Advertisement
Google Ads BL

`వైశాఖం` ప్రెస్‌మీట్‌


చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్‌ చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో సూపర్‌హిట్ అధినేత బి.ఎ.రాజు, ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక ఎపిసోడ్ మినహా చిత్రీక‌ర‌ణ‌నంతా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

Advertisement
CJ Advs

చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సినిమాలో ప్రతి రోజును ఎంజాయ్‌ చేస్తూ సినిమ షూటింగ్‌ చేశాం. ఒక ఎపిసోడ్‌ మినహా సినిమా మొత్తం పూర్తయ్యింది. దీపావళి నాటికి సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యింది. మా సూపర్‌హిట్‌ బ్యానర్‌లో ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేశాను. ఈ సినిమా ఏడో సినిమా. ఈ సినిమాకు ముందు చేసిన సినిమాలకు ఓ చిన్నపాటి టెన్షన్‌ ఉండేది. కానీ ఈ సినిమాకు ఎటువంటి టెన్షన్‌ లేదు. అన్నీ ఎలిమెంట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉన్న చిత్రమిది. సాయికుమార్‌గారు చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఆయనెంతో బిజీగా ఉన్నా జయపై, నాపై ఉన్న అభిమానంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు సాయికుమార్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌. డైరెక్టర్‌ జయ ఏంటనేది ఈ సినిమాకు తెలుస్తుంది. జయ మెంటాలిటీకి దగ్గరగా ఉన్న చిత్రమిది. మా టీం అందరూ గర్వపడే చిత్రమిది అన్నారు. 

డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ మాట్లాడుతూ - నాకు లేడీ డైరెక్టర్‌ దగ్గర పనిచేయాలనే కోరిక ఉండేది అందువల్ల జయగారిని లవ్‌ లీ సినిమా కంటే ముందు, లవ్‌లీ సినిమాకు కలిసి అవకాశం అడిగాను. అప్పటికే పాటలు పూర్తి అయిపోవడగంతో అవకాశం లేకుండా పోయింది. ముందు రెండు సినిమాలకే డ్యాన్స్‌ కంపోజ్‌ చేయాలని పిలిచారు కానీ చివరకు అన్నీ పాటలకు నేనే డ్యాన్స్‌ కంపోజ్‌ చేసే అవకాశం కలిగింది. జయగారు షూటింగ్‌ సమయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా కాన్ఫిడెంట్‌, కమాండింగ్‌గా ఆమెకు ఎలా కావాలో ఆ అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. సాంగ్స్‌ చాలా బాగా వచ్చింది. హీరో హరీష్‌ మాస్‌ హీరోనే కాదు, క్లాస్‌ హీరో కూడా అవుతాడు. సుబ్బారావుగారి సినిమాటోగ్రఫీ, వసంత్‌గారి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌ అవుతుంది అన్నారు. 

సాయికుమార్‌ మాట్లాడుతూ - నాకు బంధాలు, అనుబంధాలు, అప్యాయతలు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కథ చెప్పగానే సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను. ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్స్‌ ఉన్నాయి. అందులో నేను చెప్పే డైలాగ్‌లోనే సినిమా కథ అంతా ఉంటుంది. నేను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో ఖాకీ డ్రెస్‌ వేసుకన్నాను, కానీ ఈ సినిమాలో ఫైర్‌ మేన్‌ క్యారెక్టర్‌లో ఖాకీ డ్రెస్‌ వేసుకున్నాను. జయగారు, రాజుగారు కామ్‌గా, కూల్‌గా, లవ్‌లీగా అందరి వద్ద నుండి ఏ వర్క్‌ కావాలో దాన్ని రాబట్టుకున్నారు. వైశాఖం సినిమా మంచి అవుతుంది. ఈ టీంను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

డైరెక్టర్‌ బి.జయ మాట్లాడుతూ - మా వైశాఖం సినిమా చాలా బాగా వచ్చింది. ఒక ఎపిసోడ్‌ మినహా సినిమా అంతా పూర్తయ్యింది. అందరూ ఒక టీంగా ఏర్పడి చేసిన మంచి ప్రయత్నమిది. వాలిశెట్టి సుబ్బారావుగారు బాడీ గింబల్‌ టెక్నాలజీతో సినిమాటోగ్రఫీ అందించారు. శంకర్‌ ఇప్పుడు ఇదే టెక్నాలజీని రోబో సీక్వెల్‌లో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. వసంత్‌గారు అన్నీ ఎమోషన్స్‌ ఉన్న పాటలను అందించారు. పాటుల చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకు నాతో పాటు రాపూరి కృష్ణ మంచి మాటలు అందించారు. మేం గత చిత్రాల్లో పరిచయం చేసిన పైడిశెట్టి రాం, కాసర్ల శ్యామ్‌, మురళి సహా చాలా మందిని పరిచయం చేశాం. ఈ సినిమా ద్వారా హారీష్‌ను హీరగా పరిచయం చేస్తున్నాం. హరీష్‌, అవంతిక చక్కగా యాక్ట్‌ చేశారు. వసంత్‌గారు సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా బాగా వచ్చింది. సినిమాను మా టీంకు చూపించాం. అందరూ టెక్నిషియన్స్‌లా కాకుండా ప్రేక్షకుల్లా ఎంజాయ్‌ చేశారు. రేపు ఆడియెన్స్‌ను కూడా సినిమా ఇలానే అలరిస్తుంది అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి.జె.వసంత్‌ మాట్లాడుతూ - పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా కూడా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది అన్నారు. 

సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ - టాలెంట్‌ ఉన్న వారికి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశాన్ని కలిగించిన జయగారికి, రాజుగారికి థాంక్స్‌. కథలో కంటెంట్‌ ఉంటే అన్నీ రకలా టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ దానికి తగిన విధంగా కుదురుతాయి. లేడీ డైనమిక్‌ డైరెక్టర్‌ జయగారు సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. సినిమా చాలా బాగా వచ్చింది. పెద్ద హిట్‌ సాధిస్తుంది అన్నారు. 

ఈ కార్యక్ర‌మంలో కాశీవిశ్వ‌నాథ్‌, శేషు, లైన్ ప్రొడ్యూస‌ర్ బి.శివ‌కుమార్‌, క్రాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, లతీష్‌, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs