దక్షిణాసియా కంటెంట్ ను కలిగిన ప్రపంచపు అతి పెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదిక అయినటువంటి యప్ టీవీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఓ టీటీ (ఓవర్ ది టాప్) స్పేస్ లో ప్రపంచ దిగ్గజమైన యప్ టీవీ 12కు పైగా ప్రాంతీయ భాషల్లో దక్షిణాసియా కంటెంట్ ను అందిస్తుంది. ఈ తాజా ప్రకటనతో యప్ టీవీ ఆయ ప్రాంతాల్లో తన ఆదరణ ఏ స్ధాయిలో పెరుగుతుందో నిరూపించేందుకు మొదటి అడుగు.
మహేష్ బాబు సినిమా రంగంలో చాలా ప్రముఖమైన సెలబ్రెటీ. గతంలో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో ఆయన బాలీవుడ్ సెలబ్రిటీల సరసన నిలిచారు. మనసు దోచుకునే ఆయన అందం మరియు వ్యక్తిత్వం ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి దక్షిణాసియా వీడియోలను ప్రపంచానికి అందిస్తోన్న యప్ టీవీతో మరింత ఇనుమడిస్తాయి.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...దక్షిణాసియా కంటెంట్ ను అందించేటువంటి యప్ టీవీ ఓ టీటీ స్పేస్ లో మార్గదర్శిగా నిలిచింది. ఎప్పుడైనా దక్షిణాసియా కంటెంట్ వీడియోలను ప్రపంచం నలుమూలల నుంచి చూడాలనుకునే వారికి యప్ టీవీ వాటిని చేరువ చేసింది. వాటిని చూస్తూ వీక్షకులు తమ ఇళ్లు లేదా ప్రాంతంలో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. ఎంటర్ టైన్ మెంట్ లో నా మొదటి ఛాయిస్ యప్ టీవీ. నాక తెలిసి వినోదం యొక్క భవిష్యత్తు ఆన్ లైన్ వీడియో స్ర్టీమింగ్ రంగంలోనే ఉంటుంది. అలాంటి రంగంలో ఎంతో ముందున్నటు వంటి యప్ టీవీతో అనుబంధం కుదుర్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆరు సంవత్సరాల క్రితం దూకుడు సినిమా షూటింగ్ టైమ్ లో విదేశాల్లో ఉన్నప్పుడు ఓ నిర్మాత తన ఫోన్ లో న్యూస్ ఛానల్ చూస్తున్నాడు. ఫోన్ లో న్యూస్ ఛానల్ ఎలా చూడగలుగుతున్నారు అని నేను అడిగితే యప్ టీవీ ద్వారా అని చెప్పాడు. అప్పుడు అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను అద్భుతం అనిపించిన యప్ టీవీతో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది అన్నారు.
యప్ టీవీ సీఈఓ, వ్యవస్ధాపకులు ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దక్షిణాసిమా వీడియో కంటెంట్ ను కోరుకునే వీక్షకులకు నచ్చిన వీడియోలన్నింటినీ అందిస్తూ ఓ టీటీ స్పేస్ లో అగ్రగామిగా నిలిచిన యప్ టీవీ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఘణనీయమైన అభివృద్దిని నమోదు చేస్తుంది. మా యి ప్రయాణంలో మా బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ తో పాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనుబంధం కుదుర్చుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింత మందికి మా బ్రాండ్ ను విస్తరింపచేసేందుకు ఈ బంధం ఉపయోగపడుతుంది అన్నారు.
>తెలుగు సినిమాలకే ప్రాధాన్యత: ‘మా౦జ’ హీరో దీప్ పాథక్.
నేను నటి౦చిన మొదటి చిత్రం ‘మా౦జ’ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మొదటగా కృతఙ్ఞతలు తెలుపుకు౦టున్నాను. తెలుగు చిత్ర ప్రరిశ్రమ అ౦టే నాకె౦తో ఇష్టం. ఇకము౦దు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాను అన్నారు. ‘మా౦జ’ చిత్ర కధానాయకుడు దీప్ పాఠక్. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ భీమవరం టాకీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఇటీవల విడుదల చేసారు. విడుదలయిన కే౦ద్రాల్లో మ౦చి టాక్ తో నడుస్తు౦ది. ఈ స౦దర్బ౦గా సోమవారం నాడు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హీరో దీప్ పాథక్ మాట్లాడారు.
ఇది కన్నడ౦లో నిర్మి౦చారు. అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న౦దుకు చాలా స౦తోష౦గా ఉ౦ది. ఇది సస్పెన్స్ ధ్రిల్లర్ ఎమోషనల్ మూవీ. రప్ అ౦డ్ టప్ గా తిరిగే కుర్రాళ్ళుకధ. నేను అ౦టే నాపాత్ర పేరు బిజ, కృష్ణ, కిషన్, అవికాగోరే మేమ౦తా స్నేహితుల౦. అనుకోని పరిస్టితులల్లో తమ పగను నెరవేర్చుకునే ప్రయత్నంలో మేము పోలీసులకు చిక్కటం బాల నేరస్తులుగా గుర్తి౦చి మాకు శిక్ష పడటం జరుగుతు౦ది. అలా అని మేము క్రిమినల్స్ కాదు, అవసరమై ఓ బిగ్ అటెంప్ట్ చేసి దొరికిపోతా౦. మాకు శిక్షలో భాగంగా ప్రవర్తనలో మార్పు తెచ్చే౦దుకు ఎడ్యుకేషన్ అ౦దిస్తారు ప్రభుత్వం వారు. ఇక దర్శకుడు గురి౦చి చెప్పాల్సి వస్తే ఆయన ఓ జీనియస్, క్రికెట్ ఆడుకునే వయసులోనే మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహి౦చారు. ఇ౦దులో ఓ ప్రధాన పాత్ర పొషి౦చారు. నేను కారు మెకానిక్ గా నటి౦చాను.
నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. ము౦బాయిలో ఈ చిత్రం ఆడిషన్స్ జరుగు౦టే వెళ్లాను. అక్కడ కాస్టి౦గ్ డైరెక్టర్ నన్నుసెలెక్ట్ చేసారు. నటుడ్ని కావాలనుకున్నప్పుడే పాటలు పాడటం నేర్చుకున్నాను. స౦గీత౦లో ప్రవేశం సాధి౦చాను. ప్రేక్షకులు ఆదరి౦చట౦తోపాటు సినీర౦గ౦లో ప్రముఖులు అయిన దర్శకరత్న దాసరి నారాయణ రావు, రాజ్ క౦దుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారయణగారి లా౦టి వారి అభిన౦దనలతో పాటు, అశీర్వదించడం మా జీవిత౦లో మర్చిపోలేని మధురానుభూతులు గా భావిస్తున్నాము. తెలుగు సినిమా పరిశ్రమలోని వారు ఎ౦తో లవ్లీ గా ఉ౦టారు, ఇకము౦దు చేయబోయే చిత్రాలలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాను అన్నారు ‘మా౦జ` హీరో దీప్ పాథక్.
>'కాపాలి' ట్రైలర్ లాంచ్
రోహిణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్ మేసా రాజేశ్ ప్రధానపాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన సరికొత్త థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా 'కాపాలి'. మిమ్మల్ని మీరే కాపాడుకోండి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పెళ్ళి చూపులు సినిమాతో మంచి పేరు సంపాదించిన నిర్మాత రాజ్ కందుకూరి కాపాలి సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ ను లాంచ్ చేసారు.
దర్శకుడు మేసా రాజేశ్ మాట్లాడుతూ సినిమా చేయాలని ఎప్పటినుండో ఇంట్రెస్ట్ ఉండేది. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలను చూసి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది . అందులో స్పెషల్ గా ఉండే మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో మీడియా బేస్డ్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచననుండి వచ్చిందే కాపాలి. ఫౌండ్ పుటేజ్ ఆధారంగా ఓ జర్నలిస్ట్ ఎలా తనకు అప్పగించిన టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నదే మూవీ. నాలుగు కథలు ఒకేసారి జరుగుతుంటాయి అంతేగాక మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లకు భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటివరకు జర్నలిజం ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమాలకు ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. జర్నలిస్ట్ నిజ జీవితంలో ప్రాణాలకు తెగించి ఎలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. అందుకే ఈ సినిమా జర్నలిస్ట్ మిత్రులకు అంకిత అన్నారు.
పెళ్ళిచూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ నాకు హార్రర్ ఎక్స్ పీరియన్స్ లేదు కానీ రాజేశ్ గారు ఈ సినిమాతో చూపిస్తారని నమ్ముతున్నాను. నా దగ్గర కథ ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం సినిమా తీయడం చాలా గొప్ప విషయం. కంటెంట్ లో నిజంగా దమ్ముంటే 7 లక్షలతో తీసిన పారనామల్ సినిమా ఎలా అయితే 1300కోట్లు వసూలు చేసిందో అలా మంచి సినిమాలకు భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్నారు.