Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (18-10-16)..!


>`నరుడా..! డోన‌రుడా..!` సెన్సార్ పూర్తి

Advertisement
CJ Advs

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - నరుడా డోన‌రుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు వ‌చ్చిన  రెస్పాన్సే సినిమాపై ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేస్తుంది. సుమంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు, ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించాల‌నుకుంటున్నాం. అలాగే ఈ సినిమాను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

>న‌వంబ‌ర్ 4 న విడుద‌ల కానున్న 'ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'

                                                                          -- ఇది య‌ధార్ద క‌థ కాదు

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన 'భాహుబ‌లి' చిత్రంతో కాళ‌కేయ గా  సినిమా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందిన ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'..  ఈచిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడ‌దల కానుంది. 

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు చైత‌న్య‌ మాట్లాడుతూ..  ఈచిత్రానికి ఎన్నోర‌కాల టైటిల్స్ అనుకున్నాము. కాని ఈటైటిల్ క‌థ‌కి యాప్ట్ అని ఫీల్ అయ్యి యూనిట్ అంద‌రం పెట్టాము. చిత్రం చూసిని త‌రువాత అంద‌రూ చాలా ఢిఫ‌రెంట్ గా వుంద‌ని మాత్రం అంటారు. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ పార్మెట్ లో కామెడి ఈ చిత్రంలో చూడోచ్చు.. స‌హ‌జంగా తెలుగు చిత్రాల్లో హీరో నో , హీరోయిన్ నో ప్రేమ వైఫ‌ల్యం చెంద‌టం తో క‌థ మెద‌లవుతాయి.. కాని ఓ విల‌న్ ప్రేమ వైఫ‌ల్యాల నుండి క‌థ ప్రారంభం చేసిన మెట్ట‌మెద‌టి చిత్రం మా 'ఆవు పులి ప్ర‌భాస్ పెళ్ళి'.. అందుకే దీనికి క్యాప్ష‌న్ ని కూడా 'ఇది యధార్థ క‌థ కాదు' అని పెట్టాం. అయితే ఈ చిత్రంలో నెల్లూరు లోని రియ‌ల్ రౌడిలు న‌టించారు. కొత్త త‌రం ప్రేమ‌క‌థ‌ని కొత్త త‌రం కామెడితో తెల‌గులో ఇప్ప‌టివ‌ర‌కూ రాని విధంగా చాలా లిమిటెడ్ బ‌డ్జెట్ లో నిర్మించాం. ఈ చిత్రం యోక్క టీజ‌ర్ కి ఆడియో కి మంచి రెస్పాన్స్ రావ‌టంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి లోని పెద్ద‌ల స‌పోర్టుతో ట్రేడ్ బిజినెస్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుంది. న‌వంబ‌ర్ 4న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.

>పూనమ్‌ పాండే మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి 

వి.బి.ఆర్‌. క్రియేషన్స్‌, సూరజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌భాస్కర్‌ రెడ్డి నిర్మాతలుగా, భవాని మస్తాన్‌ దర్శకత్వంలో సెన్సేషనల్‌ భామ పూనమ్‌ పాండే ప్రధాన పాత్రలో, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుని రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. 

ఈ సందర్భంగా..నిర్మాతలు మాట్లాడుతూ..భవాని మస్తాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్‌ తార పూనమ్‌ పాండే ప్రత్యేక ఆకర్షణ కానుంది. అలాగే ఒక ప్రత్యేక పాత్రలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో సంపూర్ణేష్‌ బాబు నటించనున్నారు. పూనమ్‌ పాండే, ఆశిష్‌ విద్యార్ధి మొదలగువారు ఫస్ట్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ మంత్‌ ఎండింగ్‌ నుండి ముంబాయ్‌లో రెండో షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నాము. మా ఈ తొలి ప్రయత్నం సక్సెస్‌ అవుతుందని, ఈ మూవీ మంచి హిట్‌ అయ్యి..మా బ్యానర్‌లకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము..అని అన్నారు. 

పూనమ్‌పాండే, ఆశిష్‌ విద్యార్ధి, తాగుబోతు రమేష్‌, జబర్ధస్త్‌ నటులు మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనెం వెంకటరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: రామకృష్ణ రాజు, నిర్మాతలు: ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌ భాస్కర్‌ రెడ్డి పామూరు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భవాని మస్తాన్‌.

>గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు  పుస్తకావిష్కరణ

ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు  అనే పుస్తకాన్ని దర్శకరత్న డా.. దాసరి నారాయణరావు ఈ రోజు ఆయన  స్వగ్రుహంలో ఆవిష్కరించారు. రాజమండ్రీ లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.ఎస్. జగదీష్ రచించింన ఈ పుస్తకాన్ని దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఆవిష్కరించి..తొలిప్రతిని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావుకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మరో దర్శకనటుడు కాశీ విశ్వనాధ్, దర్శకుడు రాజవన్నెం రెడ్డి, నటుడు సారిక రామచంద్రరావు, రచయిత బిఎస్ జగదీష్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతు.. జగదీష్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల పై ఇలాంటి పరిశోధనాత్మ రచనలు చెయ్యడం అభినందనీయం.ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇంత మంది దిగ్గజాలాంటి సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమలో ఉన్నారన్న నిజం ఈ పుస్తకం చూసాకే తెలిసింది. ఇలాంటి విశేష క్రుషి చేసిన జగదీష్ గారికి ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల తరుపున నా క్రుతజ్నతలు..వ్యక్తిగతంగా నా  అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

 పుస్తక రచయిత జగదీష్ మాట్లాడుతు నా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందిస్తు పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి, తొలి ప్రతిని స్వీకరించిన రేలంగి నరసింహారావు గారికి ఇతర సినీ ప్రముఖులకు నా క్రుతజ్నతలు అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs