మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
అక్టోబర్ 21న కాజల్ చేతుల మీదుగా 'ఒక్కడొచ్చాడు' టీజర్
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 21 సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్‌లోనే 'ఒక్కడొచ్చాడు' డిఫరెంట్ మూవీ అవుతుంది. యాక్షన్ వుంటూనే మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్ అవుతాయి. హిప్‌హాప్ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నవంబర్ మొదటి వారంలో ఆడియోను రిలీజ్ చేసి, నవంబర్‌లోనే సినిమా కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది అన్నారు.
>అక్టోబర్ 27న `ఎంత వరకు ఈ ప్రేమ`ఆడియో`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. `యామిరుక్క బయమేన్` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని అక్టోబర్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా....
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ఎంతవరకు ఈ ప్రేమ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో అల్రెండి తమిళంలో విడుదలైన మంచి సక్సెస్‌ను సాధించాయి. తెలుగు ఆడియో విడుదల కార్యక్రమాన్ని అక్టోబర్ 27న నిర్వహిస్తున్నాం.తెలుగు, తమిళంలో సినిమా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
>పాటల రికార్డింగ్ లో సంచలనాల `మెట్రో`
సంచలనాల `మెట్రో` తెలుగులో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్ని అందించిన ఎస్.కె.పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి సమర్పకుడిగా, `చుట్టాలబ్బాయి` ఫేం రామ్ తాళ్లూరి సతీమణి రజని తాళ్లూరి ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రమిది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. జోహన్ సంగీతం అందించారు. సాహితి పాటలు, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా రికార్డింగ్ కార్యక్రమాలు సంగీతదర్శకుడు- సింగర్ రఘురామ్ సారథ్యంలో హైదరాబాద్ `లిరిక్స్ అండ్ ట్యూన్స్` స్టూడియోస్‌లో ఈ మంగళవారం ప్రారంభమయ్యాయి. మదర్ సెంటిమెంట్ సాంగ్‌ని శ్రీ సౌమ్య, శ్రీకృష్ణ, రఘురామ్ సంయుక్తంగా ఆలపించారు. ఈ భూమి ఎవరికీ సొంతం కాదురా.. అంటూ సాగే పాటను ధనుంజయ్, శ్రీకృష్ణ పాడారు. నేనా .. అంటూ సాగే సుమధురమైన పాటను గీతామాధురి ఆలపించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రజని తాళ్లూరి మాట్లాడుతూ -ఇదో ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కించిన సినిమా. యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథాంశంతో తెరకెక్కింది. నిత్యం మనం వార్తల్లో వినే చైన్ స్నాచింగ్ నేపథ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఓ విజువల్ ట్రీట్‌గా తెరకెక్కించారు. ఈ మంగళవారం హైదరాబాద్ లిరిక్స్ అండ్ ట్యూన్స్ స్టూడియోస్‌లో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభించాం. టాప్ సింగర్స్ గీతామాధురి, శ్రీసౌమ్య, శ్రీకృష్ణ, రఘురామ్, ధనుంజయ్ ఈ చిత్రానికి పాడారు. చక్కని సంగీతం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది అన్నారు.
ఎస్.కె.పిక్చర్స్ అధినేత, చిత్ర సమర్పకులు సురేష్ కొండేటి మాట్లాడుతూ -నిత్యం వార్తా చానెళ్లలో చైన్ స్నాచర్ల హల్‌చల్ గురించి వింటూనే ఉన్నాం. రోడ్ పై వెళుతున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లిన స్నాచర్..., బైక్‌పై రైడ్ చేస్తూ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్ .., నగరాల్లో విరుచుకుపడుతున్న స్నాచర్స్.. లాంటి వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. నిజ జీవితాల్లో ఈ చైన్ స్నాచింగ్ ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించే ఆసక్తికర చిత్రం -మెట్రో. తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్... ఆ క్రమంలో తను తెలుసుకున్న నిజాలేంటి..? అసలు చైన్ స్నాచర్ల లక్ష్యమేంటి..? అన్నది తెరపైనే చూడాలి. పాటల రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాహితి చక్కని లిరిక్స్ అందించారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి నవంబర్ లో సినిమా రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
>పోలీసు అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా > `పోలీస్...పోలీస్` ఆడియో ఆల్బమ్ విడుదల! >పోలీసు అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వర్ధమాన సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర `పోలీస్..పోలీస్` అనే ఆడియో ఆల్బమ్ రూపొందించారు. ఈ ఆడియో ఆల్బమ్ కు దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఆల్బమ్ ను సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ..నేను గత 20 ఏళ్లుగా పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నా. పోలీసుల కష్ట-సుఖాలు ఏంటో నాకు బాగా తెలుసు. భార్యా పిల్లలను వదిలి ఎన్నో నెలలు అడవుల్లో ఉండాల్సి వచ్చేది. ఇలా నా వ్యక్తిగత జీవితానుభవాలతో రెండు పాటలు రాసి నేనే ఆలపించాను. అలాగే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల పై మిగతా మూడు పాటలుంటాయి. పాటలన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే విధంగా ఉంటూ పోలీసులపై ఎంతో గౌరవ మర్యాదలు పెంచే విధంగా ఉన్నాయంటూ విన్నవారందరూ ప్రశంసిస్తున్నారు. నేను పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉంటూ సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు 12 సినిమాలకు సంగీతాన్ని అందించాను. రెండు సినిమాలకు దర్శకత్వం చేశాను. ప్రస్తుతం అనువంశికత అనే సినిమా డైరక్ట్ చేస్తున్నా. రేపు జరగబోయే పోలీసు అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా రూపొందించిన ఈ ఆల్బమ్ ను పోలీసు అమర వీరులకు అంకితమిస్తున్నా. ఈ ఆల్బమ్ ను నిర్మించిన లయన్ సాయి వెంకట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.
దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ...ఎంతో మంచి సంకల్పంతో రమేష్ రూపొందించిన ఈ ఆల్బమ్ కు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. ఈ బుధవారం నాడు సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ర్ట హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి గారి చేతుల మీదుగా పోలీస్ ..పోలీస్ ఆడియో ఆల్బమ్ విడుదల చేశాం. వారు పాటలన్నీ విని ఎంతో స్ఫూర్తిదాయకంగా పాటలున్నాయంటూ అభినందించారు. రమేష్ ముక్కెర ఐదు పాటలు కూడా అద్భుతంగా చేశారు. ఇంత మంచి పాటలు ప్రతి పోలీసు స్టేషన్ లో ఉండాలంటూ వేణుమాధవ్ గారు రెండు రాష్ట్రాలకు ఐదు వేల సీడీలు పంపిణీ చేస్తున్నారు. అందరూ విని మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానుఅన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...పోలీసు అమర వీరులకు అంకితమిస్తూ ఈ ఆడియో ఆల్బమ్ ను రూపొందించిన సాయి వెంకట్ ను, రమేష్ ముక్కెరను అభినందిస్తున్నాను అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ...ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడంలో సాయి వెంకట్ ఎప్పుడూ ముందుంటారు. రమేష్ ముక్కెర ఎంతో స్ఫూర్తిదాయకంగా పాటలు చేశారు. ఈ ఆల్బమ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనన్య, నిర్మాత అనుపమ రెడ్డి, బిజేపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.