Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (12-9-16)..!


>1. నేచురల్‌ స్టార్‌ నాని 'మజ్ను' సెన్సార్‌ పూర్తి - వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్‌ 23 విడుదల 

Advertisement
CJ Advs

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సునీల్‌ నారంగ్‌ చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ. 

>2. 'సిద్ధార్ధ` టీమ్‌ను విష్ చేసిన మోహ‌న్‌లాల్ 

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన రెండు తెలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి `మ‌న‌మంతా`. రెండోది `జ‌న‌తా గ్యారేజ్‌`. ఈ నేప‌థ్యంలో  మోహ‌న్‌లాల్ మ‌రో తెలుగు సినిమా గురించి ప్ర‌స్తావించారు. అయితే ఈ సారి ఆయ‌న ప్ర‌స్తావించిన చిత్రంలో ఆయ‌న న‌టించ‌లేదు. అయినా ఆ సినిమా గురించి, అందులోని నాయిక‌ను ఉద్దేశించి ప్ర‌స్తావించ‌డం విశేషం. మోహ‌న్‌లాల్ ప్ర‌స్తావించిన ఆ సినిమా పేరు `సిద్ధార్థ‌`. సాగ‌ర్‌  హీరోగా న‌టించిన ఈ చిత్రం  ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.  లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.  దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. 

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ...మా సినిమా టీమ్‌ను, మా చిత్ర క‌థానాయిక రాగిణిని విష్ చేస్తూ మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ `ఆల్ ది బెస్ట్ రాగిణి ఫ‌ర్ యువ‌ర్ న్యూ తెలుగు మూవీ సిద్ధార్థ` అని ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన‌డం ఆనందంగా ఉంది. 

మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి.  ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం...అని తెలిపారు. .

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.

>3. డబ్బింగ్ కార్యక్రమాల్లో 'డర్టీగేమ్‌' 

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ..దర్శకుడు పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పూర్తి చేసుకుంది.  డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట శంకర్ రావు గారు డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వర్తమాన రాజకీయ నేపథ్యంతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి.. అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము..అని అన్నారు. 

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, సురేష్‌, కోట శంకర్ రావు, అస్మిత, రమ్య, తాడి మనోహర్‌ నాయుడు, జబర్ధస్త్‌ టీమ్‌ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాత: తాడి మనోహర్‌ కుమార్‌, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs