Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (10-9-16)..!

tollywood tajaa updates,tollywood tazaa updates,september 10th,hyper,hyper shooting completed,ram,vikram,inkokkadu success tour,siddhartha,siddhartha release date,kathilanti kurradu,kathilanti kurradu songs recording | టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (10-9-16)..!

>1. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ 'హైపర్‌` షూటింగ్ పూర్తి 

Advertisement
CJ Advs

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమాలో సాంగ్స్‌ను జార్జియాలో చిత్రీక‌రించ‌డంతో సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.  సినిమాకు సంబంధించిన నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ రెండో వారంలో ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

>2. సెప్టెంబ‌ర్ 16న 'సిద్ధార్ధ`విడుద‌ల 

సాగ‌ర్  హీరోగా న‌టించిన `సిద్ధార్థ‌` ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  చిత్రం `సిద్ధార్థ‌`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.  దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. సెన్సార్ పూర్త‌యింది.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ...మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాం. నాలుగు పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది. సాగ‌ర్  బుల్లితెర‌మీద ఎంత‌టి పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. `సిద్ధార్థ‌`లో ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను ప్లే చేశారు.  ఈ సినిమాతో వెండితెర అభిమానులు కూడా ఆయ‌నికి అభిమానులుగా మారుతారు. ఎస్‌.గోపాల్‌రెడ్డిగారిలాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో  ప‌నిచేయ‌డం మా అదృష్టం. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.. అని తెలిపారు.

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.

>3. పాటల రికార్డింగ్ లో `కత్తిలాంటి కుర్రాడు`

విస్సు శ్రీ హీరోగా భద్రాద్రి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న కొత్త చిత్రం `కత్తిలాంటి కుర్రాడు`. జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వి.సత్యానంద్ సినిమాటోగ్రఫీని అందించనున్నారు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. దసరా రోజున షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ  హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి వారి వివరాలను తెలియజేస్తారు.

>4. `ఇంకొక్క‌డు` విజ‌య‌యాత్ర‌

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. ఆనంద‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుద‌ల చేశారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయిన నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ రేపు వైజాగ్‌లో విజ‌య‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ అధినేత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ..విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరైన నటుడు చియాన్ విక్ర‌మ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. అఖిల‌న్‌, ల‌వ్ అనే పాత్ర‌ల్లో ఆయ‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. విక్ర‌మ్ త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నే రేంజ్‌లో ల‌వ్ పాత్ర‌ను ఆయ‌న తెర‌పై ఎక్స‌లెంట్‌గా పండించారు. ఆనంద్ శంక‌ర్ టేకింగ్‌, న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌ల న‌ట‌న, హై టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచాయి. సెప్టెంబ‌ర్ 8న విడుద‌లైన మా ఇంకొక్క‌డు చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద స‌క్సెస్ చేసినందుకు వారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి విక్ర‌మ్ స‌హా యూనిట్ స‌భ్యులంద‌రూ వైజాగ్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు సినీ కాంప్లెక్స్‌, 12 గంట‌ల‌కు వి మ్యాక్స్‌కు వస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేశాం.. అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs