యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో సి.హెచ్.సతీష్‌కుమార్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ధర్మయోగి. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు సర్టిఫికెట్ పొందింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్టోబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేస్తున్నారు.
నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు సర్టిఫికెట్ పొందింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేయలేకపోతున్నాం. అక్టోబర్ 29న దీపావళి కానుకగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 500 థియేటర్లలో మా ధర్మయోగి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.
>నవంబర్‌లో `ద్వారక`సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ద్వారక.ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ పెళ్లిచూపులుతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ కథానాయకుడుగా, పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ -శ్రీనివాస్ రవీంద్ర(ఎం.ఎస్.ఆర్) దర్శకత్వం వహించిన ద్వారక సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. పెళ్ళిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా తనకు మరో హిట్ మూవీ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. మా సినిమాకు ఆర్.బి.చౌదరి వంటి సీనియర్ నిర్మాతగారు అండగా నిలబడటం మాలో మరింత ఆత్మవిశ్వాస్వాన్ని నింపింది. మంచి ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీం కుదిరింది. ఇటీవల సాయికార్తీక్ అందించిన పాటలు మార్కట్లోకి విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. లక్ష్మీభూపాల్ మాటలు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
>మేము సైతం కు అశేష స్పందనమానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు మేము సైతం రూపంలో చేస్తున్న కృషి తెలిసిందే. వెండితెరపై తమ అందంతో, అభినయంతో తిరుగులేని కీర్తిని సంపాదించుకున్న తారలంతా వారి గ్లామర్ ప్రపంచాన్ని వీడి సామాన్యుల ప్రపంచంలో నిస్సహాయుల కోసం ఈ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రానా, అఖిల్,రకుల్ ప్రీత్ సింగ్,తాప్సీ, మోహన్ బాబు,విష్ణు, తనికెళ్ల భరణి, నాగచైతన్య, సమంత సుమ, రెజీనా,మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ లో అగ్ర స్థానంలో ఉన్న నటులందరీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమం చేయడం తెలుగులో ఇదే తొలిసారి. అందుకే ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని కార్యక్రమం, దీనికి తోడు సేవా కార్యక్రమం కావడంతో మేము సైతం సక్సెస్ అయ్యింది. అంతేకాక తమ అభిమాన నటులు సైతం వచ్చి కష్టాల్లో ఉన్న వాకి సాయపడమనడంతో, అందరూ మేము సైతం అంటున్నారు. కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి ఒక సమస్యను తీసుకురావడం, వచ్చిన గెస్ట్ ఆ సమస్య ను తీర్చడానికి, ఏదొక పని చేయడం చివరగా ఆ సంపాదించిన డబ్బు తో పాటుగా దానికి ఇంకొంత డబ్బు కలిపి ఆ సమస్యను తీర్చడం..ఇదీ మేము సైతం. అంతే కాదు ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే, డైరక్ట్ గానే కాదు, వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వేసి కూడా సాయపడొచ్చు అని మంచు లక్ష్మి చెప్తూనే ఉంది.
ఇటీవలే జరిగిన ఓ ఎపిసోడ్ లో సత్య, వీరబాబు అనే దంపతులు నడుపుతున్న శాంతివర్థన ఆశ్రమానికి, శ్రీమిత్ర గ్రూప్స్ 5లక్షలు విరాళమివ్వగా, మేము సైతం ప్రోగ్రామ్ తరపున 2లక్షలు అందించారు. అయితే, ఆ కార్యక్రమం తర్వాత రు.16లక్షల రూపాయలు శాంతి వర్థన ఆశ్రమానికి విరాళాల ద్వారా అందాయి. అంతేకాదు, గతంలో ఓ ఓల్డేజ్ హోమ్ కి కూడా ఇలానే బ్యాంక్ ద్వారా విరాళాలు దాదాపు రూ.20లక్షల వరకు అందాయి. ఈ కార్యక్రమానికి ఆశించిన దానికంటే ఒకింత ఎక్కువగానే ఆదరణ లభిస్తుండటం అందరూ సంతోష పడాల్సిన విషయమే. ఇలాంటి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకొచ్చినందుకు లక్ష్మి మంచు అటు సినీ పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇంకా ఎవరైనా తమ వంతు సాయం చేయాలనుకుంటే ఈ క్రింది ఖాతాలో జమ చేయవచ్చని లక్ష్మి మంచు తెలిపారు.
>'వైశాఖం' నా వందో సినిమా అవడం చాలా ఆనందంగా ఉంది - నటుడు కాశీవిశ్వనాధ్నువ్వులేక నేను లేను, తొలిచూపులోనే చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాధ్ నచ్చావులేతో ఆర్టిస్టుగా టర్న్ తీసుకుని వరుసగా సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయి అనతి కాలంలోనే వంద సినిమాలను పూర్తిచేశారు. హరీష్ హీరోగా, అవంతిక హీరోయిన్‌గా ఆర్‌జె సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత బి.ఎ. రాజు నిర్మిస్తున్న వైశాఖం చిత్రంలో కాశీవిశ్వనాధ్ హీరోయిన్ ఫాదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంతో వంద చిత్రాలను పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా అక్టోబర్ 27న హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో వై.కాశీ విశ్వనాధ్ ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.
దర్శక దేవుళ్లందరికీ నా కృతజ్ఞతలు!!
నటుడు వై.కాశీవిశ్వనాధ్ మాట్లాడుతూ - ఇంతవరకు నేను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. అయినా వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ప్రెస్‌మీట్ పెట్టలేదు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది వైశాఖం సినిమాతో నటుడుగా వంద సినిమాలను పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మ్యాగజైన్ పెట్టినపుడు అది సక్సెస్ అయి క్లిక్ అయితే పాఠక దేవుళ్లకి కృతజ్ఞతలు చెబుతాం. ఒక సినిమా వంద రోజులు ఆడి సూపర్‌హిట్ అయితే దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతారు. అదే ఒక నటుడు వంద సినిమాలు కంప్లీట్ చేస్తే దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. ఫస్ట్ సినిమా నచ్చావులే 50వ సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్, వందవ సినిమా వైశాఖం ఈ జర్నీలో నాకు సహకరించి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండు సినిమాలు డైరెక్ట్ చేసి మూడవ సినిమా ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవిబాబు ఇంట్లో నార్మల్ ఫాదర్‌గా ఉన్న నన్ను నచ్చావులే చిత్రంలో నేచురల్ ఫాదర్ క్యారెక్టర్ చేయించి నాకు గాడ్‌ఫాదర్ అయ్యారు రవిబాబు. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే రామోజీరావుగారికి, నచ్చావులే చిత్రంలో నన్ను ప్రొజెక్ట్ చేసి నాకు సహకరించిన టీం అందరికీ ధన్యవాదాలు. ఈ వంద సినిమాల్లో చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడాలేకుండా నాతో సినిమాలు తీసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, కెమెరామెన్స్ అందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కేవలం 6, 7 సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగాను. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు. స్టేజ్ ఎక్స్‌పీరియన్స్, బ్యాగ్రౌండ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా నటుడుగా వంద సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన నా సహ నటీనటులు, 24 క్రాఫ్ట్స్ ఎంతో మందికి రుణపడి ఉంటాను. డైరెక్టర్స్ నుండి యాక్టర్స్‌గా టర్న్ అయిన వారు వేళ్లమీద ఉన్నారు. వారంతా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. వాళ్లందరి సరసన నేను కూడా చేరగలిగాను. నన్ను బాగా ఎంకరేజ్ చేసిన దర్శకరత్న డా|| దాసరిగారు, రవిబాబు, శ్రీను వైట్ల, కొరటాల శివ, దశరధ్, శ్రీవాస్, వీరు పోట్ల, పరుచూరి మురళి, గోపీచంద్ మలినేని, జయంత్, బాబీ, ఎంఎస్ రాజు, తేజ, మారుతి, జయగారు, నందినిరెడ్డి, మధుర శ్రీధర్, త్రినాధరావు నక్కిన, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, చిన్నికృష్ణ, వీరభద్రం, కరుణాకరన్, ఇంకా ఎంతో మంది దర్శకులు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అంతేకాకుండా వారంతా నా ఉన్నత స్ధితికి కారణం అయ్యారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. ఫస్ట్ సినిమా నచ్చావులేతో బ్రేక్ వచ్చింది. అక్కడి నుండి 50వ సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్ వరకు నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దశరధ్, దిల్ రాజు ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ ఉంది చేయాలన్నారు. ఆ సినిమా చేశాను. అది హిట్ అయి మరో యాభై సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఒక మంచి పాత్ర వల్ల మరో పది పాత్రల్లో నటించే అవకాశం నటుడికి ఉంటుంది.
నటుడు సక్సెస్ కావాలంటే!!
నటుడు సక్సెస్ కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా రైటర్స్ మంచి కధలు, మాటలు రాయాలి. అలాగే ఆ పాత్రల్ని దర్శకులు అద్భుతంగా డిజైన్ చేయాలి. అప్పుడే నటుడికి ఎదుగుదల ఉంటుంది. మంచి స్క్రిప్ట్, క్యారెక్టర్, డైరెక్టర్ చేసే సినిమాల్లో అవకాశం వస్తే ఏ నటుడికైనా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎంత మంచి పాత్ర చేశామన్నది ముఖ్యం. నచ్చావులేలో రవిబాబు మంచి పాత్ర ఇస్తే రైడ్‌లో రమేష్‌వర్మ, బెల్లంకొండ సురేష్ గారు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో ధశరధ్, మిర్చిలో కొరటాల శివ చాలా మంచి పాత్రలు ఇచ్చారు. టైమ్ సెన్స్, డిసిప్లిన్‌తో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ అందరికీ ఫాదర్ క్యారెక్టర్‌లో నటించాను. ఇంతటి తృప్తికరమైన క్యారెక్టర్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు రూపాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు తోడుగా వుండి అనుక్షణం నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా భార్యకు ధన్యవాదాలు.
ఇది నాకు దేవుడిచ్చిన వరం!!
ఒక ఆర్టిస్ట్‌గా ఎదగాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. అది ప్లాన్ చేస్తే జరగదు. నేను డైరెక్టర్‌గా ఎంతో స్ట్రగుల్ అయి రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఇది గాడ్ గిఫ్ట్ అని భావిస్తున్నాను. నా సహ నటీనటులందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆ అదృష్టం లక్కీగా నాకు వచ్చింది. చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు నన్ను డైరెక్ట్ చేయమని చాలామంది అడిగారు. నటుడు కావడం పూర్వజన్మ సుకృతం అది అందరికీ రాదు. నటుడుగా కంటిన్యూ చేయి, డైరెక్షన్ అనేది ఎప్పుడైనా చేయవచ్చు అని బాలయ్యబాబు సజెషన్స్ ఇచ్చారు. అప్పటి నుండి నటనకే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫస్ట్ సినిమా నచ్చావులే, 50వ సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్ వందవ సినిమా చేసేటప్పుడు చిన్న యాంగ్జైటీ, ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. వైశాఖం నా వందవ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. చాలా కూల్‌గా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. డబ్బింగ్ ఫినిష్ అయింది. అవుట్‌పుట్ చూశాను. చాలా బాగా వచ్చింది. వైశాఖంలోనే ఆంజనేయుడు పుట్టిన రోజు, మహా శివరాత్రి పండుగలు వస్తుంటాయి. వాళ్లందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయి. ఎక్కడా వల్గారిటీ లేకుండా చాలా నీట్‌గా ఫీల్‌గుడ్ మూవీలా వైశాఖం ఉంటుంది. ఇలాంటి ఒక మంచి చిత్రంలో నా వందవ సినిమాగా నటించడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.
వైశాఖంలో నా గెటప్, మేనరిజమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి!!
