Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (27-9-16)..!


>1. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా న‌రుడా..!డోన‌రుడా..! థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు.  గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్ ను సూపర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసి సుమంత్ అండ్ టీంకు అభినంద‌న‌లు తెలియజేశారు. వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో పాటు, టైటిల్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. సోష‌ల్ మీడియాలో ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన సుమంత్‌ను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వీర్య‌దాత విక్కీగా సుమంత్ న‌ట‌న‌తో పాటు త‌నికెళ్ళ‌భ‌ర‌ణి అసిస్టెంట్‌గా సుమ‌న్‌శెట్టి, హీరోయిన్ ప‌ల్ల‌వి సుభాష్‌లు త‌మ‌దైన శైళిలో ట్రైల‌ర్ క‌నువిందు చేశారు. 

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌. 

>2. 14 రీల్స్ గర్వంగా అందిస్తున్న చిత్రం 'హైపర్' – చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సెన్సార్‌ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా.... 

నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ...సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. రామ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ థియేట‌ర్స్ లో హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈనెల 29న యు.ఎస్ లో ప్రీమియ‌ర్ షోస్ ప్లాన్ చేసాం. యు.ఎస్ లో మొత్తం 92 స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న ప్రారంభించిన ఈ చిత్రాన్ని 72 రోజులు షూటింగ్ చేసి పూర్తి చేసాం. ఈ సినిమా ప్రారంభోత్స‌వం రోజే ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తాం అని ఎనౌన్స్ చేసాం. వైజాగ్, హైద‌రాబాద్ లో వ‌ర్షాలు ప‌డ‌డంతో నాలుగు రోజులు షూటింగ్ కి  ఇబ్బంది అయ్యింది. మిగ‌తా అంతా మేం ప్లాన్ చేసిన‌ట్టే జ‌రిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ బాగా కోప‌రేట్ చేయ‌డంతో అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసాం. అబ్బూరి ర‌వి సంద‌ర్భానుసారంగా మంచి డైలాగ్స్ అందించారు. మంచి క‌థ‌తో ఓ మంచి సినిమా చేసాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం అన్నారు.

డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ...అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైప‌ర్ మంచి సినిమా. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌తి తండ్రి - కొడుకుకు న‌చ్చే సినిమా ఇది.రామ్ తో సినిమా చేద్దాం అనుకున్న త‌ర్వాత కందిరీగ కంటే బెస్ట్ మూవీ చేయాలి ఎలాంటి సినిమా చేయాలి అని నిర్ణ‌యించ‌డం కోస‌మే 4 నెలలు డిస్క‌ష‌న్స్ చేసి ఈ క‌థ‌ను ఫైన‌ల్ చేసాం. మంచి క‌థ చెబితే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స‌క్సెస్ - ఫెయిల్యూర్ మ‌న చేతుల్లో ఉండ‌వు కాబ‌ట్టి వాటి గురించి ఆలోచించకుండా ఓ మంచి సినిమా అందిస్తున్నాం. ఈ మూవీ కోసం ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ డే & నైట్ వర్క్ చేసారు. నేను కాంప్ర‌మైజ్ అయ్యానేమో కానీ...మా నిర్మాత‌లు మాత్రం కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే మ‌ణిశ‌ర్మ ఎక్స్ ట్రార్డిన‌రీ రీ రికార్డింగ్ అందించారు అన్నారు.

నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ...14 రీల్స్ ఈ హైప‌ర్ చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది అంటే 99% క్రెడిట్ డైరెక్ట‌ర్ వాసుకే చెందుతుంది. ఈ సినిమా ధియేట‌ర్స్ కి తండ్రి - కొడుకు క‌లిసి వ‌స్తే..ఓ కూప‌న్ ఇస్తారు. అలా వ‌చ్చిన కూప‌న్స్ లో డ్రా తీసి గెలిచినవాళ్ల‌కు చ‌దువుకునేందు గాను 5 ల‌క్ష‌లు అంద‌చేయ‌నున్నాం అన్నారు.

నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ... వాసు మోచ్యూర్డ్ డైరెక్ట‌ర్. రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది అని మా న‌మ్మ‌కం. ఈ సినిమాలో ఫాద‌ర్ - స‌న్ రిలేష‌న్ తో పాటు మ‌రో యాంగిల్ ఉంది. అది ఈ సినిమాని మ‌రో స్టెప్ ముందుకు తీసుకెళుతుంది అన్నారు.

>3. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ కు రెడి అయిన 'మనీ ఈజ్ హని'.

శ్వేతశ్రీ క్రియోషన్స్ పతాకంపై, నూతన నటీనటులను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో, జాలే వాసుదేవనాయుడు నిర్మిస్తున్న చిత్రం 'మనీ ఈజ్ హని'. ఈ సినిమా అన్ని కార్యక్రామలను పూర్తి చేసుకొని సెన్సార్ కు రెడి అయ్యింది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాలే వాసుదేవనాయుడు మాట్లాడుతూ: నూతన నటినటులతో నేను నిర్మిస్తున్న మనీ ఈజ్ హని రిలీజుకు రెడి అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అడియోను వచ్చేనెల 15న సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలచేస్తాము అని అన్నారు. దర్శకుడు జనార్ధన్ మాట్లాడుతూ: సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.నన్ను నా కధను నమ్మి నాకు పుర్తి స్వేచ్చ ఇచ్చిన నా నిర్మాత జాలే వాసుదేవనాయుడు గారికి ధన్య వాదములు. నాకు అన్ని విధాలుగా సహకరించిన నటినటులకు టేక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు.

ముఖ్య తారాగణం: జే.వి.నాయుడు, రోషన్, జి.ఎమ్మార్, వెంకీ, ఆషిక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పొకల తదితరులు. మ్యూజిక్ డైరెక్టర్: జి. వసంత్, డి.ఓ.పి: రాజా చక్రం, లిరిక్స్: గుంజా శ్రీను, ఎడిటర్: బి.మహీ. నిర్మాత: జాలే వాసుదేవనాయుదు, కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: జనార్ధన్ శివలంకి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs