నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని తన పేరుని గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్రకటించారు. అప్పటి నుండి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. యాదృచ్చికంగా బాలకృష్ణ కూడా తన తల్లి పేరుతో ఉన్న బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు గర్వపడేలా చేస్తున్నారు. అలాగే రాజసూయం షూటింగ్ ప్రారంభమైన నిన్న (సెప్టెంబర్6న) బాలకృష్ణ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం కావడం, అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన రోజునే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో రాజసూయ యాగం చిత్రీకరణ ప్రారంభమవడం దైవ సంకల్పమే కాక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు అని చెప్పవచ్చు.
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన గురించి నందమూరి బాలకృష్ణ సినిమా తీస్తున్నాడనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. అందరి అంచనాలను అందుకునేలా సినిమాను దర్శకుడు జాగర్లమూడి క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 29న మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.
>2. నందమూరి కళ్యాణ్‌రామ్, పూరి జగన్నాథ్‌ల 'ఇజం' టీజర్‌కు 1 మిలియన్ వ్యూస్డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 5న పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 48 గంటలలోపే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలోని కళ్యాణ్‌రామ్ లుక్‌కి మంచి అప్రిషియేషన్ వస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'ఇజం' చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ముఖేష్, ఎడిటింగ్: జునైద్, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: జానీ, కో-డైరెక్టర్: గురు, మేకప్ చీఫ్: బాషా, కాస్ట్యూమ్స్ చీఫ్: గౌస్, ప్రొడక్షన్ చీఫ్: బి.అశోక్, కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విన్, స్టిల్స్: ఆనంద్, మేనేజర్స్: బి.రవికుమార్, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్, క్యాషియర్: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
>3. ఇంకొక్కడు సెన్సార్ పూర్తి...సెప్టెంబర్ 8న గ్రాండ్ రిలీజ్శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇంకొక్కడు'. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ -'విలక్షణ నటనటకు విక్రమ్ పెట్టింది పేరు. ఆయన చిత్రాలకు ఇక్కడ ఉన్న ఆదరణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆయన చిత్రాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తుంటారు. తాజాగా అదే కోవలో చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇంకొక్కడు. అఖిల్, లవ్ అనే రెండు పాత్రల్లో విక్రమ్ అలరించడం ఖాయం. థియేట్రికల్ ట్రైలర్ చూసిన వారందరికీ విక్రమ్ లవ్ గెటప్ బాగా నచ్చింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. విక్రమ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో సినిమా సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది'.. అన్నారు.