నా ఫస్ట్ సినిమా నచ్చావులేలో రామోజీరావు గారు అవకాశం ఇస్తే 50వ సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో దిల్ రాజుగారు అవకాశం కల్పించారు. 100వ సినిమా వైశాఖంలో బి.ఎ.రాజుగారు ఛాన్స్ ఇచ్చారు. ముగ్గురూ రా, రా అని ఇండస్ట్రీలోకి ఆహ్వానించారు. చాలా ధ్రిల్‌గా ఫీలవుతున్నాను. 101వ సినిమా మళ్లీ రవిబాబు డైరెక్షన్‌లో అదిగో చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. సీరియల్స్‌లో చేయని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో ఇంకా చాలా పాత్రలు చేయాలి. ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. అందుకని చాలా స్మూత్‌గా సీరియల్స్ చేయనని తిరస్కరించాను. వారందరికీ నా ధాంక్స్. వైశాఖంలో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. హీరోతో ఎక్కువ సీన్స్ ఉంటాయి. నా గెటప్, మేనరిజమ్స్ అన్నీ చాలా కొత్తగా డిజైన్ చేశారు జయగారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఈ సినిమా ఉంటుంది. జయగారు డేరింగ్ డైరెక్టర్. వైశాఖం సినిమా కోసం ఒక కొత్త ఎక్విప్‌మెంట్ కెమెరాని తెప్పించి దానితో సినిమా కంప్లీట్ చేశారు. షూటింగ్ జరిగేటప్పుడే ఫ్లో ఎలా వస్తోంది అని చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. లైటింగ్, కలరింగ్ బ్యూటిఫుల్‌గా వచ్చింది. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది.
పరిపూర్ణ నటుడుగా పేరుతెచ్చుకోవాలని ఉంది!!
నా దగ్గరకు వచ్చిన అవకాశాల్ని అన్నీ చేశాను. ఇప్పటివరకు ఎవర్నీ క్యారెక్టర్ ఇవ్వమని అడగలేదు. నా మీద నమ్మకంతో గౌరవంతో నాకు మంచి అవకాశాలు రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇంకా నేను చేయాల్సిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అందరికీ ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయి చేయాలనేది నా కోరిక. కొత్త కొత్త క్యారెక్టర్స్ చేసి పరిపూర్ణ నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఉంది. త్వరలో మరో 100 సినిమాలు కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. డైరెక్షన్ చేయాలని ఉంది. నా మనసుకి నచ్చిన స్క్రిప్ట్, పబ్లిసిటీ, ప్రమోషన్ చేయగలిగే మంచి ప్రొడ్యూసర్ ఉంటే తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. ఒక డైరెక్టర్‌కి ఏం కావాలో క్లియర్‌గా నెరేట్ చేయగలిగితే దానిని యాక్టర్ ఫాలో అయి ఆ క్యారెక్టర్‌ని ఫీలయి చేయాలి. ఆడియన్స్ కూడా నా పర్ఫామెన్స్, నా బాడీలాంగ్వేజ్ నచ్చి నటుడుగా యాక్సెప్ట్ చేశారు. కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలేలో బాగా చేశావని అప్రీషియేట్ చేశారు. అది ఎప్పటికీ మరిచిపోలేను.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చు!!
కృష్ణ, శ్రీదేవి జంటగా మిద్దే రామారావుగారి డైరెక్షన్‌లో వచ్చిన పచ్చని కాపురం చిత్రానికి అసోసియేట్‌గా వర్క్ చేశాను. అప్పుడే బి.ఎ. రాజుగారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన కృష్ణగారికి రైట్ హ్యాండ్‌లా ఉండేవారు. అప్పటి నుంచి బి.ఎ. రాజుగారు, నేను చాలా క్లోజ్ అయ్యాం. జర్నలిస్టుగా వెయ్యి సినిమాల పిఆర్‌ఓగా ఎంతో ఎత్తుకి ఎదిగారు రాజుగారు. నిర్మాతగా ఆయన చేతుల మీదుగా చెక్ తీసుకునే స్ధాయికి నేను ఎదిగాను. ఇవన్నీ చూస్తుంటే చాలా ధ్రిల్లింగ్‌గా ఉ