Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (22-9-16)..!


>1. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, లింగుస్వామి, జ్ఙాన్‌వేల్ రాజా కాంబినేష‌న్ ద్విభాషా చిత్రం

Advertisement
CJ Advs

వ‌రుస రికార్డు చిత్రాల‌తో రేసుగుర్రం లా దూసుకుపోతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తెలుగు, త‌మిళం లో తిరుగులేని స్టైలిష్ మేక‌ర్ గా గుర్తింపుపొందిన జ్ఙాన‌వేల్ రాజా నిర్మాత‌గా, సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడ‌క్ష‌న్‌-12 గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపోందుతున్న చిత్ర వివ‌రాలు చెన్నై లో పాత్రికేయుల స‌మావేశంలో తెలిపారు. 2016 స‌మ్మ‌ర్ లో స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌ట‌మేకాక 2016 బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా ఇప్ప‌టికి చెర‌గ‌ని రికార్డుల‌తో ప్ర‌స్తుతం దువ్వాడ జ‌గన్నాథం చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ 18 వ చిత్రం గా స్టూడియోగ్రిన్ 12 చిత్రం గా తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే తెలుగు, కన్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంతో త‌మిళం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్ప‌టికే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, నిర్మాత జ్ఙాన‌వేల్ రాజా, ద‌ర్శ‌కుడు లింగుస్వామి పాత్రికేయుల‌కి తెలియజేశారు.

అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడంపై సీనియర్ యాక్టర్ శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారని ఆశించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.... నాకు చెన్నై గా పేరు మారకుముందు నుంచి అంటే మద్రాస్ తో ఎంతో అనుబంధం ఉంది. నాకు లోకల్ ప్లేస్ లాగే అనిపిస్తుంది. నన్ను మీరు స్థానికుడిగా భావించొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తమిళంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో చాలా ఆలోచించాం. ఓ మంచి డైరెక్టర్ ద్వారానే ఇంట్రడ్యూస్ కావాలనుకున్నాను. నన్ను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న లింగుస్వామికి, జ్ఞానవేల్ రాజాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని అన్నారు. 

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.... చాలా రోజులుగా నేను ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాను. అల్లు అర్జున్ ని తమిళంలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం రావడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నాను. అని అన్నారు. ఫిబ్రవరి ద్వితియార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం. 

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు కలిసిన స్టార్స్ లో మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్ వర్కింగ్ స్టార్ అల్లు అర్జున్. చెన్నైలో చాలా మందికి అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్సులంటే ఇష్టం. అందుకే ఆయనతో ఓ మంచి కథతో తమిళంలో సినిమా చేయాలనుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది.  అని అన్నారు.

>2. అక్టోబర్ 7న కార్తీ 'కాష్మోరా' ఆడియో, ట్రైలర్ విడుదల

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాతలు మాట్లాడుతూ - కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కార్తీ డిఫరెంట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ను అక్టోబర్ 7న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం.  అన్ని విధాలుగా ఓ డిఫరెంట్‌ చిత్రంగా రూపొందుతున్న 'కాష్మోరా' తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది.. అన్నారు. 

హీరో కార్తీ మాట్లాడుతూ - కాష్మోరాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా వైవిధ్యమైన సినిమా. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది..అన్నారు. 

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌. ​

>3. 'ఏమిసోద‌రా..మ‌న‌సుకేమైందిరా' షూటింగ్ ప్రారంభం

శరత్‌ కల్యాణ్‌, హనిగుప్త, మోహన్‌ వత్స, ఉపాసన హీరో హీరోయిన్లుగా జె.వి.ఆర్‌.సినిమాస్‌, వైష్ణవి ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై  శ్రీనివాస్‌ నేదునూని దర్శకత్వంలో జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి నిర్మాతలుగా నూతన చిత్రం 'ఏమి సోదరా..మనసుకేమైందిరా' గురువారం ఉదయం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లోని దైవ సన్నిధానంలో లాంచనంగా ప్రారంభమైంది. తొలి స‌న్నివేశానికి తెలంగాణ మినిష్ట‌ర్ జగదీష్‌శ్వర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత జె.వి.ఆర్‌, య‌మ‌ధ‌ర్మ‌రాజుగా, తాగుబోతు ర‌మేష్ చిత్ర‌గుప్తుడిగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ భోజ్‌పురి హీరోయిన్ రాణి చ‌టర్జీ స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

కొత్త నటీనటులు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. నిర్మాతగానే కాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్ర యమధర్మరాజుగా నటిస్తున్నానని నిర్మాత‌ల్లో ఒక‌రైన జె.వి.ఆర్ తెలియ‌జేశారు. రెండు వంద‌ల‌కు పైగా బోజ్‌పురి చిత్రాల్లో న‌టించి తెలుగులో ఏమిసోద‌రా..మ‌న‌సుకేమైందిరా చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నాను రాణి ఛ‌ట‌ర్జీ తెలియ‌జేశారు. వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద ట్రయినింగ్‌ తీసుకున్న శరత్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోగా నటిస్తున్నాడు. యాక్టర్స్‌ అందరూ కొత్తవాళ్ళే. ఈ చిత్రంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ గురించి చూపించబోతున్నాం. కానీ ప్రేమికుల గురించి ఈ సినిమాలో చూపించ‌మ‌ని ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల్లో ఒక‌రైన శ్రీనివాస్ నేదునూరి తెలియ‌జేశారు. మంచి టైటిల్‌తో సినిమా స్టార్ట్‌ చేశాం. దర్శకుడు శ్రీనివాస్‌గారు చెప్పిన కథ నచ్చింది. సినిమా ఆడియెన్స్‌కు నచ్చే విధంగా తెరకెక్కిస్తామ‌ని నిర్మాత దేశ్‌ముఖి రాజు యాద‌వ్ చెప్పారు. 

ఈ కార్యక్ర‌మంలో శ‌ర‌త్ క‌ల్యాణ్‌, మోహ‌న్ వ‌త్స‌, జెమిని వినోద్ , మ్యూజిక్ డైరెక్ట‌ర్ మెలోడీ శ్రీనివాస్‌,కృష్ణుడు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి ఆర్ట్‌: వాల్మీకి, సంగీతం: మెలోడి శ్రీనివాస్‌, కెమెరా: మురళీకృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావ్‌, నిర్మాతలు: జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ నేదునూరి.

>4. ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓషో తులసీరామ్‌ నూతన చిత్రం 

'మంత్ర, మంగళ' వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌..త్వరలో ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. అర్చన(వేద) ప్రధాన పాత్రలో జైలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది.

>5. `రంగం` ఫేమ్ జీవా, కాజల్ అగర్వాల్ `ఎంత వరకు ఈ ప్రేమ`

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. అయితే ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాను. `ఎంతవరకు ఈ ప్రేమ` అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం.  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం.సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో అల్రెడి రెండు ఏరియాల బిజినెస్ కూడా పూర్త‌య్యింది. మిగిలిన ఏరియాస్ కు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.. అన్నారు. 

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs