ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). జిబ్రాన్ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను బుధవారం విడుదల చేశారు.
ఈ పాటకు వస్తోన్న రెస్పాన్స్ గురించి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశాం. అన్నిచోట్ల నుంచి ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జిబ్రాన్ చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ చేశారు. మొదటి పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అవుతుందన్న మా నమ్మకం రెట్టింపు అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
నాలుగు పట్టణాల్లో 'ఈడు గోల్డ్ ఎహే' ఆడియో రిలీజ్
డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను నాలుగు పట్టణాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ - ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఎం. శర్మ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. ఈ చిత్రంలోని పాటలను నాలుగు పట్టణాల్లో విభిన్నంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం. ఈ ఆల్బమ్‌లోని మొదటి పాటను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో, రెండో పాటను 22న వైజాగ్‌లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను సెప్టెంబర్ 24న విజయవాడలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్‌లోకి విడుదలవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
స్టార్ సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, డా నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్ అక్షిత్, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, విజయ్, జోష్ రవి, పి.డి.రాజు, పవన్, గణేష్, కోటేశ్వరరావు, జగన్, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 22న ధనుష్ 'రైల్' విడుదల
రఘువరన్ బి.టెక్, అనేకుడు, మాస్, మరియన్ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రైల్'. ఆదిత్య మూవీ కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ - ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రఘువరన్ బి.టెక్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో హీరో ధనుష్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రైల్' ధనుష్‌కి తెలుగులో మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
ధనుష్, కీర్తి సురేష్, తంబి రామయ్య, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్ మహేంద్రన్, ఎడిటింగ్: ఎల్.వి.కె.దాస్, ఫైట్స్: స్టన్ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్.