Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (30-9-16)..!


>1. ధనుష్‌ ద్విపాత్రాభినయంతో వస్తోన్న 'ధర్మయోగి'(ది లీడర్‌) 

Advertisement
CJ Advs

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా 'రైల్‌' చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చెయ్యబోతున్నాం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ రెండో వారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను..అన్నారు. 

ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌. 

>2. 'అభినేత్రి' సెన్సార్‌ పూర్తి - వరల్డ్‌ వైడ్‌గా అక్టోబర్‌ 7 విడుదల 

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌లో నిర్మిస్తున్నారు. హిందీలో సోనూ సూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి విశేష స్పందన లభిస్తోంది. జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని అందించారు. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది.. అన్నారు. 

>3. నాగభరణం గీతావిష్కరణ

సాధారణంగా దర్శకులు ఒకే జోనర్‌కు పరిమితమవుతారు. కానీ ప్రతి జోనర్ నుండి అరడజనుకుపైగా హిట్స్ ఇచ్చిన ఏకైక తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ. అలాంటి దర్శకులు దేశంలో లేరు. కుటుంబ కథాంశాలతో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దేశభక్తి నేపథ్యంలో అంకుశం, భారత్‌బంద్, భక్తి ప్రధాన  కథాంశంతో అమ్మోరు, అరుంధతి...ఇలా ప్రతి జోనర్ నుండి  హిట్స్ ఇచ్చిన సమర్థత, ప్రతిభ కోడిరామకృష్ణ సొంతం అని అన్నారు ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన తాజా చిత్రం నాగభరణం. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో  నటించారు. సాజిద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను విడుదలచేస్తున్నారు. గురుకిరణ్ స్వరాలను సమకూర్చిన ఈ  చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. బిగ్‌సీడీని తెలంగాణ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ విడుదలచేశారు. ఆడియో సీడీలను దర్శకుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని సాయికుమార్ స్వీకరించడంతో పాటు ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. 

ఈ సందర్భంగా కోడిరామకృష్ణ మాట్లాడుతూ సినిమా తీయడానికి సృజనాత్మకత ఒక్కటే  సరిపోదు. మంచి కథ, తపన కలిగిన నిర్మాత అవసరం. పాము నేపథ్యంలో ఓ కథ వినిపించడానికి నిర్మాత జయంతిలాల్ గడ ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో అక్కడ ఉన్న సాజిద్ ఖురేషి ఎంత కష్టపడైనా ఈ సినిమాను తానే నిర్మిస్తానని అన్నారు. నిర్మాతగా తన సినిమా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలన్నారు. తపన, ఓపిక,  ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఈ సినిమా చేశారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తో  ఓ సినిమా చేయాలని కోరిక  ఉండేది. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యముంది. గతంలో ఆయనకు ఓ కథ వినిపించాను. కథ నచ్చడంతో సినిమా చేస్తానని మాటిచ్చారు. బ్యాంకాక్ వెళ్లి కథను డెవలప్ చేసుకునే వచ్చేసరికి విష్ణువర్ధన్ మరణించారు. ఈ సినిమాలో పతాకఘట్టాల్లో విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్ రూపంలో చూపించాలనే ఆలోచన నిర్మాత సాజిద్ ఖురేషిది. విష్ణువర్ధన్‌ను తెరపై చూసి ఆయన భార్య భారతి కన్నీరు పెట్టుకున్నారు. తన చివరి సినిమాలో నేను మళ్లీ నటుడిగానే పుడతా అని విష్ణువర్ధన్ చెప్పారు. దానికి ఈ చిత్రం  ఫస్ట్ ట్రైలర్ అని నిరూపించింది. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ర్టాలకు సరిపోయే బలం మా సినిమాలో ఉంది. ప్రేక్షకులు తమ కష్టాలను కన్నీళ్లను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలి. ప్రేక్షకులకు ఆ సంతోషాన్ని అందించాలనే తపనతో ప్రతి సినిమా చేస్తాను. ఈ ట్రైలర్ చూసి ఓ పెద్ద నటుడు, నిర్మాత ఫోన్ చేసి విష్ణువర్ధన్ తరహాలో మా నాన్నను  తెరపై చూసుకోవాలనుందని అభినందించారు. శివకుమార్ లాంటి ప్రొడ్యూసర్ ఉంటే పరిశ్రమ ఎప్పుడూ బాగుంటుంది అన్నారు. 

ఈ మధ్యకాలంలో పాము కథాంశంతో సినిమాలు రాలేదు. మంచి సినిమాను  ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాను. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఎగ్జిబిటర్స్ నుండి చక్కటి స్పందన లభిస్తుంది.  బిజినెస్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు తొలి హీరో కోడిరామకృష్ణ అయితే రెండో హీరో మకుట సంస్థ. వారి అందించిన గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ శివకుమార్ నాకు ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. సినిమా రంగంలో నాకు శంకర్, శివకుమార్ తప్ప ఎవరూ తెలియదు. 1988లో మొదటిసారి కోడి రామకృష్ణను సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఓ సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో చూశాను. గ్రామీణ నేపథ్యంలో అమ్మోరు సినిమాను అద్భుతంగా  రూపొందించారాయన. శివకుమార్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం దక్కాలని,  అతడు పెట్టిన డబ్బులు తిరిగిరావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సాయికుమార్, తమ్మలపల్లి రామసత్యనారాయణ, మకుట ప్రతినిధిలు పీటర్, దొరబాబు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మురళి, సుదర్శన్, సురేష్ కొండేటి, గిరిధర్ మామిడిపల్లి, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. రమేష్‌భట్, సాధుకోకిల, ముకుల్‌దేవ్ ప్రధాన పాత్రల్లో  నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెచ్.సి.వేణు, సంగీతం: గురుకిరణ్, అర్ట్: వై  నాగరాజు, పాటలు: శ్రీరామ్ తపస్వి, ఫైట్స్: రవి వర్మ, థ్రిల్లర్ మంజు, ఎడిటింగ్: జోని హర్ష, వి. సురేష్ కుమార్, కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య, చిన్ని ప్రకాష్, ఇమ్రాన్  సర్ధారియా, కలై, నిర్మాతలు: సాజిద్ ఖురేషి, ధవల్ గడ, సొహైల్ అన్సారీ, దర్శకత్వం: కోడి  రామకృష్ణ. 

>4. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'ఏక్త' 

భిక్షమయ్య సంఘం, సుమన్‌రెడ్డి సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'ఏక్త'. నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, రాబిన్‌ సోహి జంటగా నటిస్తున్నారు. ఈ.వి.వి సత్యనారాయణ, బి.జయ, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్‌ వంటి దర్శకుల దగ్గర మాటల రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సుమన్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విరాట్‌ సినిమాస్‌ సమర్పణలో బి.ఎస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ..హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇది. కేరళ, అలెప్పీలో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. అక్టోబర్‌ మధ్యలో రెండో షెడ్యూల్‌ ప్రారంభించి అదే నెలాఖరుకు షూటింగ్‌ మొత్తం పూర్తి చేస్తాం. నసీర్‌ఖాన్‌, మిస్‌ ఇండియా 2013 నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, బాహుబలి ప్రభాకర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. దబు మల్లిక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఆర్మన్‌ మల్లిక్‌ ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..అని తెలిపారు. 

నసీర్‌ఖాన్‌, సలీల్‌ ఆంకోలా, ప్రణతిరాయ్‌ ప్రకాష్‌, బాహుబలి ప్రభాకర్‌, రుషద్‌ రానా, అవ్‌నీత్‌ కౌర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తమశ్యామ్‌ సంగీతం: దబు మల్లిక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సుమన్‌రెడ్డి. 

>5. కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న రోజ్ గార్డెన్ 

అనురాధా ఫిలింస్ డివిజ‌న్ ప‌తాకంపై జి.ర‌వికుమార్ ( బాంబే ర‌వి ) ద‌ర్శ‌కుడిగా చ‌ద‌ల‌వాడ తిరుప‌తి రావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు నిర్మిస్తున్న చిత్రం  రోజ్ గార్డెన్. ఈ సినిమా లాంఛ‌నంగా ఇటీవ‌ల రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభ‌మైంది. మూడు రోజుల పాటు ప‌లు కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించిన అనంత‌రం యూనిట్ కాశ్మీర్ కు బ‌య‌లు దేరి వెళ్ళింది. 

ప్ర‌స్తుతం కాశ్మీర్ లో ఉండే బ‌యాక‌న ప‌రిస్థితుల నేప‌ధ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంది.. కాశ్మీరీ నేప‌ధ్యంగా సాగే ఈ ప్రేమ క‌థ‌ను కాశ్మీర్ లోచిత్రీక‌రిస్తే అందులో జీవం ఉట్టి ప‌డుతుంద‌ని నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు  ప్ర‌స్తుతం కాశ్మీర్ లో ఉన్న ప్ర‌తి కూల ప‌రిస్థితుల‌ను పట్టించు కోకుండా జాతి స‌మ‌గ్ర‌త‌లో భాగంగా త‌న‌కు కాశ్మీర్ ప్ర‌భుత్వంతో ఉన్న పూర్వ ప‌రిచ‌యంతో ఆ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం సంతోషాన్ని వ్య‌క్తం చేసి షూటింగ్ చేసు కోవడానికి అన్ని ర‌కాల అనుమ‌తుల‌తో పాటు భ‌ద్ర‌త‌ను కూడా కల్పిస్తామ‌ని .. ఇక్క‌డ యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉన్నా శాంతి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డం కోసం త‌మ సినిమా షూటింగ్ జ‌రుపుకోవ‌డానికి వ‌చ్చిన చ‌ద‌ల‌వాడ సోద‌రుల‌ను ఆ ప్ర‌భుత్వం అభినందించింది. గ‌తంలో కూడా ఇలాంటి ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు వీరు కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకున్న సంద‌ర్భాన్ని వారు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు..అనురాధా ఫిలింస్ గతంలో రూపొందించిన ఓ సినిమా ను కాశ్మీర్ లో చిత్రీక‌రించడం అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా ఆ సినిమా మొద‌టి ఆట‌ను చూడ‌టానికి ప్రత్యేకమైన హెలికాప్ట‌ర్‌లో రావ‌డం జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ఒక భార‌తీయుడిగా నా బాధ్య‌త  నేను నిర్వ‌ర్తిస్తున్నాను..  కాశ్మీర్ లోఉన్న ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా జీవించాల‌ని కోరుకునే వ్య‌క్తిని నేను అందుకే యుద్ద వాతావ‌ర‌ణం ఉన్నా కూడా నేను కూడా నా వంతు స‌హ‌కారాన్ని అందించ‌డం కోసం ఇక్క‌డ మా సినిమా షూటింగ్ చేస్తున్నాము. కాశ్మీర్ ప్ర‌భుత్వం ఇలాంటి స‌మ‌యంలో మేము వ‌చ్చినందుకు మ‌మ్మ‌ల్ని ఎంతగానో ఆద‌రిస్తున్నారు. వారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు జి.ర‌వికుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ ఉగ్ర‌వాద క‌లాపాల నేప‌ధ్యంలో జ‌రిగే ప్రేమ క‌థా చిత్రం ఇది.ఈ సినిమా ద్వారా నితిన్ నాష్ అనే యువ‌కుడు క‌థా నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు .. ఇది ఫీల్ ఉన్న ఫ్రెష్ ప్రేమ క‌థా చిత్రం.. నేను ఈ సినిమాను కాశ్మీర్ నేప‌ధ్యంలో జ‌రిగే విధంగా రాసుకున్నాను.  నిర్మాత నా క‌థ‌ను ఇష్ట‌ప‌డి నువ్వు ఎలా అనుకుంటే అలా చేయ‌మ‌ని పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు.. ఇక్క‌డ ప్ర‌తి కూల ప‌రిస్థితులు ఉన్నా కూడా భ‌య‌ప‌డ‌కుండా కాశ్మీర్ లోనే షూటింగ్ చేయ‌డానికి అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించారు. 

ఈ సినిమాలో నితీనాశ్‌, ఫ‌ర్జాజ్ శెట్టి లు జంట‌గా న‌టిస్తుండ‌గా మిగిలిన  పాత్ర‌ల్లో పోసాని కృష్ణ‌ముర‌ళి , ర‌జిత, ధ‌న్ రాజ్ , గౌతం రాజ్. శివ‌స‌త్య‌నారాయ‌ణ‌,, మ‌హేష్ మంజ్రేక‌ర్‌,త్యాగ‌రాజ‌న్‌, మిలింద్ గుణ‌జీ,అన్ హాధ్  త‌దిత‌రులు న‌టిస్తున్నారు 

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు,  నిర్మాతః చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు,ఎడిటిర్ః బ‌ల్లు స‌లూజ ( లగాన్‌.జోదా అక్బ‌ర్ ఫేం)  పాట‌లుః ఎ.యం.ర‌త్నం, స్ర్కీన్ ప్లే,, మాట‌లుః సంగీతంః ద‌ర్శ‌క‌త్వంః జి.ర‌వికుమార్ (బాంబేర‌వి). 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs