితే ఆయన ముందు చదువు పూర్తి చేయమని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత నాన్న ఒప్పుకున్నారు. నాన్నకు ఇండస్ట్రీ అంటే అవగాహన ఉండటంతో పెద్దగా కష్టపడలేదనే అనాలి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎనిమిది సినిమాలు నటిస్తే, హీరోయిన్‌గా మలయాళంలో ఒక సినిమా చేశాను. తెలుగు, తమిళంలో ఒక సినిమా చేశాను.
నాగచైతన్యతో పనిచేయడం ఎలా అనిపించింది?
- నాగచైతన్య చాలా మంచి కోస్టార్. సెట్స్‌లో తనుంటే నన్ను కంఫర్ట్‌గా ఉంచేవాడు. వాతావరణాన్ని జోవియల్‌గా ఉంచేవాడు. డైలాగ్స్ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేశాడు. సీన్‌ను ఎలా చేయాలో డిస్కస్ చేసేవాడేవాడు. రొమాంటిక్ సీన్స్ చేయడంలో నేను వీక్ అనే చెప్పాలి. ఇబ్బంది పడేదాన్ని..ఆ సమయంలో చైతు టిప్స్ చెప్పాడు. నేను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. షూటింగ్ సమయంలో చైతు, శింబు, గౌతమ్ మీనన్‌గారు, డైరెక్షన్ టీం బాగా సపోర్ట్ చేసింది.
క్యారెక్టర్ గురించి చెప్పండి?
- సినిమాలో లీలా అనే సింపుల్ గర్ల్ పాత్రలో కనపడతాను. చైతన్య ఫ్రెండ్ చెల్లెలు పాత్రలో కనపడతాను. ఫస్టాఫ్ అంతా లవ్ ఫీల్‌తో ఉంటే, సెకండాఫ్ థ్రిల్లింగ్ యాక్షన్ మోడ్‌లో ఉంటుంది.
సినిమా విడుదల్లో ఆలస్యం అయ్యింది కదా..ఎలా అనిపించింది?
- నిజానికి సినిమా విడుదల ఆలస్యం అయినప్పుడు కాస్తా ఒత్తిడికి గురైయ్యాను. అయితే గౌతమ్‌మీనన్‌గారు మంచి సినిమా, అవుట్ పుట్ కావాలంటే సహనం ఉండాలని అనేవారు. రెండు భాషల్లో సినిమా తెరకెక్కేటప్పుడు కొన్ని సమస్యలుంటాయని వెయిట్ చేయాలని గౌతమ్‌గారు వివరించారు.
తెలుగు సినిమాలు చూస్తారా?
- లేదండి..పెద్దగా చూసేదాన్ని కాదు... అయితే చిరంజీవిగారు, నాగార్జునగారు, అల్లుఅర్జున్ గురించి తెలిసేది. ఎందుకంటే వీరి సినిమాలు మలయాళంలో డబ్ అయ్యేవి. తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాక ఏ మాయ చేశావే, మనం సినిమాలను చూశాను. అలాగే నేను శైలజ సినిమా కూడా చూశాను. నేను అందరితో స్నేహంగానే ఉంటాను. పర్టిక్యులర్‌గా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు.
హీరోయిన్ అయిన తర్వాత మీ నాన్నగారు ఏమన్నారు?
- సాహసం శ్వాసగా సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ సీన్ చూసి నేను ఏడ్చేశాను. ఆ సమయంలో నాన్నగారు నన్ను చూసి ఏడ్చేశారు. అప్పుడు నేను నా నటన పట్ల నాన్న సంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. అంతే తప్ప ఎప్పుడూ నాన్న ఇలా చేయాలి..అలా చేయాలని చెప్పలేదు.
dir="ltr">`గౌతమిపుత్ర శాతకర్ణి`లో కీలక పాత్ర చేస్తున్న కన్నడ సూపర్‌స్టార్ రాజ్ శివరాజ్‌కుమార్